Featured

అమెరికాలో అమ్మకూచి గానే పరిచయం

భారత సంస్కృతిపై ఎన్నో షార్ట్‌ఫిల్స్‌…

ఆసక్తిగా తిలకిస్తున్న విదేశీయులు…

లక్షల్లో సంపాదించుకున్న అభిమానులు..

ఉన్నత చదువులు చదివింది.. ఆమె చదివిన చదువుకు పెద్ద అంకెల జీతంతో కూడిన పెద్ద ఉద్యోగమే వస్తుంది.. కాని ఆమె ఆలోచన వేరు.. పెద్ద ఉద్యోగం కావాలని ఎప్పుడూ అనుకోలేదు.. ఎంతో గొప్పదైనా, తరతరాలకు అవసరమైనా మన దేశ సంస్కృతి, సంప్రదాయాలపై ఏదో చేయాలనే ఆలోచన మొదలయ్యింది.. అందుకు భారతదేశ చరిత్రపై అధ్యయనం చేయాలి.. మన గొప్పదనాన్ని విదేశాలలో చాటాలి.. కాని ఏలా విదేశంలో అంటే మాటలా.. పక్క రాష్ట్రం వెళతేనే ఏదో భయం ఉంటుంది.. అలాంటిది విదేశం.. అక్కడి మనుషులు, అలవాట్లు అంత ఈజీగా అర్థం కావు.. ఐనా చేయాలనే పట్టుదల మనసులో ఉంటే చాలు అనుకొని కుటుంబంతో సహా అమెరికాకు ఉద్యోగం కోసం బయలుదేరినా అమె మనసంతా భారతదేశ సంప్రదాయాలను అక్కడ పరిచయం చేయాలనే ఆలోచనే.. అనుకున్నదే తడవుగా అక్కడున్న తెలుగువారితో.. అమె ఆలోచనతో కలిసి వచ్చేవారితో అమ్మ గొప్పదనంపై, భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలపై అమ్మకూచి పేరుతో షార్ట్‌ఫిల్మ్‌ ప్రారంభించింది… అమె ప్రారంభించిన మొట్టమొదటి ఎపిసోడ్‌కే లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది.. యూట్యూబ్‌ నుంచి పెద్ద ఎత్తున పారితోషికం కూడా అందుకుంది.. ఇప్పుడు అమెరికాలో అమ్మకూచి అంటే గుర్తుకొచ్చే పేరే రాధిక కొండ… పుట్టి పెరిగింది మన తెలంగాణ వరంగల్‌ జిల్లాలో ఐనా అమెరికా న్యూజెర్సీలో రాధిక అంటే ఇప్పుడొక క్రేజ్‌..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

గొప్పది… మన దేశ చరిత్ర… మన దేశ సంస్కృతి.. మన దేశ సంప్రదాయాలు.. అన్నీ గొప్పవే.. ఇంత గొప్ప చరిత్ర, ఈ సంప్రదాయాలు ఈ భారతీయులకు ఏలా సాధ్యమని ప్రపంచం మన వైపు తదేకంగా చూస్తూ ఉంది…. మన భారతదేశ కట్టుబట్లు అంటే విదేశీయలు ఆసక్తిగా తిలకిస్తారు… మనమెందుకు ఆ దేశంలో పుట్టలేదు.. మనకెందుకు ఆ దేశ వారసత్వం రావడం లేదని లోలోపల బాధపడే విదేశీయలు వందల్లో నుంచి వేలల్లో పెరిగిపోతున్నారు… అంత గొప్ప చరిత్ర గల భారతదేశం గొప్పదనం మూలాలు రాబోయే తరానికి కాకుండా తరతరాలకు తెలియాలి. మన విలువలు, బంధాలు, అనుబంధాలు, అనురాగాలు అందరికి తెలుస్తేనే కదా మన దేశ గొప్పదనం పది కాలాలపాటు పదిలంగా ఉంటుంది అని చెపుతోంది రాధిక కొండ…

చిన్నప్పటి నుంచి సినిమాలను గమనించేదాన్ని…

మన సినిమాలు ఆడపిల్లలను ఆసభ్యకరంగా చూపిస్తాయి.. ఎందుకు అలా చూపిస్తున్నారో అర్ధం కాకపోయేది.పెద్దయ్యాక ఏలాగైనా డైరెక్టర్‌ కావాలని కలలుగన్నాను. ఆడపిల్లలంటే కేవలం శారీరక వస్తువులే కాదు. ప్రతి అమ్మాయి దగ్గర ఏదో తెలియన అద్బుతమైన టాలెంట్‌ ఉంటుంది. నేను పెరిగిన వాతావరణమో, ఇంకేంటో తెలియదు కాని సినిమాలు తీసేవాళ్లన్నా, సినిమాల్లో నటించేవాళ్లనా గౌరవమే లేదు. కాని సినిమాలో రెండు రకాల కోణాలున్నాయి. డబ్బు సంపాదించేవారు ఉన్నారు. పేరు సంపాదించేవారు ఉన్నారు కాని సినిమా అంటే ఒక పవిత్రమైన వేదిక.. ఒక మంచిని చూపిస్తూ చాలామందిని మార్చవచ్చు. కాని నేడు సినిమాలు, సీరియల్‌లో మంచి అనేది లేదు. అందుకే నా వంతు ప్రయత్నంగా నేను నా దేశ సంస్కృతి గురించి, నా దేశంలోని ఆడపిల్లల గొప్పదనం గురించి ప్రపంచానికి చాటేలా ప్రయత్నం చేస్తున్నాను.. వారిలో ఉన్న ప్రతిభను గుర్తిస్తూ వారి గొప్పదనంపై సినిమాలు తీయాలని చిన్నప్పుడే పిక్స్‌ అయ్యాను.

