మా బిడ్డలు ఇంకా గొర్రెలే కాయాలా..?

0

అక్కడి ప్రజలకు ఆయన ఓ కుటుంబంలోని మనిషి. ఉమ్మడి కుటుంబంలో రాయుడు. ఆయన ‘లా’ తీర్పులు ఇవ్వడు. కానీ ఆయనలాగే ప్రజాసంక్షేమం ఆలోచిస్తాడు. ఉమ్మడి కుటుంబంలో పెదరాయుడు. ఎదిగినందుకు గర్వం లేదు. ఏదో ఒక పదవికోసం ఆశపడే రకం కాదు. నయవంచక రాజకీయాలు తెలియవు. తాను చేయాలనుకున్నది.. చేస్తున్నది.. మనఃస్పూర్తిగా.. ముక్కుసూటిగా చేస్తాడు. తరచుగా శ్రీశైలం వెళ్ళి వస్తూ… పదవీ, ప్రలోభాలకు దూరంగా ఉండి… ఇద్దరి తమ్ముళ్లతో అంతటా కలియ తిరుగుతూ… అందరితోనూ ‘శ్రీశైలం అన్నా’ అని పిలుపిం చుకునే… సామాన్యుడు. సేవలో అసమాన్యుడు. కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకునే తొలిస్థా నం సందేహం లేకుండా ఆయనదే..! కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్‌ కూనా శ్రీశైలంగౌడ్‌ తో ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ.

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు.?

ఆర్థికంగా ఉన్న ఉమ్మడి కుటుంబం మాది. ఆనందాలకు నిలయం. అయినా ఎదో తెలియని వెలితి. ఆ వెలితి రాజకీయాలలోకి వచ్చిన తరువాత తీరింది.

కుత్బుల్లాపూర్‌ లో ప్రతిచోట విూ ముద్ర కనిపిస్తోంది.?

అవును. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి కష్టం నాదే. ఇక్కడి ప్రతి అడుగు నాకు పరిచయం . అందుకే ఇండిపెండెంట్‌ గా గెలిచాను.

మిమ్మల్ని చాలామంది పదవులతో ప్రలోభాలు పెట్టాలని ప్రయత్నించారు కదా..?

పేర్లు వద్దు లేండి. నాకు కాంగ్రెస్‌ పార్టీ అంటే అభిమానం. అదే ప్రపంచం. అందుకే ఎవరూ పిలిచినా నవ్వుతూ నమస్కారం పెడతా.

సహజంగా విూరు అందరితో కలసి పోతారు కదా..?

నేను మా ఇంటికి పెద్ద దిక్కుని. ఆ అలవాటే సమాజంలోకి రప్పించింది. అందుకే ఏ ఇంటికి వెళ్ళినా నాకు ఆ ఇంట్లో పెద్దగా ఆదరిస్తారు.

ఇంత ప్రజాదరణ కలిగిన విూరు ఓసారి ఓడిపోయారు కదా.?

అది ప్రజల తప్పు ఎంతమాత్రం కాదు. ప్రత్యర్థులు ప్రాంతాల వారీగా విభజించారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే గెలిచిన వారు విమానాలలో తిరుగుతున్నారు. నేను మాత్రం నా కుటుంబ సభ్యులతో సమానంగా చూసే ప్రజలతోనే ఉన్నాను. అదే నాగెలుపు రహస్యం.

విూరు కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ గా ఉన్నారు.

విూ ప్రాంతంలో తీసుకున్న జాగ్రత్తలు..?

నేను గతంలో చేసిన పనులు తప్ప కొత్తగా తెరాస చేసింది ఏవిూ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నేనందించిన సేవలను ఈ ప్రభుత్వం కొనసాగించలేక పోయింది.

కాంగ్రెసుతో అనుబంధం..?

అమ్మతో ఉన్నట్లు ఉంటుంది. ఇక్కడే ఎదిగా..ఇక్కడే ప్రపంచం.

కాంగ్రెస్‌ గెలిచే తొలి సీటు విూదేనని విూపార్టీ అధిష్టానం భావిస్తోంది. ఏమంటారు..?

ఇది నా అదృష్టం. లేచింది మొదలు ప్రజలతో ఉండటం తప్ప మరోటి తెలియదు. ముక్కుసూటిగా ఉండటం తప్ప మడతపేచీలు తెలియదు.

పైసా ఖర్చు కాకుండా భారీ బహిరంగ సభలు పెడతారు. ఎలా సాధ్యం.?

ప్రజలకు అందుబాటులో ఉంటే ఇలాంటివి సాధ్యం. నేను 19వేల మందికి ఇళ్ళు కట్టించా… పెన్షన్లు, చిన్నా చితక పనులు ఎఃతో మందికి అందించాను. అందుకే నేను సభలు పెడితే.. స్వంత మనుషుల్లా అంతా నిలబడి రాత్రికి రాత్రి ఏర్పాట్లు

చేస్తారు. అందరికీ ధన్యవాదాలు.

తెరాస ప్రభుత్వంపై విూ అభిప్రాయం..?

అన్నింటిలోనూ అట్టర్‌ ప్లాప్‌. ప్రజలు ‘ఈ భారం ఎంత త్వరగా దిగిపోతుందా.?’ అని ఎదురుచూస్తున్నారు.

తెరాస ప్రవేశపెట్టిన గొర్రెల పథకాన్ని విమర్శిస్తున్నారు..?

మా పిల్లలు చదుకోవాలి. కొలువులు చేయాల. చల్లంగుండాలి. కానీ ఈ ప్రభుత్వం ఇంకా విూం గొర్రెలు కాచుకొని బతకాలనే చూస్తుంది. మా బతుకులు.. మా పిల్ల బతుకులు విూమే మార్చుకుటాం. అందుకే తెరాసను దారుణంగా ఓడిస్తాం.

కాంగ్రెసుకు ఎన్ని స్థానాలు వస్తాయి..?

(మెడలోని మూడు రంగుల కండువా చూపిస్తూ…) అందరిలా నేను నూరు, నూటైదు అని చెప్పను. కాంగ్రెస్‌ కు 85, కూటమితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కారును ఆపేందుకు కాంగ్రెస్‌ కండువా సిద్దంగా ఉంది.

చివరిగా….

విూ పార్టీకీ ఆస్థాయి ‘స్టామినా’ ఉందా..?

ప్రజాదరణ కోల్పోయిన

‘తెరాస’ది అతి విశ్వాసం. ప్రజలు కోరుకునే ‘కాంగ్రెస్‌ కూటమి’ది ఆత్మ విశ్వాసం. గుడ్‌ లక్‌ చెపుతూ ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ సెలవు తీసుకుంది.

సహకారం: శ్రీకాంత్‌ రెడ్డి, ఎం.విజయకుమార్‌ నాయుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here