ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

0

నేటి నుంచి ఆన్‌ లైన్‌ లోనే ఫిర్యాదులు

  • విడుదల చేసిన కార్యదర్శి అశోక్‌

తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ ఫలితాలను విడుదల చేశారు. మార్చిలో నిర్వహించిన రెగ్యులర్‌ పరీక్షల ఫలితాల్లో దొర్లిన సాంకేతిక తప్పులు రిపీట్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షలకు హాజరైన వారిలో 37.76 శాతం మంది పాస్‌ అయినట్టు వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షలకు లక్ష 60వేల 487 విద్యార్థులు హాజరయ్యారు. 60వేల 600 మంది పాస్‌ అయ్యారు. 63వేల 308 మంది బాలికలు హాజరుకాగా.. 26వేల 181 మంది ఉత్తీర్ణత సాధించినట్లు అశోక్‌ తెలిపారు. బాలురలో 97వేల 179 మందికి గానూ.. 34వేల 490 మంది పాసయ్యారు. ఇంటర్‌ సెకండియర్‌ కి సంబంధించి సోమవారం నుంచి ఆన్‌లైన్‌ లో మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అశోక్‌ చెప్పారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులను ఈసారి ఆన్‌లైన్‌లో తీసుకుంటామన్నారు. 4 సంస్థల ద్వారా ఫలితాలను సరిపోల్చుకున్నామని వివరించారు. మరో వారంలో ఇంటర్‌ ఫస్టియర్‌ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here