ఆఫీసుకు రాని కేసీఆర్‌కు జీతం ఎందుకు?

0

దేశంలో అందరూ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పాటిస్తే.. కేసిఆర్‌ మాత్రం ‘కల్వకుంట్ల రాజ్యాంగం’ పాటిస్తున్నాడు. అనాలోచిత నిర్ణయాలతో పరిపక్వత లేని పాలన చేసిండు. కవిూషన్ల కోసం ప్రాజెక్టులు రీ డిజైన్‌ చేశాడు. పోలీసు వ్యవస్థను చెప్పుచేతల్లో ఉంచుకొని నిర్వీర్యం చేశాడు.

-డా.శ్రావణ్‌ దాసోజు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఆయన కాంగ్రెసు పార్టీలో అనర్గళంగా మాట్లాడే చాతుర్యం ఉంది. అధికారపార్టిని ఇరుకున పేట్టే సవాళ్ళు విసురుతాడు. నేనే ఎన్నికల కమిషనర్‌ ను అయితే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నాడని ఐపిసి 153 ప్రకారం కేసీఆర్‌ పైనే కేసులు పెడతానంటాడు. వేదికపై రాహుల్‌ గాంధీ హిందీ, ఇంగ్లీషు ప్రసంగాలను చక్కగా తెలంగాణ యాసతో ప్రజలకు గుండెకు హద్దుకునేలా చెపుతాడు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై ఏకంగా ‘పీపుల్స్‌ చార్జ్‌ షీట్‌’ అచ్చేసి హంగమా చేశాడు. అయనే తెలంగాణ పిసిసి ప్రధాన కార్యదర్శి డా.శ్రావణ్‌ దాసోజు నేటి ఆదాబ్‌ హైదరాబాద్‌ ఇంటర్వ్యూ.

విూరు రచించి వెలవరించిన పుస్తకాల వివరాలు.?

-కాగ్‌ అద్దంలో కేసీఆర్‌ ఆబద్దాలు, దగాపడ్డ తెలంగాణ, మిషన్‌ భగీరథ అక్రమాలు, ‘గడీల పాలన-తాకట్టులో తెలంగాణ’ పీపుల్స్‌ చార్జిషీట్‌ లాంటి పుస్తకాలను ఇటీవల విడుదల చేయడం జరిగింది.

ప్రభుత్వంపై ఎన్నికేసులు వేశారు.?

-రహస్య జీఓలు, పంచాయతీ ఎన్నికలు, ప్రాజెక్టుల గురించి మొత్తం5 ఐదు కేసులు వేశాను.

ఎందుకు వేయాల్సి వచ్చింది.?

కేసీఆర్‌ ప్రభుత్వం తన అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారం కాకుండా ‘కల్వకుంట్ల రాజ్యాంగం’ ప్రకారం వెల్లడం వల్లే కోర్టులను ఆశ్రయించాం. ధర్నా చౌక్‌ ఎత్తి వేయడం అంటే ప్రజా గొంతుకలను నలిపి వేయడమే. నిరంకుశ పాలన చేశారు. కోర్టు మొట్టికాయలు వేయడం తెలిసిందే కదా.

ఆయన ఆఫీస్‌కు రావడం లేదని ఆరోపిస్తున్నారు కాదా?

-కేసీఆర్‌ సచివాలయంకు రాకుండానే జీతం ఎలా తీసుకుంటున్నారు. ఆయన పనిచేయకుండానే ఫామ్‌హౌజ్‌ ఉంటూ నిర్మొహమటంగా లక్షల రూపాయల జీతం పొందుతున్నారు.

తెలంగాణలో పరిస్థితి అంత దిగజారి పోయిందా.?

-స్థానిక నాయకులు చెపితేనే పోలీసుశాఖలో బదిలీలు, ఉద్యమకారుల ఇళ్ళపై దాడులు, వరంగల్‌ సభలో ఏకంగా సిఎం ¬దాలో ‘విూడియాను మెడలు విరుస్తా.. నేను హిట్లర్‌ తాతను పది కిలోవిూటర్ల లోతుకు పాతిపెడతా’ అని చెప్పాడు. రాజరికపు పోకడలు తెచ్చాడు. అంతెందుకు విూ జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టిన ఘన చరిత్ర ఎవరికి తెలియంది.

