Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

పెగులుతున్న గొంతులు..

అంతా ఓనర్లమేనంటూ సంకేతాలు

  • బయటపడుతున్న అసమ్మతి సెగలు..
  • కారులో పెరుగుతున్న తిరుగుబాటుదారులు..
  • అసమ్మతులకు గాలం వేస్తున్న కమలనాథులు

ఇప్పటివరకు అతనే రాజు, అతనే మంత్రి, అతనే సర్వం. అతను కనుసైగచేస్తే చాలు ఒక్కరంటే ఒక్కరూ కూడా నోరుమెదిపేవారు కాదు. ఆయన ఆదేశిస్తే పార్టీ పనులన్నీ చకచకా జరిగిపోయేవి.. అతను కన్నెర్రజేస్తే సీనియర్‌ నాయకులు సైతం మౌనంగా తలదించుకునేవారు. అధినేత మాటకు ఒక్కరంటే ఒక్కరూ కూడా ఎదురుచెప్పే సాహసం, ఎదురు వెళ్లి మాట్లాడే ధైర్యం చేసే వారే కాదు. అది భయమో,భక్తో మరేదో తెలియదు కాని టిఆర్‌ఎస్‌ పార్టీకి అన్నీ తానై నడిపించినా కెసిఆర్‌ కు ఇప్పుడు స్వంత పార్టీలోనే ప్రశ్నించే గొంతులు, ఎదిరించే నాయకులు చాటుమాటుగా కొందరు, బహిరంగంగా ఇంకొందరు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నారు. అధినేత ప్రవర్తనను ఇంకా సహించేదీ లేదని, గులాబీ పార్టీ ఏ ఒక్కరి స్వంతం కాదని, అందరి కలిసి పోరాటం చేస్తేనే రాష్ట్రం ఏర్పడిందనే స్వరాలు వినపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే గ్రామాలు ఏలా ఉన్నాయో, బంగారు తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఇసుమంత కూడా అభివృద్ది చెందలేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోయి తెలంగాణ రాష్ట్రం అనే బోర్డు విూద పేరు విూద మారిందని స్వంత పార్టీ నేతలు చెప్పకనే చెపుతున్నారు.. ఉద్యమాలు, బలిదానాలు చేసిందీ ఒకరైతే పదవులు, అధికారాలు అనుభవించేదీ మరొకరనే గళాలు స్వరం పెరుగుతోంది. స్వంత పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న అసమ్మతిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాషాయం పార్టీ అన్ని విధాలుగా సిద్దంగా ఉంది. ఇప్పుడు బయట పార్టీలను కాకుండా ఇంట్ల పార్టీ నాయకులను ఎదుర్కోవడమే గులాబీ బాస్‌ కి తలకు మించిన భారమైపోయింది..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌:

తనకు, తన పార్టీకి ఎదురే లేదని భావిస్తూ తెలంగాణలో ఏకచ్చత్రాధిపత్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ అధినేతకు అసమ్మతి పొగ మొదలయ్యింది. అందరికి తగిన రీతిలో అవసరాన్ని బట్టి పదవులు, ప్రత్యేక గుర్తింపుతో ముందుకు పోతామని చెప్పిన కెసిఆర్‌ మాటను స్వంత పార్టీ నాయకులే వినడం లేదు. మొన్నటికి మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో అశావాహులకు, అధిష్టానంపై నమ్మకం ఉన్నవారికి అందరికి మొండిచెయ్యే చూపారు. కెసిఆర్‌ కావాలనే మమ్ముల్ని తొక్కిపెట్టారంటూ ఒక్కొక్కరూ పార్టీ వీడేందుకు ఎవరికి వారుగా సిద్దమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏ ఒక్కరి సొంతం కాదని, అది కోట్లమంది కొట్లాడితే వచ్చిందని, ప్రజలు కొరుకున్న ఆశలను నేరవేర్చకుండా, అభివృద్దిపై, వివిధ ప్రభుత్వ పథకాలపై ఎవరితో సంప్రదించకుండా తనకు నచ్చినట్టు, నచ్చిన రీతిలో మొండిగా పోతున్న కెసిఆర్‌ కొట్లాది ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు స్వంతం పార్టీలో పెరిగిపోతున్నాయి.

