Featuredరాజకీయ వార్తలు

ఉద్యోగులంటే..ఆ నలుగురు.. కాదు

– టార్గెట్లు (చేయ) వద్దు

– ఉద్యమచరిత్రలో చెరిపేసే కుట్ర

– కడుపుకాలి రగిలిపోతున్నారు

– కేసుల బెదిరింపులు..

వేధింపులు ఎక్కువ

– ఒక్క పదోన్నతీ లేదు

– సభలలో అధికారుల ఊసే ఉండదు

– పదవుల కోసం పంచన

ద తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావుతో ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ

(అనంచిన్ని వెంకటేశ్వరరావు)

ఉద్యోగులు లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం. ఉద్యమం చేసిందెవరు.? లాభం పొందిందెవరు..? ఆ నలుగురు వెనుక ఉన్న ఈ నలుగురు ఎవరు.? నాలుగు స్థంబాలాటలో.. నలుదిక్కులా బిక్కచచ్చి.. బిక్కుబిక్కుమంటూ… ఏ క్షణాన ఏం జరుగుతుందో..? అనుకుంటూ మానసిక ఆందోళనలతో… ఉద్యోగులు నిస్తేజంగా.. నిర్లిప్తతగా కాలం వెళ్ళదీస్తున్నారు. ఇందుకోసం కేసులే కాదు ఉద్యోగుల ప్రయోజనం కోసం ప్రాణాలు ముందుపెట్టి పోరాడతానని ఆయన చెపుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకం. ‘సకలజనుల సమ్మె’ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్ళింది. తెలంగాణ కల సాకారమైంది. కాలచక్రం గగిర్రున తిరిగింది. ఉద్యోగులు

ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇది రెండు కోణాలలో ఆవిష్కారం అయింది. ఒకటి ఉద్యోగ సమస్యలుపై కాగా.. మరొకటి అంతర్గతంగా జరిగిన సంచలన రాజకీయ పరిణామాలు. ఆయనపై కోపం డాక్టర్‌ చదువుతున్న తెలివైన కూతురుపై ‘విషం’ వెదజల్లుతూ చల్లగా చిమ్మారు. ఆయనే నాయకుడు… ఎవరికి చెప్పాలి ఈ బడభాగ్ని బాధను. అలాగే ఉద్యోగులందరీ… బయటకు చెప్పలేని ఎన్నో బాధలు ఆయన గుండెల్లో నిక్షిప్తమై ఉన్నాయి. దాచినా దాగని నిష్ఠూరమైన కర్ణ కఠోరమైన నగ్ననిజం అది. అపుడు ఉద్యమంలో పాల్గొని.. ఇప్పుడు అసంత ప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు. ‘తెరపై ఏం జరిగింది’ అనే కోణంలో ‘ఆ నలుగురు వీరే’ అంటూ… తెర వెనుక బాగోతాన్ని ‘సీనన్నా’ అని ప్రేమగా పిలవబడే ‘ఏలూరి శ్రీనివాసరావు’ సహజసిద్దంగా.. నిర్మోహమాటంగా, ఎన్నో.. నమ్మలేని.. నమ్మశక్యం కాని ఎన్నెన్నో విషయాలను ఆధారాలతో సహా ‘మహా విస్పోటనం’ లా నెమ్మదిగా.. నిశ్శబ్ద యుద్దంలా… ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ద్వారా బాహ్య ప్రపంచానికి.. ధైర్యంగా…తొలిసారి వెల్లడించారు.

– ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిమారడానికి కారణం?

ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చెరిపేసే కుట్ర ఇది. అసలు ఉద్యమ చరిత్రలో ఉద్యోగులు లేరనే భ్రమలు కల్పించడానికి కొందరు సిద్దపడుతున్నారు. మా ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, అణగారిని జాతులు… ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు సాధించుకున్న తెలంగాణ ఇది. ఈ తెలంగాణ మాది.. మీది.. మనందరి కష్ఠార్జితం.

– తెలంగాణ ఉద్యమంలో మీ సంఘాల పాత్ర ఏమిటి.?

1969 తోలి ఉద్యమంలోనూ నాటి ఉద్యోగుల త్యాగ పాత్ర మరవలేనిది. 2000 సంవత్సరంలో టిఎన్‌ జీఓ ఉంది. 2007 నుంచి టిజీఓగా క్రియాశీలకంగా ఉన్నాం.

– మీకున్న సమస్యలేమిటి.?

తెలంగాణ రాగానే కొత్తగా కార్పొరేట్‌ స్థాయిలో ఆఫీసులు ఉంటాయి.. మహిళలకు ప్రత్యేక గదులు ఉంటాయి అని ఆశించాం. జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆశపడ్డాం. అవి జరగలేదు సరికదా పరిస్థితి మరింత దిగజారింది.

– అంటే.. ?

