Featuredరాజకీయ వార్తలు

కారుకు బ్రేక్‌.. కేసీఆర్‌కు షాక్‌

”వచ్చే ఎన్నికల్లో తెరాస వాషవుట్‌ కాబోతోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసును తెరాస మోసం చేసింది. దళితుడిని సిఎం చేస్తాన మాట తప్పింది.. కనీసం ఓ మహిళనైన మంత్రిని చేయలేకపోయింది.. ఈ దౌర్భాగ్యాన్ని తుడిచివేయడానికి ప్రజలు దరిద్రం వదలగొట్టడానికి కాంగ్రెస్‌ రెట్టించిన ఉత్సాహంతో సమరరంగంలోకి దూకుతుంది. అంతిమ విజయం మాదే..”

– రేణుకాచౌదరి.

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

వారిద్దరూ ఓకే ఏడాది పుట్టారు. ఓకే పార్టీలో… ఓకే ఏడాది రాజకీయ జీవితం ఆరంభించారు. ఆమె ఎన్టీఆర్‌ తో ‘సై’ అన్నారు. ఆయన ‘చంద్రబాబు’ ‘ఢీ’ అన్నారు. ఆమె కేంద్రంలో హల్‌ చల్‌ చేస్తారు. ఆయన రాష్ట్రంలో హడావుడి చేస్తారు. ఇద్దరూ ‘ట్రబుల్‌ షుటర్లే’. పైకి మౌనంగా.. ఉంటారు. మాటలే తూటాలుగా… ముక్కసూటిగామాట్లాడతారు. ఇద్దరూ బద్ద శత్రువుల్లా తలపడుతున్నారు. ఎవరి ‘మైండ్‌ గేమ్‌’ వారిదే. ఎవరి ‘కోవర్ట్‌ ఆపరేషన్లు’ వారివే. ఆమె రేణుకాచౌదరి, ఆయన కేసీఆర్‌. ఇక చదవండి.

కేసీఆర్‌ కాంగ్రెస్‌ ను మోసం చేశారని విూరంటున్నారు. ఆయన రాజకీయం చేశారని అనుకోవచ్చు కదా.?

ఆయనకు ఉన్న రెండు సీట్లతో తెలంగాణ వచ్చేదా.? కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తానని చెప్పాడు. దళిత సిఎం అన్నాడు. లక్ష ఉద్యోగలన్నాడు. చివరకు చేతగాక అసెంబ్లీ రద్దన్నాడు. ప్రజలను నిలువునా మోసం చేశాడు. ఇదా రాజకీయం.?

కేసీఆర్‌ కు, విూకు నిజ జీవితంలో దగ్గర పోలికలున్నాయి..?

అవును ఇద్దరం ఒకే ఏడాది(1954)లో పుట్టాం. ఒకేసారి, ఒకేపార్టీ నుంచి రాజకీయ జీవితం ఆరంభించాం. అంతే తప్ప మరే విషయంలో పోలికే లేదు.

విూరు కేసీఆర్‌ ను టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది.?

నేను ఒక నిర్థిష్టమైన విషయంపై ఆధారాలతో మాట్లాడతాను. అక్కడ మోడు బారిన మోడినా లేక కాడి వదిలేసిన కేసీఆర్‌ అన్నది చూడను. ప్రజలకు అన్యాయం జరిగితే రేణుక మాట్లా డదు. ప్రజా ద్రోహులను వెంటాడుతుంది. గర్జిస్తూ వేటాడుతుంది.

కేసీఆర్‌ ఎన్నికల వ్యూహంపై విూ అభిప్రాయం.?

కేసీఆర్‌ కు తెలిసింది.. చేయగలిగేది ప్రజలను మభ్యపెట్టడమే.

అధో(ప్ర)గతి భవన్‌ లో ఆయనేం చేస్తుందీ ప్రజలందరికీ తెలిసిందే.! నేను నోరు తెరిస్తే ఎందరి బతుకులో బయటకు వస్తాయి.

పొత్తులతోనే కుస్తీలు పడుతున్నారు. జాబితా ఎప్పుడు.? ప్రచారం ఎప్పుడు.? ఈ విషయాలలో తెరస ముందుంది కదా.?

ప్రభుత్వం నడపడం చేతకాక మధ్యలో వదిలేసినోళ్ళకు మాకూ పోలికేమిటి.? కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు ఏం చేయాలో ఓ స్పష్టత ఉంది. కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రచిస్తుంది. కాంగ్రెస్‌, దాని భాగస్వామ్య పక్షాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నాయకులు కదనరంగంలోకి ఇప్పటికే వెళ్ళారు.

7, 8 జాబితాలు చక్కర్లు కొడుతున్నాయి. ?

సీట్లు ఆశించే వారందరూ ఎవరి జాబితా వారు రెడీ చేసుకు న్నారు. అధిష్టానం మాత్రం గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తుంది.

విూ పార్టీలో తెరాస కోవర్టులు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.?

అది తప్పు ఒకరిద్దరు నాయకులు పదవుల కక్కుర్తితో పార్టీని వదిలి వెళ్ళారు. అసలు విషయం చెపితే ‘షాక్‌’ అవుతారు. అన్ని పార్టీలలో కాంగ్రెస్‌ వాళ్ళున్నారు. తెరాసలో ఇంకొంచెం ఎక్కువ మంది ఉన్నారు. వారిని ‘టచ్‌’లో ఉంచుకుని.. అవసరాన్ని బట్టి వాడుకుంటున్నాం. దటీజ్‌ కాంగ్రెస్‌.

విూరు ‘మైండ్‌ గేమ్‌’ ఆడటం లేదు కాదు కదా.?

అవతలి వాళ్ళు ‘మైండ్‌’ లేకుండా మాట్లాడితే… మా ‘మైండ్‌ గేమ్‌’ ఎలా ఉంటుందో చూపెడతాం. ఇప్పటికే కాంగ్రెస్‌ కు 30 మంది నాయకులు ‘వాట్సప్‌ టచ్‌’లో ఉన్నారు.

విూరు ప్రత్యర్థులను తీసి పారేసినట్లు మాట్లాడతారేమిటి.?

ఏదైనా సమస్య పరిష్కారానికి ముందుంటాను. పార్లమెంటు విషయాలలో వాజ్‌ పేయ్‌ అర్థరాత్రి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ‘శూర్పణక’ అని అదే పార్లమెంటులో మోడీ నోరు జారితే ఒక్కసారిగా ఎంతటి అలజడి జరిగిందో చూశారుగా. అదీ కాంగ్రెస్‌ పార్టీ ‘స్టామినా’.

తెలంగాణలో కూడా ‘హంగ్‌’ వస్తే.. ‘కర్నాటక’లో లాగే ఇక్కడ కూడా.. ‘ప్లాన్‌ బి’ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఏమంటారు.?

కాంగ్రెసు పార్టీ ఎన్నో ఆటు పోట్లు చూసింది. ఒక్క తెలంగాణ ఎన్నికల గెలుపు ఒక్కటే కాదు. రేపు జరగబోవు ఇతర రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల కషరత్తులు జరుగుతున్నాయి.

చివరిగా తెలంగాణ సిఎం ఎవరు.?

కాంగ్రెస్‌ పార్టీలో ప్రతిభ ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. అందరూ కోరుకునే వ్యక్తి సిఎం అవుతారు. కాంగ్రెసు, కూటమి విజయం తథ్యం.

మళ్ళీ కలుద్దాం.. అమ్మా అంటూ ఆదాబ్‌ హైదరాబాద్‌ సెలవు తీసుకొంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close