Featuredస్టేట్ న్యూస్

సీనియర్లంతా పార్లమెంటుకేనా..!

ప్రత్యర్థులంతా మిత్రులవుతున్నారు.. ఎన్నికల ముందు అధికార పార్టీతో తాడోపేడో తెల్చుకుంటూ మాటల తూటాలతో రణరంగమే సృష్టించిన నాయకత్వమంతా అధికార పక్షం చేరుతుంది.. ఎవరో ఏటూ వైపో, ఎవరూ ప్రజల వైపో, మరెవరు అధికార పక్షం వైపో తెలియక సతమతమవుతున్నారు ఓటర్లు. తెలంగాణ అధినేత కెసిఆర్‌పై బరిలో దిగిన కాంగ్రెస్‌ నాయకుడు హోరాహోరీ పోరులో బలమైన వాదాన్ని వినిపించాడు. ఒకనోక సందర్భంలో విజయాన్ని చేజిక్కించుకుంటారనే ఆలోచన కలిగించిన ఆ అభ్యర్థి నేడు అధికార పార్టీ తీర్థం తీసుకున్నాడు. ముందు ముందు ఎవరెవరితో నష్టం ఉంది, ఎవరెవరితో పార్టీ బలంగా మారుతోంది అనే కొత్త ఆపరేషన్‌ను కెసిఆర్‌ మొదలెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదురులేని పార్టీగా మార్చాలని ఆలోచనతో ప్రత్యర్థిలో బలంగా ఉన్న నాయకగణాన్ని సైతం తమ వైపు తిప్పుకునేలా పావులు కదుపుతున్నాడు గులాబీ అధినేత. పార్టీలో ఉన్న సీనియర్లందరిలో పార్లమెంట్‌కు పోటీ చేయిస్తూ కొత్త తరానికి అవకాశం ఇస్తూ, బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసి, తనయుడు కెటిఆర్‌ పట్టాభిషేకానికి అంతా సిద్దం చేస్తున్నట్లే కనిపిస్తుంది…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలి.. అవసరమైతే ప్రతిపక్షాన్ని కూడా పూర్తిగా బలహీనపరుస్తూ ప్రశ్నించేగొంతులను అన్నింటిని స్నేహపూర్వకంగానే, పదవి ఆశచూపే, మరేదైనా కాని తమ పార్టీలో కలుపుకొని వారికి పెద్దపీట వెయ్యాలి. అవసరమైతే పార్టీలో ఉన్న అగ్రనేతలందరిని పార్లమెంట్‌కు పంపి, తన కుమారుడు కెటిఆర్‌కు అడ్డులేకుండా చేయాలని ఆలోచనతో కెసిఆర్‌ కొత్త ఆపరేషన్‌ ప్రారంభించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే వంటేరు ప్రతాప్‌రెడ్డి తెరాసలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎవరెవరితో సమస్య ఉంటుంది, ఎవరెవరిని పార్టీలో చేర్చుకుంటే లాభం ఉంటుందని ఆలోచనతో కెసిఆర్‌ కసరత్తులు చేస్తున్నారని పార్టీ సీనియర్‌ నాయకులు అంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే మంత్రివర్గంలో కూడా ఎవ్వరెవ్వరికి అవకాశం ఇవ్వాలి. ఎవరిని పక్కన పెట్టాలి. ఎవ్వరిని పార్లమెంట్‌కు పంపుతే బాగుంటుంది అని పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. దేశంలో పెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పడాలంటూ దేశం మొత్తం తిరుగుతున్నా కెసిఆర్‌, హైదరాబాద్‌లో ఉన్న జగన్‌ కూడా తన కుమారుడు కెటిఆర్‌తో కలిపించాడు. దేశంలోని మూడో ఫ్రంట్‌కు మద్దతు పలకాలని భేటీ అయ్యారు. ఒక్క పక్క నూతన ఫ్రంట్‌ పేరుతో తెలంగాణలో ఉన్న పార్టీ సీనియర్లనందరిని లోక్‌సభ, రాజ్యసభకు పంపిస్తూ ఇక్కడ కెటిఆర్‌ సిఎం కావడానికి అడ్డులేకుండా చేయాలని ప్రయత్నంలో ఉన్నారు. అందుకు ప్రతిపక్షంలో ఉన్న బలమైన నాయకులందరిని తెరాసలో ఆహ్వానించే నూతన ఆపరేషన్‌ను కెసిఆర్‌ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