విూరు కేసీఆర్‌ విూద కేసు నమోదు చేయాలని చెపుతున్నారేమిటి.?

-అవును. నేనే ఎన్నికల కమిషనర్‌ ను అయితే విద్వేషాలు రెచ్చగొడుతున్న తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విూద ఐపీసీ సెక్షన్‌ 153 ప్రకారం కేసు నమోదు చేసే వాడిని.

విూరు ఆయనపై వ్యక్తిగతంగా దూషణల పర్వం కొనసాగించడం.?

-రాజకీయ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి

దిగజారి ఎన్ని తిట్లు తిట్టాడు. ఓపిక పట్టినంత సేపు పట్టాం. విూం జస్ట్‌ కొంతే మాట్లాడాం. ‘బట్టేబాజ్‌ పనులు, జూటేబాజ్‌ పనులు చేయడానికి ఓ హద్దు ఉంటుంది కేసీఆర్‌.

‘మహాకూటమి’ పేరుతో జతకట్టడంపై వస్తున్న విమర్శలకు విూ స్పందన.?

-2009లో టీడీపీ, సీపీఐ, సీపీఎంతో టీఆర్‌ఎస్‌ కలిసి మహాకూటమిగా పోటీ చేసింది. అప్పుడేమో తెలంగాణ కోసం పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పిన కేసీఆర్‌ ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. తెలంగాణ ప్రజల కోసం నేడు మహాకూటమి ఏర్పడింది. కాంగ్రెస్‌, టీడీపీ, ఇతర పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడితే తప్పేముంది. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌ నియంతగా మారిపోయి పరిపాలన సాగిస్తున్నారు. జర్మనీ నియంత హిట్లర్‌ తరహాలో కేసీఆర్‌ తెలంగాణలో పాలన సాగిస్తున్నారు. నియంత కేసీఆర్ను గద్దె దించేందుకు కేవలం టీడీపీతోనే కాదు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ముందుకొచ్చే చిన్న, చితకా పార్టీలను కలుపుకుని పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

రైతుల గురించి తెరాస చాలా చేస్తుదని చెపుతున్నారు..?

-ఆయన జిమ్మిక్కులు తెలియనివి కావు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ లో సుమారు 150 మంది అన్నంపెట్టే రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. జీఓ 421 ప్రకారం ఆ,యా కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మద్దతు ధర కోసం రోడ్డెక్కితే

వారిని రౌడీలలా బేడీలు వేసి ఊరేగించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిది.

ఎన్‌ కౌంటర్లపై విూరు పలికే స్వరం నిజమేనా.?

-వరంగల్‌ లో ఎంటెక్‌ విద్యార్థిని శృతి మర్మాంగాలపై యాసిడ్‌ పోసి హత్య చేశారు. సాగర్‌ ను కాళ్ళు చేతులు నరికి చంపారు. సూర్యాపేటలో వివేక్‌ ను అలాగే దారుణంగా ఖతం చేశారు. ఇప్పుడు చూడండి నడి రోడ్లపై పాశవికంగా జరుగుతున్న హత్యలు. రాష్ట్రం అశాంతి భద్రత లకు నిలయంగా మారింది.

చివరిగా…

విూరు రాజకీయాలలోకి వచ్చి చాలా బాగా సంపాదించారని వచ్చే ఆరోపణలకు..?

-గతంలో 30 లక్షల వరకు బ్యాంక్‌ బాలెన్స్‌ ఉండేది. అది 90 వేలకు చేరింది. మా ఆవిడ పేరువిూద లోను తీసుకొని ఇల్లు కట్టుకున్నాను. అప్పుడూ.. ఇప్పుడూ చెప్పేది ఒక్కటే.. నన్ను ప్రేమతో గెలవగలరు.. కానీ డబ్బుతో కొనలేరు.

మళ్ళీ కలుద్దాం అంటూ ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ నవ్వుతూ సెలవు తీసుకొంది.

(సహకారం: మహేష్‌, శ్రీకాంత్‌ రెడ్డి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here