పెరిగిన వర్షాల జోరు..

0
  • వరదల్లో చిక్కుకున్న 15 వేల మంది
  • స్తంభించిపోయిన జనజీవనం

ఈశాన్య రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. కుండపోత వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అరుణాచల్‌ప్రదేశ్‌ను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈస్ట్‌ కమెంగ్‌ జిల్లాలో వర్షాలు తీవ్ర

ప్రభావం చూపాయి. వర్షాలకు నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. వరదల కారణంగా వంతెనలు, రహదారులు తెగిపోవడంతో పలు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. బన సబ్‌డివిజన్‌ పరిధిలోని బమెంగ్‌, చయంగ్జో,

గ్యావెపరంగ్‌ వరదల కారణంగా వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు తాత్కాలిక వంతెన వేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా పలు గ్రామాల్లో ఇల్లు దెబ్బతిన్నాయి. వ్యవసాయ భూముల్లో నీట

మునగడంతో పంటలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా పలు అభివృద్ధి పనులకు అంతరాయం ఏర్పడింది. వరదలకు ఈస్ట్‌ కమెంగ్‌ జిల్లా పూర్తిగా దెబ్బతిన్నదని సమాచారం. స్థానిక ప్రజలు ప్రయాణం చేసేటపుడు తగిన ముందస్తు

జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది. అటు అసోంలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయికి చేరుకుంది.. గత రెండు రోజులుగా అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో బ్రహ్మపుత్ర నదిలో

ప్రవాహం పెరిగింది. గువహతి సమీపంలోని బ్రహ్మపుత్ర నదిలో గంటకు 2, 3 సెంటిమీటర్ల చొప్పున నీటిమట్టం పెరుగుతోంది. డిబ్రూగర్‌, లఖిమ్‌పుర్‌, సోనిట్‌పుర్‌ వద్ద కూడా క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. అసోంలోని 5 జిల్లాలోని

50 గ్రామాల్లో వరదలు ముంచెత్తాయి. ధీమాజీ, లఖిమ్‌పుర్‌, జోర్హాట్‌, బిస్వనాథ్‌, గోలఘాట్‌ జిల్లాల్లోని 15 వేల మంది వరదల్లో చిక్కుకున్నారు. జిల్లా యంత్రాంగం వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది.

వరదల కారణంగా వెయ్యి హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here