‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

0

అర్జున్ రెడ్డి.. సినీపరంగానే కాదు పాలిటిక్స్ పరంగానూ హాట్ టాపిక్ గా మారిన మూవీ. ఓవైపు యువతకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతుంటే.. మరోవైపు వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సినిమాలో అసభ్యకర సీన్లు, బూతు డైలాగులు ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా చాలా బాగుందని కొందరు ప్రశంసిస్తుంటే, మూవీని బ్యాన్ చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక మ‌హిళా సంఘాలైతే సినిమా థియేటర్లకు వెళ్లి మరీ సినిమా చూడొద్దంటూ అడ్డుకుంటున్నాయి. ఈ వివాదాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాను అడ్డుకుంటే తాను ఏమీ చేయలేనని అన్న సందీప్ రెడ్డి మహిళా సంఘాలు ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారో తనకు అర్థం కావట్లేదని వాపోయారు. ఇలాగే భవిష్యత్తులో కూడా జరిగితే ఇక తెలుగులో సినిమాలు చేయనని వ్యాఖ్యానించారు. బాలీవుడ్‌కు వెళ్లి హిందీ, భోజ్‌ పురి, కన్నడ భాషల్లో సినిమాలు తీసుకుంటానని చెప్పారు. అక్కడ కూడా అడ్డు తగిలితే హాలీవుడ్‌ కు వెళ్లిపోతానని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here