సునామీ మృతుల సంఖ్య 1,347

0

● వెల్లడించిన విపత్తు నిర్వహణ శాఖ

పాలూ: సునామీ-భూకంపం ఏకకాలంలో విసిరిన పంజాకు ఇండోనేసియాలోని పాలూ నగరం అతలాకుతలమవుతోంది. ప్రకృతి ప్రకోపానికి గురైన ఈ నగరంలోని పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. తొలుత 48మంది మాత్రమే మృతి చెందారని తెలుపగా గత నాలుగు రోజులుగా మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రస్తుతం 1,347కి చేరింది.
మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య పెరిగిపోయిందని విపత్తు నిర్వహణ శాఖ అధికారి సుటోపో పుర్వో తెలిపారు. ప్రస్తుతం వారందరికీ సామూహిక అంత్యక్రియలు జరుపుతామని తెలిపారు. పాలూ లోని కొండ ప్రాంతంలో ప్రజల పరిస్థితి ఇంకా తెలియడం లేదు. అక్కడికి సహాయక బృందాలు వెళ్లడానికి రవాణా సౌకర్యం కూడా లేదు. కానీ కొందరు సహాయక సిబ్బంది సాహసం చేసి అక్కడకి వెళ్లారు. రెండు, మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడితే మరికొన్ని బృందాలను అక్కడికి పంపుతాం’ అని తెలిపారు.
సంచుల్లో తీసుకొచ్చి ఖననం: కొన్ని మృతదేహాలను స్ట్రెచర్‌లపై తీసుకొస్తున్నారు. మరి కొన్ని మాత్రం కుళ్లిన స్థితిలో ఉండటంతో వాటిని పెద్ద పాలిథీన్‌ సంచుల్లో తీసుకు వచ్చి సామూహిక ఖననం చేస్తున్నారు. మృతదేహాల నుంచి దుర్వాసన వస్తుండటంతో వ్యాధులు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here