ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు

0

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిస్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. విదేశీ నిధుల

స్వీకరణలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు

పొందాలంటే తప్పనిసరిగా ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌( ఎఫ్‌సిఆర్‌ఏ) కింద రిజిస్టర్‌ చేసుకుని ఉండాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఇన్ఫోసిస్‌ తమ

వార్షిక ఆదాయం, విదేశీ నిధుల వ్యయాలు, బ్యాలెన్స్‌ షీట్‌ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ విదేశాల నుంచి ఎలాంటి విరాళాలు

రాకపోయినా..నిల్‌ రిటర్న్స్‌ దాఖలు చేయాలి కాని ఇన్ఫోసిస్‌ నోటీసులు జారీ చేసినప్పటికి స్పందించలేదు. దీంతో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు

చేస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్‌ కూడా ధవీకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here