అందని ఆహ్వానం

0

  • జగన్‌, కేసీఆర్‌ లు దూరమే
  • డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌కు ఆహ్వానం
  • 23న జరిగే మీటింగ్‌ హాజరుకావాలని పిలుపు

ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే పొలిటికల్‌ హీట్‌ తారా స్థాయికి చేరుతోంది. కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. మరోవైపు ఈ రెండు పార్టీలూ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమితో నేషనల్‌ ఫ్రంట్‌ను అధికారంలోకి తెచ్చే దిశగా కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధాని కుర్చీ ఫెడరల్‌ ఫ్రంట్‌కే దక్కాలని కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారు. అవసరమైతే బయటి నుంచి కాంగ్రెస్‌ మద్దతు తీసుకోవాలనేది టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత ఆలోచన. ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఆ పార్టీలకు చెందిన ఎవరో ఒకరికి ప్రధాని పీఠాన్ని కట్టబెట్టాలనేది కేసీఆర్‌ వ్యూహం. అందులో భాగంగా కేరళ సీఎం పినరయి విజయన్‌ ను కలిసి మద్దతు కోరారు సీఎం కేసీఆర్‌. గత సోమవారం డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ ను కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై సుమారు ఇరువురు నేతల మధ్య గంటన్నర పాటు చర్చ జరిగింది. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు గురించి చెప్పి, జాతీయ రాజకీయాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ వస్తే ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటాయని చెప్పి ఫెడరల్‌ ఫ్రంట్‌ కు మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. అయితే డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ కేసీఆర్‌ ప్రతిపాదనను స్టాలిన్‌ సునితంగా తిరస్కరించారు. తాము బీజేపీయేతర కూటమిలో ఉన్నామని, అవకాశం ఉంటే తమరు కూడా బీజేపీయేతర కూటమిలో చేరాలని, తమ మద్దతు ప్రకటించాలని స్టాలిన్‌ కేసీఆర్‌ను కోరారు. దీంతో కేసీఆర్‌కు స్టాలిన్‌ పెద్ద షాక్‌ ఇచ్చినట్టు అయ్యింది. డీఎంకే పార్టీకి కాంగ్రెస్‌ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయని అంతేకాకుండా తాము బీజేపీ యేతరకూటమికి మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారట స్టాలిన్‌. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ప్రధాని మంత్రి చేసేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని తేల్చి చెప్పారట. తాజాగా యుపిఎ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీన యుపిఎ భాగస్వామ్య పార్టీలతో, ఎన్డీఎయేతర పార్టీలతో తలపెట్టిన సమావేశానికి హాజరు కావాలని కొన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే సోనియాగాంధీ యూపీఏ మద్దతుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఒడిస్సా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కు ఫోన్‌ చేసి మద్దతు ఇవ్వాలని కోరిన ఆమె పలు పార్టీల అధినేతలకు లేఖలు రాశారు. తాజాగా గురువారం తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ కు ఆహ్వానం పలికనట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు రోజులు సమీపిస్తున్న కొద్దీ దేశరాజకీయాలు హాట్‌ టాపిక్‌ గా మారుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే ఛాన్స్‌ లేదని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. ఈసారి ఏర్పడబోయే కేంద్రప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలు కీ రోల్‌ పోషించబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా ప్రాంతీయ పార్టీలకు గాలం వేసే పనిలో పడ్డాయి జాతీయ పార్టీలు. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేరుగా యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీని రంగంలోకి దించింది. ఇప్పటికే సోనియాగాంధీ యూపీఏ మద్దతుకు వ్యూహాలు రచిస్తున్నారు.  ఒడిస్సా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కు ఫోన్‌ చేసి మద్దతు ఇవ్వాలని కోరిన ఆమె పలు పార్టీల అధినేతలకు లేఖలు రాశారు. తాజాగా గురువారం తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ కు ఆహ్వానం పలికనట్లు తెలుస్తోంది. స్టాలిన్‌ కు సోనియాగాంధీ నుంచి ఆహ్వానం అందినట్లు డీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. ఈనెల 23న జరిగే ప్రతిపక్షాల భేటీకి హాజరు కావాలని సోనియాగాంధీ నుంచి పిలుపు వచ్చినట్లు ప్రకటించింది.  ఇకపోతే డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ యూపీఏ కూటమికి ఇప్పటికే మద్దతు ప్రకటించారు. యూపీఏ కూటమికి మద్దతుగానే ఎన్నికల బరిలో నిలిచారు. అంతేకాదు రాహుల్‌ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అంటూ స్పష్టం చేసిన తొలినేత కూడా స్టాలిన్‌ కావడం విశేషం. 

యుపిఎ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీన యుపిఎ భాగస్వామ్య పార్టీలతో, ఎన్డీఎయేతర పార్టీలతో తలపెట్టిన సమావేశానికి హాజరు కాకూడదని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధినేత కె. చంద్రశేఖర రావు, వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి హాజరు కావడం లేదని సమాచారం. పైగా వారికి సోనియా నుంచి వ్యక్తిగతంగా ఆహ్వానం అందలేదని సమాచారం. కేసీఆర్‌, జగన్మోహన్‌ రెడ్డిలకు సోనియా నుంచి ఆహ్వానం అందనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. సమావేశానికి ఇంకా కొద్ది రోజులు ఉంది. అయితే, ఇప్పటి వరకు తమకు ఆహ్వానం అందలేదని టీఆర్‌ఎస్‌, వైసిపి నాయకులు అంటున్నారు. సోనియా ఆహ్వానించినా కూడా సమావేశానికి వెళ్లకూడదని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తమకు సోనియా నుంచి ఏ విధమైన ఆహ్వానం అందలేదని వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. అయితే, ముఖ్యమైన నేతలకు ఆహ్వానాలు పంపించడం కాకుండా తానే వ్యక్తిగతంగా మాట్లాడాలని సోనియా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తో ఆమె మంగళవారం మాట్లాడారు. సోనియా గాంధీ స్వయంగా ఆహ్వానించినా కూడా కేసీఆర్‌, జగన్‌ సమావేశానికి హాజరు కాకపోవచ్చునని అంటున్నారు. కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎను సమర్థించడం పట్ల ఇరువురికి కూడా కొన్ని అభ్యంతరాలున్నాయి. కేసీఆర్‌ ఇప్పటికీ కాంగ్రెసేతర, బిజెపియేతర కూటమి ఏర్పాటు వైపే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. కాగా, కాంగ్రెసు తప్పుడు కేసులు పెట్టించి, జగన్‌ ప్రతిష్టను దెబ్బ తీశారని, అటువంటప్పుడు సోనియా నిర్వహించే సమావేశానికి వెళ్లడం సాధ్యం కాకపోవచ్చునని అంటున్నారు. ఏమైనా, ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాలని ఇరువురు నాయకులు కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here