అమెరికా నాకు నమ్మకాన్ని ఇచ్చింది…

నాకు చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతం అంటే చాలా ఇష్టం. ఇప్పటికి ప్రతి పేజీలో ప్రతి పదం నాకు తెలుసు. వాటితో పాటు చాగంటి గారు ఉపన్యాసాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. రామాయణం చదివితే మంచి నడవడిక, క్రమశిక్షణ అలవడుతుంది. అందుకే ఇప్పటికి అమెరికాలో రామాయణం చదివే ముసలమ్మ వస్తుందని ఆటపట్టిస్తారు. నిజంగా మనిషి ఎదుగుదలకు మనం ప్రపంచంలోని పుస్తకాలను వెతకక్కర్లేదు. మన రామాయణం, మహాభారతం చదివితే చాలు. అందులోనే ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి. అందుకే రేపటితరం ఎదుగుదలకు స్పూర్తివంతమైన ఆయుధం..

నీకెందుకు సినియాలు అన్నారు…

అమెరికాకు వెళ్లావు. బాగా చదువుకున్నావు, నువ్వు మీ ఆయన మంచిగా జాబ్‌ చేసుకొక ఎందుకు పనికిమాలిన సినిమాలు అన్నారు. నాకు ఒక్కరంటే ఒక్కరూ కూడా సపోర్టు చేయలేదు.. అందరూ సినిమా ఫీల్డ్‌లో తట్టుకోలేవు, అందులో మంచికన్నా చెడు ఎక్కువగా ఉంటుంది అనేవారు. కాని నేను ఏంటో నాకు తెలుసు. నేను వెబ్‌సీరిస్‌ తీసింది. మా ఇంట్లో, నా కూతురితోనే. నేను డబ్బు, పరపతికోసం పరిగెడుతే భయపడేదాన్ని, నా పరుగు ఎప్పుడూ ఆడపిల్లల చైతన్యంకోసమే.. కాని వాళ్ల భయాలు వాళ్లవి, చివరకు అమెరికాలో నిలిచాను, గెలుస్తున్నాను..

అమెరికా సినిమాలో నటిస్తున్నాను…

రాధిక కొండ…

నేను చేసిన షార్ట్‌ఫిల్మ్‌ ఆరు ఎపిసోడ్‌లు అమ్మకూచి పేరుతో విడుదలయ్యాయి. యూట్యూబ్‌లో లక్షలాది మంది అభిమానులను సంపాదించాను. లక్షల్లో వచ్చిన వ్యూస్‌కు నాకు యూట్యూబ్‌ పారితోషికం కూడా అందించింది. నేనుచిత్రాలన్నీ సమాజం కోసం తీస్తున్నాను. అందులో నటించే వాళ్లు కొంతమంది నా స్నేహితులు అమెరికన్స్‌ ఉన్నారు. ఇప్పుడు అమెరికా వాళ్లు తీస్తున్న లైక్‌ యూస్‌ అనే సినిమాలో నేను నటిస్తున్నాను. అందులో 90 మంది అమెరికన్స్‌ ఉన్నారు. తెలుగు నుంచి నేనోక్కదాన్నే. అందులో అవకాశం రావడం నా అదృష్టమే.. దానికి మాటలు కూడా నేనే రాస్తున్నాను. ఇప్పటివరు నేను తీసిన నా షార్ట్‌ఫిల్మ్స్‌ అన్నిటికి మాటలు, సంగీతం, నిర్మాణ, దర్శకత్వం అంతా నేనే. ఇంకా చేస్తాను. మన దేశ గొప్పదనాన్ని ఇంకా ప్రపంచమయం విస్తరింపచేస్తాను. ఆడపిల్లలను నా మాటలతో ఆడపులులుగా మార్చుతాను. మనం చేసే పని మంచిదైనప్పుడు ఎన్నో అవరోధాలను తట్టుకొని నిలబడాలి.. మంచికోసం అందరికంటే ముందు నేనే ఉంటాను… నా ప్రయత్నం, నా ఆలోచన మాత్రం ఆపే సమస్యే లేదు…

రాజేందర్‌ పల్నాటి… ఆదాబ్‌ ప్రత్యేక ప్రతినిధి..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close