అసంపూర్తిగా మిగిలిన ‘మిషన్‌’ చెరువులు

0
  • చెట్లు, చెత్తతో నిండిన కుంటలు
  • గండ్లు పడిన ‘కాకతీయ’ కాలువలు
  • కూడిపోయిన చెక్‌డ్యాములు..
  • కనిపించని ఫీడర్‌ చానల్లు

హైదరాబాద్‌, (ఆదాబ్‌ హైదరాబాద్‌)

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంలో చేపట్టిన పనులు సక్రమంగా సాగక పోవడం వల్ల అనేక చెరువులు, కుంటలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పనులు నాణ్యతా లోపంతోనే కాకుండా ఆయా ప్రాంతాలలో ఉన్న చెరువులు, కుంటలలో సరిగా పూటిక తీత పనులు చేపట్టక పోవడంతో సగం పనులకే పరిమితమయ్యాయి. అయితే మిషన్‌ కాకతీయ పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చెరువులు, కుంటల పూడిక తీత కార్యక్రమం మొదటి విడత ఎంతో ఉత్సాహాంగా జరిగింద. కాగా మిషన్‌ కాకతీయ రాష్ట్రంలో రైతులకు వరంగా ఉందని పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కితాబిచ్చింది. అయితే ఒక చెరువును పూడిక తీత మొదలు పెడితే ఆ చెరువు అయిపోయే వరకు తీయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాలలో చెరువులలో సగం వరకు మాత్రమే పూడిక తీత పనులు చేసి నిలిపివేశారు. దీంతో చెరువులు అసంపూర్తిగా నిలిపోయడంతో ఆయా గ్రామాలలో ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం సుమారు 46 వేల 447 చెరువులను ప్రభుత్వం గుర్తించింది. మొదటి విడత మిషన్‌ కాకతీయలో భాగంగా 9 వేల 573 చెరువువలను పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కాగా రాష్ట్రంలో మొత్తం 48 వేల 845 చిన్న నీటి వనరులు ఉండగా వీటిలో 27 వేల 814 చెరువులు, కుంటలు ఉండగా 12 వేల 154 గొలుకట్లు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే మిషన్‌ కాకతీయ కోసం వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగానే పనులను ప్రారంబించింది. కానీ కింది స్థాయి అధికారులు, కాంట్ట్రార్లు మాత్రం తూతూ మంత్రంగా పనులు చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

చెత్తా చెట్లతో నిండిపోయిన కుంటలు…

కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మిషన్‌ కాకతీయ పనులు ప్రారంబించక ముందు చెరువులు, కుంటలు ఎలా ఉన్నాయే ప్రస్తుతం కూడా చెరువులు, కుంటలు అలాగే చెత్తా చెదారం, చెట్లతో నిండిపోయి కనిపిస్తున్నాయి. అయితే చెరువుల పునరుద్దరణకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం పకడ్బందీగా అమలు చేయలేక పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే చెరువులను పూర్తి స్థాయిలో పూడిక తీత పనులు చేపట్టినట్లైతే చెరువులు, కుంటల కింద ఉన్న పొలాలకు సాగు నీరు రెండు పంటలకు అందేదనే భావన రైతులలో కనిపిస్తున్న సత్యం. ప్రభుత్వం మాత్రం రైతులకు రెండు పంటలకు సాగు నీరు అందించాలనే యోచనలో ఉన్నప్పటికి కిందిస్ధాయి అధికారులు మాత్రం ఆచరించడం లేనే విమర్శలు లేకపోలేదు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాపంగా మొత్తం 37 వేల 127 చిన్న నీటి కుంటలు ఉండగా అందులో సగానికి సగం కుంటలు భూ ఆక్రమణకు గురికాగా మిగిలిన కుంటలు చెత్త, చెట్లతో నిండిపోయాయి.

అయితే ఈ కుంటలను అసంపూర్తిగా ఉండడంతో పాటు వందలాది కుంటలకు భూ కబ్జాకు గురయ్యాయి. ప్రభుత్వం మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువులను పునరుద్దరించిన విధంగా కుంటలకు కూడా పునరుద్దరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

గండ్లు పడిన కాకాతీయ కెనాల్‌… కూడిపోయిన చెక్‌డ్యాంలు…

రాష్ట్ర వ్యాప్తంగా రైతు పంటలకు నీరందించేకుగాను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తవ్వించిన కాకాతీయ కెనాల్‌ ప్రస్తుతం పూర్తిగా గండ్లు పడి కనిపిస్తోంది. ఇప్పటి వరకు కాకతీయ కెనాల్‌కు కోట్లాది రూపాయలు వెచ్చినప్పటికి రైతులు నీటి అవసర కోసం అనేక చోట్ల కాలువలకు గండ్లు పెట్టడంతో అవి పూడ్చక కాలువల ద్వారా వచ్చే నీరు కూడా వృధాగా పోతోందని, దీంతో రైతుల పంట పొలాలకు అందే నీరు అందకుండా పోతోందని ఆయా ప్రాంతాలకు చెందన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతుల పంట పొలాల నుండి తవ్విన పిల్ల కాలువలను పూర్తిగా పూడ్చేచి రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. దీంతో కాకతీయ కెనాల్‌ ద్వారా వచ్చే నీరు వృధాగా పోతోందని పలువురు చెబుతున్నారు.అలాగే ఆయా జిల్లాల్లో నీటి నిలువలు ఎక్కువగా ఉండేందుకు గాను రైతుల పంట పొలాలతో పాటు పలు అటవీ, పోడు, బంజరు భూములలో చెక్‌డ్యాంల నిర్మాణాలను చెపట్టింది. చెక్‌డ్యాంల నిర్మాణ వల్ల వర్షపు నీరును ఒడిసిపట్టుకోవచ్చనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే వాటిపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల అట్టి చెక్‌ డ్యాంలు పూర్తిగా కనుమరుగయ్యాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన చెక్‌ డ్యాంలు ఎక్కడా ఏ ఒక్కటి కూడా కనిపించక పోవడంతో మళ్ళీ చెక్‌డ్యాంల నిర్మాణం చేపడితే పశులకు కానీ , రౌతులకు కానీ అటు వర్షపు నీరు లేదా కాలువల ద్వారా వచ్చే నీటి నిలువలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు అంటున్నారు. కాగా వీటి తోడు రైతులకు వంద వాతం మేలు కలిగే విధంగా రైతు పంట పొలాలకు నీరందే విధంగా చెరువులు, కుంటలు, వాగులు, తోగుల నుండి పంట పొలాల మీదుగా ఫీడర్‌ చానల్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే గతంలో వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో ఫీడర్‌ చానల్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికి సరిగా అమలు కాకపోవడం విశేషం. అయితే ప్రభుత్వం మాత్రం రైతులకు అటు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇటు గోదావరి బేసిన్‌, క్రిష్ణా బేసిన్‌ నుండి మొత్తం 265 టిఎంసిల నీటిని వినియోగించుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగానే మిసన్‌ భగీరథ పథకం ద్వారా ప్రతీ జిల్లాకు సాగు నీరు, తాగు నీరు అందించేందుకు గాను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు. అయితే రాష్ట్రంలో తొలుత కాకతీయ కెనాల్‌లను శుభ్రం చేయించి గండ్లు పడ్చివేయాలని, చెత్తతో పేరుకుపోయిన చెరువులు, కుంటను ఆధునీకరించాలని అలాంటప్పుడే రైతుల పంట పొలాలకు అందే నీరు వృధా కాకుండా పొలాలకు చెరుతుందని పలువురు రైతులు కొరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here