నమ్మించి మోసం చేశారంటున్న టిఆర్‌ఎస్‌ నేతలు

ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదిన నెలల తర్వాత పదవుల పంపకం చేపట్టటంతోపాటు, పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌ కు పార్టీ నేతల నుంచి విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకావటం ఇదే తొలిసారంటున్నారు. మంత్రివర్గంలో ఛాన్స్‌ దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలకు పదవులు దక్కకపోవటంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. పదవి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. కనీసం పిలిచి మాట్లాడితే బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. సవిూకరణాలు కుదర్లేదనో.. లేదంటే మరో పదవిని ఇస్తానన్న హావిూని ఇస్తే బాగుంటుందని.. అదేవిూ లేకుండా తన మానాన తాను ఉండిపోవటం.. ఎమ్మెల్యేలతో కనీసం దగ్గరకు రానివ్వకపోవటం ఏమిటని పలువురు తెరాస నాయకులు ప్రశ్నిస్తున్నారు. అధినేత విూద పీకల వరకూ గుర్రుగా ఉన్నా ఆవేశాన్ని ఆపుకొలేక కొంతమంది బయటపడుతున్న మరికొంతమంది లోలోపలే కుమిలిపోతున్నారని తెలుస్తోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విషయానికే వస్తే.. ఆయన ఆదివారం విదేశాలకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో పాటు తనను గుర్తించటం కేసీఆర్‌ విూద ఉన్న అలకతో అసెంబ్లీ సమావేశాల జరుగుతుండగా తాను ఫారిన్‌ వెళ్లటం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇదిలా ఉంటే మంత్రివర్గంలో స్థానం ఆశించిన జోగు రామన్న ఆజ్ఞాదంలోకి వెళ్లారని సమచారంశ. ఆదివారం ఉదయం నుంచి ఎక్కడకు వెళ్లారో సమాచారం రావటం లేదు. ఫోన్‌ స్విఛాప్‌ చేసుకొని.. గన్‌ మెన్లను కూడా వదిలి పెట్టి వెళ్లటం ఇప్పుడు సంచలనంగా మారింది. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కాయమని ఎన్నో ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో,పరిస్థితి మరోలా ఉండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. పదవులు రాక నాయిని నర్సింహరెడ్డి తదితరులు తమ అక్కసును వ్యాఖ్యల రూపంలో బయటపెడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది..

గుర్రుగా ఉన్న తెరాస సీనియర్‌ నాయకులు.

తెలంగాణ రాష్ట్ర సమితిలో మొదటి నుంచి ఉన్న వారిలో నాయిని ప్రముఖుడు. కేసీఆర్‌ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన నర్సింహరెడ్డి ఇప్పుడు కెసిఆర్‌ అంటేనే మండిపడుతున్నారు. మొదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా, కేసీఆర్‌ సీఎం అయ్యాక ఆయనకు ¬ం మినిస్టర్‌ పదవి దక్కింది. అయితే రెండోసారి కెసిఆర్‌ సీఎం అయ్యాక నాయినిని మాత్రం కేసీఆర్‌ దాదాపుగా పక్కన పెట్టేశారు. కేబినెట్‌ విస్తరణల్లో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో నాయిని ఫైర్‌ అయిపోయారు. ఓనర్‌ లాంటి తనకు అవకాశం ఇవ్వకుండా కిరాయి నేతలకు పదవులు ఇస్తున్నారంటూ కేసీఆర్‌ విూద మండిపడుతున్నారు. నాయిని సంగతలా ఉంటే, మరోవైపు మరో రెడ్డి నేతకు కూడా కేసీఆర్‌ హ్యాండిచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అందరూ ఖాయం అనుకున్నారు. కాని ఆయనకు దక్కలేదు. కాని ఆయనకు శాసనమండలి చైర్మన్‌ పదవి ఖరారు అయ్యింది. ఆయన మరెవరో కాదు గుత్తా సుఖేందర్‌ రెడ్డి. ఈయన కేసీఆర్‌ కేబినెట్లో చోటును ఆశించారు. గతంలో నల్లగొండ ఎంపీగా ఉన్నప్పుడు ఫిరాయించి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరిన వ్యక్తి గుత్తా. అప్పట్లోనే ఈయనకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా గుత్తాకు ఆ అవకాశం దక్కలేదు. కానీ..ఆయనకు శాసనమండలి చైర్మన్‌ పదవి ఖరారు అయ్యిందని స్పష్టత వచ్చినట్టైంది. ఈ మేరకు ఆయన ఆ పదవికి నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. మండలిలో బలబలాల ప్రకారం ఆయనకు ఆ పదవి ఖరారు అయినట్టే! మంత్రి పదవి దక్కకపోయినా మండలి చైర్మన్‌ పదవిలో గుత్తా హ్యాపీనేనేమో చెప్పలేం. మరికొందరు నేతలు కూడా కులాల వారీగా తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదంటున్నారు. ఒక్కరొక్కరిగా పెరిగిపోతున్న అసమ్మతి చివరకు ఎక్కడి వరకు పోతుందా తెలియట్లేదు. అసమ్మతులందరికి బిజెపి ఏదో ఒక పదవుల ఆశ చూపిస్తూ తన వైపు తిప్పుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close