తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలుగు రాష్ట్రాల్లో బుధవారం నుంచి ప్రారంభమైన ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఎలాంటి సంఘటనలు లేకుండా ప్రశాంతగా సాగాయి. ఉదయం 9 గంటలకే పరీక్ష మొదలు కావడంతో విద్యార్థులు పరిక్ష కేంద్రాల వద్ద 7.30 నుంచే బారులు తిరారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల విధులు నిర్వర్తించే పర్యవేక్షకులు, సిట్టింగ్‌ స్క్వాడ్లు సహా ప్లయింగ్‌ స్క్వాడ్లు సైతం పరీక్షలు ముగిసే వరకూ సెల్‌ఫోన్లు వాడరాదని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. వాట్సాప్‌ ద్వారా గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నందున సిబ్బంది మొబైల్‌ ఫోన్‌ వాడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. జిరాక్స్‌ కేంద్రాలపై నిఘా ఉంచాలన్నారు. ఏపీలో మొత్తం 10.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదని ఏపీ ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి స్పష్టం చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here