వార్తలు
Trending

రాజకీయాల్లో స్వచ్ఛదనం కోసం మొక్కల పంపిణి

Gunda Nagarani Rajendar want to make 9th ward as No.1 Ward in Jagtial

Story Highlights
  • జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో వార్డు వార్డునా అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది.
  • 9 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి గుండ నాగరాణి మరోమారు ఇంటింటికీ మొక్కలనందిస్తూ
  • ఓటర్లను ఆకట్టుకుంటుంది.

9 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి గుండ నాగరాణి మరోమారు ఇంటింటికీ మొక్కలనందిస్తూ…ఓటునభ్యర్థిస్తూ…ఓటర్లను ఆకట్టుకుంటుంది.

ఈ నెల 20 సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుండగా… అధికార పార్టీ అభ్యర్థులతో పాటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమ తమ ప్రచారంలో మునిగి పోయారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ధరూర్ క్యాంపు 9 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి గుండ నాగరాణి రాజేందర్ ఒక ప్రత్యేకతతో వార్డులోని ప్రతి ఇల్లు తిరుగుతూ ప్రచారం గావిస్తుంది. ఈ నేపథ్యంలో…

శనివారం రోజున ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి, మరోమారు ఆమె తన ప్రచారం గావించింది. అలాగే శనివారం రోజునా ఇల్లిల్లూ తిరుగుతూ తాను రూపొందించిన ఒక ప్రత్యేక ప్రణాళికతో చేపట్టిన కరపత్రం అందిస్తూ…స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు “టెలిఫోన్” గుర్తుపై ఓటేయండి – వార్డు అభివృద్ధి ని కోరుకోండి… అని అంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే మీ ఆశీస్సులే నా గెలుపు… అంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.అంతేగాకుండా తనను గెలిపిస్తే…ప్రతి ఇంటికీ 5 లక్షల ప్రమ్ద బీమా సౌకర్యం కల్పిస్తానని…అన్ని వేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇస్తూ…మొక్క మీకు…ఓటు నాకు అంటూ ప్రచారం ముమ్మరం చేశారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close