స్టేట్ న్యూస్

ఆగని ఇంటర్‌ మంటలు

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ మంటలు చల్లారలేదు. అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించిన అధికారులు.. తప్పిదాలను సరిదిద్దే చర్యలు మాత్రం వేగవంతం చేయలేదు. బోర్డ్‌ వైఖరికి నిరసనగా.. హైదరాబాద్‌ లోని ఇంటర్‌ బోర్డ్‌ ఎదుట ఆందోళనకు దిగారు స్టూడెంట్స్‌, పేరంట్స్‌. ఆందోళన తీవ్రంగా ఉండటంతో.. భారీగా మోహరించారు పోలీసులు. విద్యాశాఖ నిర్లక్ష్యం వల్లే విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్ధులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు స్టూడెంట్స్‌. స్టూడెంట్స్‌, పేరంట్స్‌ ఆందోళనకు ఏబీవీపీ విద్యార్థి సంఘం మద్దతు ప్రకటించింది. టాపర్స్‌ గా మార్కులు సాధించిన విద్యార్ధులకు కూడా 4, 5 మార్కులు ఎలా వస్తాయని నిలదీశారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి జగదీష్‌ రెడ్డి త్రిసభ్య కమిటీని వేశారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన పడొద్దని భరోసా ఇచ్చారు మంత్రి. అయినా ఆందోళనలు ఆగటం లేదు…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసనకు దిగారు. కార్యాలయం ఎదుట బైఠాయించారు. భారీసంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవటంతో ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. ఇంటర్‌ బోర్డు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందిం చాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. రీవాల్యుయేషన్‌, రీవెరి ఫికేషన్‌ ఉచితంగా జరిపించాలని, అవకతవకలకు కారణమై నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ రాజీనామా చేయాలని విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన ఉధృతం చేసి.. కార్యాలయంలోకి దూసు కెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉధ్రిక్తంగా మారుతుండటంతో పలువురు ఏవీబీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కార్యాలయం వద్ద బైఠాయించారు. తమ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలాఉంటే ఆదివారం పలు విద్యార్థి సంఘాలు ఇంటర్‌ బోర్డుతీరుపై ఆందోళన చేపట్టాయి. ఇంటర్‌ మూల్యాంకనంలో అవకతవకలపై విచారణ జరిపించాలని తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) నాయకులు నిజాం కళాశాల ఎదుట ధర్నాచేశారు. మూల్యాంకనాన్ని తిరిగి చేపట్టాలన్నారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కాలేజీ గేటు ఎదుట విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

ఇంటర్మీడియట్‌ బోర్డుపై రోజురోజుకు ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దటం కంటే.. అధికారులు ఎదురుదాడికి దిగటం ఆందోళన కలిగిస్తోంది. బోర్డు వైఖరికి నిరసనగా, న్యాయం చేయాలంటూ నాంపల్లిలోని బోర్డు ఎదుట స్టూడెంట్స్‌, పేరంట్స్‌ భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. వీరికి సమాధానం చెప్పాల్సిన బోర్డు అధికారులు.. తప్పించుకుని తిరుగుతున్నారు. అన్నీ సరిచేస్తాం అంటూ చెప్పుకొస్తున్నారు. రీ వ్యాల్యూయేషన్‌ కోసం 600 రూపాయలు చెల్లించాలంటూ కండీషన్‌ పెట్టారు. దీనిపై పేరంట్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తప్పు చేస్తే.. డబ్బులు మేం ఎందుకు కట్టాలని నిల దీస్తున్నారు. 600 డబ్బులు కడతాం.. పోయిన ప్రాణాలు తీసుకొ స్తారా అని ప్రశ్నిస్తున్నారు. భారీ ఎత్తున స్టూడెంట్స్‌, పేరంట్స్‌, విద్యార్థి సంఘాలు ఇంటర్‌ బోర్డు దగ్గరకు వస్తుండటంతో.. పెద్ద ఎత్తున పోలీస్‌ బలగాలు కూడా మోహరించాయి. అరెస్టులు చేస్తున్నరు. బోర్డు చుట్టుపక్కల ఎవరూ ఉండొద్దని ఆంక్షలు విధిస్తున్నారు. న్యాయం చేయమని అడగాటానికి వచ్చిన విద్యార్ధు లపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. అదేమని ప్రశ్నించిన విూడియా ప్రతినిథులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. లైవ్‌ కవరేజ్‌ ను అడ్డుకున్నారు. ఇంటర్‌ బోర్డ్‌ దగ్గరకు వస్తున్న విద్యార్ధులు, వారి తల్లిదండ్రులను ఎక్కడిక్కడే అరెస్ట్‌ చేస్తున్నారు పోలీసులు. మా బిడ్డల భవిష్యత్తు గురించి అడగటానికి వస్తే.. మాపై ఈ దాడులేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెరిట్‌ స్టూడెంట్‌ అయిన మా అబ్బాయి ఫెయిల్‌ అయ్యాడు.. అడగటానికి వస్తే ఎవ్వరూ సమాధానం చెప్పటంలేదని  ఓ విద్యార్ధి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై  కమిటీ వేశామని ఒకే ఒక్కమాట చెప్పేసి మంత్రి జగదీశ్‌ రెడ్డి వెళ్లిపోయాడని..వారి పిల్లలకే గనుక ఇటువంటి పరిస్థితి వస్తే హాయిగా ఇంట్లో పడుకుంటాడా అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా రు. మూడు రోజుల నుంచి పడిగాపులు పడుతున్నాం.. ఎలాంటి సమాధానం రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ నేతల మద్దతు, రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

ఇంటర్‌ బోర్డు ఎదుట ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలోనే వారికి కాంగ్రెస్‌ నేతలు మద్దతు పలికాదు. రేవంత్‌ రెడ్డి, సంపత్‌కుమార్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధర్నాలో పాల్గొన్నారు. వీరిని కూడా అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు. ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్ధి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు.

సీఎం కేసీఆర్‌ కు కాంగ్రెస్‌ నేతల బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్‌ కు కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌, భట్టి విక్రమార్కలు బహిరంగ లేఖ రాశారు. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన మిస్టేక్స్‌ పై ప్రభుత్వం స్పందించటంలేదనీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయిందని లేఖలో తెలిపారు. 9.45 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేసిందని..ఫలితాలు వెల్లుడిన మూడు రోజుల్లో 12మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనీ వారి ఆశల్ని ప్రభుత్వం నాశనం చేసిందని లేఖలో పేర్కొన్నారు. ఈ దుస్థితితో విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారనీ ఆరోపించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close