
- లోక్‌సభ ఎన్నికల బరిలో కమల్‌హాసన్
న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్): మరికొద్ది రోజుల్లో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) ఒంటిరిగానే పోరాటం చేస్తుందని లోక నాయకుడు కమల్ హాసన్ తెలిపారు. తమిళనాడులో మొత్తం 40 స్థానాల్లో ఎవరి మద్ధతు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. చెన్నైలో ఫిబ్రవరి 7న విూడియాతో మాట్లాడిన కమల్‌హాసన్.. గతంలో చెప్పినట్లుగా ఏ పార్టీతో కలిసేందుకు తాము సిద్ధంగా లేమని వెల్లడించారు. తమిళనాడు, పుదుచ్చేరి పరిధిలోని 40 పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌కు పోటీ చేస్తామని తెలిపిన కమల్.. తాను ఏ స్థానం నుంచి పోటీ చేస్తాడనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. మార్పు కోసం ప్రయత్నిస్తున్న తమకు అనుకూల ఫలితాలే వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గతంలో తమ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న పార్టీలతో కలుస్తామని, బీజేపీని ఓడించడానికి ఏ పార్టీతో అయినా కలిసి అడుగేస్తామని తెలిపిన ఆయన సడెన్‌గా ఒంటరిపోరాటం చేస్తాననడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురైయ్యారు. 2018 ఫిబ్రవరిలో కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ పేరుతో తమిళనాట కొత్త పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. 40 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంచుకోనున్నట్లు వీటి కోసం త్వరలోనే కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Related