బిజినెస్

అమెజాన్‌పై భారతీయుల తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సంస్కతి, సంప్రదాయాలకు పుట్టిల్లు భారతదేశం. అలాంటిది హిందువులు ఎంతో ఆరాధనగా పూజించే దేవుళ్ల చిత్రాలను కాలి కింద వేసుకునే రగ్గులపై ముద్రించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రముఖ ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌. దీంతో భారత వినియోగదారులు అమెజాన్‌ సంస్థపై ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు. దీని పర్యవసానంగా ప్రస్తుతం ట్విటర్‌లో బాయ్‌కాట్‌ అమెజాన్‌ అనేది ట్రెండింగ్‌లో నిలిచింది. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో వినాయకుడు, శివుడు, ఓంకారం గుర్తులతో డోర్‌మ్యాట్లు, బాత్రూం రగ్స్‌ దర్శన మిచ్చాయి. వీటితోపాటు భారత జాతీయ జెండాతో కూడిన డోర్‌ మ్యాట్స్‌ కనిపించాయి. దీంతో షాక్‌కు గురైన భారతీయులు హిందూ మతాన్ని కించపరుస్తున్నారని, భారత్‌ను అవమానిస్తు న్నారంటూ అమెజాన్‌పై నిప్పులు చెరిగారు. ‘సంస్కతిని గౌరవిం చడం తెలీకపోయినా అవమానించడం మానుకోండి’ అని నెటిజ న్లు ఘాటుగా విమర్శించారు. మన సంస్క తిని కించపరుస్తున్న అమెజాన్‌ను బహిష్కరిద్దాం అని పిలుపునిచ్చారు.
దీంతో ట్విటర్‌ లో ప్రస్తుతం అనేది ట్రెండింగ్‌గా నిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అమెజాన్‌ తాజాగా వివాదానికి కారణమైన వస్తువులను వెబ్‌సైట్‌ నుంచి తొలగింది. కాగా అమెజాన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధం గా దేవుని ఫొటోలు, జాతీయ జెండాను ముద్రించిన డోర్‌మ్యాట్స్‌ను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close