ఉద్యోగులలో అభద్రతా భావం నెలకొంది. పనిచేసిన తరువాత బయటకు వెళ్ళాలంటే అనుమతులు తీసుకునే పరిస్థితి నెలకొంది. పైవాళ్ళకు తెలుసో..? లేదో కానీ… బ్రిటీష్‌ రూల్‌ వచ్చిందని ఉద్యోగులు సమిష్టిగా భావిస్తున్నారు. మేం పేరుకు ఉద్యోగులం మాత్రమే. మావాళ్ళు వివిధ కారణాలతో మరణిస్తుంటే… నిస్సహాయులుగా ఉంటున్నాం. ఈ దౌర్భాగ్యం పగవాడికి కూడా రాకూడదు.

– ‘ఫ్రెండ్లీ గవర్నమెంట్‌’ అని ప్రభుత్వం చెపుతోంది.?

ఉద్యోగులంటే చిన్నచూపు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు చివరకు కార్పోరేటర్లు సైతం ఉద్యోగసంఘాలన్నా.. ఉద్యోగులన్నా లెక్కలేదు. గతంలో మాకోరికలు తీర్చినా.. తీర్చకున్నా.. ఆత్మగౌరంగా చూసేవాళ్ళు. అలాగే ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం.

– మీతో చర్చించినట్లు ప్రభుత్వం చెపుతోంది.?

అధికారంలో ఉంటూ గౌరవ అధ్యక్షులుగా కొనసాగే వారే చర్చలకు పిలుస్తారు. ఆ చర్చలలో ఆ గౌరవ అధ్యక్షులే హాజరై నిర్ణయాలు తీసుకుంటారు. ఇది దురద ష్టం. అవాంఛనీయం. ప్రభుత్వం ఇలాంటి వాటిని ప్రోత్సాహించకూడదు. ఏరోజైనా ఉద్యోగులను కూర్చోబెట్టి మాట్లాడారా.?

– మీకు ‘కడుపునిండా’ పెట్టామని ప్రభుత్వం చెపుతోంది.?

కార్మికశాఖ నిబంధనల మేరకు ఆశా వర్కర్లకు మినిమం జీతాలు పెంచారు. హోంగార్డులు, అంగన్వాడీలదీ అదే దుస్థితి.

– సిపిఎస్‌ ఏమైంది.?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే కదా.! ఒక్కసారి ఈ సమస్యపై ఢిల్లీ వెళ్ళొస్తే పరిష్కారం వచ్చేది. ఇది బర్నింగ్‌ టాపిక్‌. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

– ప్రమోషన్లు రాలేదని విమర్శించడం ఎంత వరకు సబబు..?

ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది. అభినందనీయం. అయితే ఉద్యమంలో ఇవ్వాలసిన పదోన్నతులు ఏ ఉద్యోగికి రాలేదు. రాష్ట్రంలో ఎక్కడా ఉద్యమంలో శిక్షలు పడలేదు. ఒక్క ఖమ్మంలో శిక్షలు పడ్డాయి. లాఠీలకు తలలు పగిలాయి. అమరణదీక్షలు జరిగాయి. కేసీఆర్‌ కు వైద్యసేవలు ఒకవైపు జరుగుతుంటే ఉద్యమానికి ఊపిరి పోసింది పోరాటాల గుమ్మం ఖమ్మం. అది పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది.

– ఎలా అని భావిస్తున్నారు?

ఉద్యోగులు ఏస్థాయిలో, ఏవిధంగా, ఏమేరకు ఆర్థిక కోణంలో నష్టపోయారో చెప్పడం కష్టం. మానసికంగా ఆందోళనలో ఉన్నారు. ఏ ఉద్యోగైనా తనకు అన్యాయం జరిగిందని నోరు తెరిస్తే ఉదయానికల్లా.. పోలీస్టేషన్‌, ఏసీబీ, విజిలెన్స్‌, సీసీఎస్‌ దాడులు జరుగుతాయని హెచ్చరికలు. మాకు స్వేచ్ఛ లేదు.

– ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు.?

మీం అదనంగా పనిచేస్తాం. మాకు టార్గెట్లు పెట్టవద్దు. మమ్మల్ని టార్గెట్‌ చేయవద్దు. చార్జిమెమోలు, కేసులు, దాడుల భయం, బెదిరింపులు వద్దు.

– ఇతర సౌకర్యాల గురించి..?

పి.ఆర్‌.సి రాలేదు. సరైన టైంలో డిఏలు ఇవ్వరు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన 27% కాగా మిగిలింది ఈ ప్రభుత్వం ఇచ్చింది. 3.5 లక్షల మందికి సిపిఎస్‌ పై ఆశలు పెట్టుకున్నారు. పెన్షన్‌ తీసుకునే వారి బాధ వర్ణనాతీతం.

– 18 ఇన్స్టాల్‌ మెంట్లు ఇచ్చింది కదా..?