            కెసిఆర్‌ తర్వాత టిఆర్‌ఎస్‌ పార్టీలో రెండవ అగ్రనేత హరీశ్‌రావు అని పేరుంది. అది అందరికి తెలిసిన విషయమే. కాని రోజురోజుకు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే హరీష్‌రావు స్థానమెంటో అర్థమే కావడం లేదంటున్నారు ఆయన సన్నిహితులు, అభిమానులు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యెగా ఆసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు హరీష్‌రావు. ఆయనకు రాష్ట్రమంతటా మంచి జనాదరణ ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. తెరాస పార్టీ విజయానికి తన శాయశక్తులా కృషిచేశారు. తెలంగాణ పోరాటంలో ఆయన చేసిన సేవలు, ఉద్యమాలు వెలకట్టలేనివి. అప్పటినుంచి అయన నిత్యం పోరాడుతూ ప్రజల అభివృద్దికోసం పాటుబడుతూ ఉంటున్నారు. ఒక లెజెండ్‌గా పేరు సంపాదించిన హరీశ్‌రావు పరిస్థితి మాత్రం ఇప్పుడు తీసుకట్టుగా మారిపోయింది. ఇప్పటికే టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కెసిఆర్‌ కుమారుడు కెటిఆర్‌కు బాధ్యతలు అప్పగించడంతో తెరాస పార్టీలో హరీశ్‌రావు స్థానాన్ని, ఆయన ప్రాధాన్యతను తగ్గించారు. తాజాగా వంటేరు తెరాసలో చేరికతో ఆయన పరిస్థితి మరింత దిగజారిందని చెప్పుకుంటున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి కెసిఆర్‌ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ స్థానం బాధ్యతలను హరీశ్‌రావే ఇన్ని రోజులు దగ్గరుండీ మరీ చూసుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్‌ గెలుపుకోసం హరీశ్‌రావు ఇరవైనాలుగు గంటలు అక్కడే శ్రమించి పనిచేశారు. విజయాన్ని తమ భుజాలపై వేసుకుని ప్రత్యర్థి బలంగా ఉన్న కూడా ఎత్తులకు, పై ఎత్తులు వేస్తూ కెసిఆర్‌ను గెలిపించాడు. ఎన్నికల హడావుడీలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను తిరుగుతున్నా కెసిఆర్‌ సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదు. అక్కడ కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్న అభ్యర్థి బలంగా ఉండడంతో హరీశ్‌రావే అన్ని తానై చూసుకుంటూ మామ కెసిఆర్‌ను గెలిపించారు. కాని ఇక్కడ కెసిఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో గజ్వేల్‌లో గులాబీ పార్టీ బాధ్యతలు వంటేరు చేతిలోకి వెళ్లినట్లేనని చెబుతున్నారు టిఆర్‌ఎస్‌ నాయకులు.. 

సిద్ధిపేటకే పరిమితం కానున్న హరీష్‌రావు

పార్టీలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మంచిపేరు ఉన్న హరీశ్‌రావు ఇప్పుడు కేవలం సిద్దిపేటకే సాదాసీదా ఎమ్మెల్యేగా పరిమితమవ్వాల్సిందే.. వంటేరు చేరికతో హరీశ్‌రావుకే అధిక నష్టం జరిగిందన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో పదవి లేదు. మంత్రి పదవి ఇంకా రాలేదు. అది ఇంకా వస్తుందో, లేదో కూడా అర్థం కావట్లేదు. గజ్వేలు బాధ్యతలు చేతి నుంచి జారిపోయాయి. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌లో హరీశ్‌ భవితవ్యంపై ఆయన సన్నిహితుల్లో, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కొంతకాలంగా కెసిఆర్‌, కెటిఆర్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లాపై కూడా ప్రధానంగా దృష్టిసారించారు. ఆపరేషన్‌ మెదక్‌ పేరుతో టిఆర్‌ఎస్‌ను జిల్లాలో బలోపేతం చేస్తున్నారు. జిల్లాలో తనకు సన్నిహితుడైన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ పదవినిన కెటిఆర్‌ ఇటీవలే ఇప్పించారు. జిల్లావ్యాప్తంగా పలువురు నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. వారిలో పలువురికి కీలక పదవులు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా మెదక్‌లో హరీశ్‌రావు ప్రాబల్యాన్ని రోజురోజుకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close