(ఆవేశంగా..) అదెవడిక్కావాలి. ? నెలవారీ జీతంతో దానిని కలపాలి. మీం ప్రీమియం కడతాం. కనీసం ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని అడిగాం.

-మీ ఉద్యోగుస్తులకు నాలుగు పదవులు ఇచ్చారుగా..?

అవును. ఆ నలుగురే ఉద్యమంలో ఉన్నారా..? అసలు కష్టం ఎవరిది..? తెరపై హంగు ఆర్భాటాలు చేసే వంధిమాగ ధులకు పదవులా.. ? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌, టిప పిఎస్సీ హోదా .. అదీ భజన చేసే వారికేనా..? వాళ్ళు పదవుల కోసం ఆరాటంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరొక నిబద్ధత కలిగిన ఉద్యోగి లేరా..? మీం ఉద్యోగస్తుల క్షేమం, సంక్షేమం కోసం ఉన్నాం. ఉంటాం.

– ఉద్యోగులకు ఇళ్ళ స్థలాల గురించి..?

ఒక్కరికి కూడా ఇవ్వలేదు. నిబంధనలు మార్చకుండా… అందరూ కథలు చెప్పుకోవద్దు. ఎమ్మెల్యే, ఎంపీ, జర్నలిస్టులకు ఎలాంటి ఇళ్ళ, వ్యవసాయ భూమి లేని వారికే ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి. ఎవరికి ఎంత భూమి ఉందో నేను చెప్పనక్కరలేదు. అయినా 2002లో ఎమ్మెల్యే కాలనీ కబ్జాల గురించి సీరియల్‌ వార్తలు మీరు అధ్భుతంగా అందించారు. మీకు తెలియని దాగుడు మూతలా ఇవి.

– రాజీవ్‌ స్వగహ అడిగినట్లున్నారు..?

చివరకు ఈ ఇళ్ళతోనైనా సర్థుకుపోదాం అనుకున్నాం. అక్కడా మొండిచెయ్యే.

– జీతాలు బాగానే ఉన్నాయి కదా..?

ఐదేళ్ల ఎమ్మెల్యేల జీతాలు చూడండి. పెన్షన్లు చూడండి. వారు లక్షాలాది రూపాయలు తీసుకోవచ్చు. మా దగ్గర 4వ తరగతి ఉద్యోగుల పరిస్థితి మరీ తీసికట్టుగా ఉంది.

– డ్రైవర్లు పరిస్థితి..?

ఇది కనిపించని పెద్ద విషయం. ఆదే మా ఆందోళన. కొత్త ఉద్యోగాలు లేవు.

– ఉపాధ్యాయుల గురించి..?

ఇదీ ఆ కోవలోదే. కేజీ టు పిజీ విద్య పక్కన పెట్టండి. అసలు ఉన్న పాఠశాలల పరిస్థితి ఆలోచించాలి.

– అసలు మీ ఉద్యోగ సంఘానికి గుర్తింపు ఉందా..?

చెప్పుకుంటే పరువుపోతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గుర్తింపు తప్ప తెలంగాణ ప్రభుత్వం హయంలో కనీసం ఒక్క సంఘానికి గుర్తింపు లేదు. దీనికి తోడు గౌరవ అధ్యక్షులుగా ఇప్పటికే రాజకీయ పదవులు అనుభవిస్తున్న వారుండటం గమనించండి. ఇది ప్రభుత్వం ప్రోత్సహించకూడనిది. అవాంఛనీయం. దురద ష్టకరం.

– ఉద్యోగస్తులపై కేసులు.?

అక్కడక్కడా వ్యవస్థాపరంగా ల్యాప్స్‌, సర్థుబాట్లు ఉంటాయి. వీటిని అడ్డుగా పెట్టుకొని ఉద్యోగస్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

– రిటైర్మెంట్‌ పై అభిప్రాయం..?

రాజకీయ నాయకులు 85 సంవత్సరాల వరకు పదవులలో ఉంటారు. ఉద్యోగస్థులు మాత్రం 58 ఏళ్ళకే ఎందుకు రిటై ర్మెంట్‌ అవ్వాలి. ఓకే రిటైర్మెంట్‌ కు తగ్గట్లుగా ఉద్యోగ అవకాశాలు లేవు. విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిం చాల్సిందే.?

– కుటుంబం గురించి.. రాజకీయ రంగం గురించి…?

కుటుంబ విషయాలు వద్దు. రాజకీయాల పట్ల ప్రస్తుతం ఆసక్తి లేదు.

ఉద్యోగుల న్యాయపరమైన కోరికలు తీరాలని ఆశిస్తూ.. ఆదాబ్‌ హైదరాబాద్‌ సెలవు తీసుకుంది.

సహకారం: షేక్‌ అహ్మద్‌ పాషా.

ఫొటోలు: నాగరాజు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close