తెలుగురాష్ట్రాల్లో…. మనసు మాట వినదు

0

-ముసుగుతో ‘రెడ్డి కాంగ్రెస్‌’

-పద్దతి మార్చుకోవాలని

దళితుల డిమాండ్‌

-అన్న కోసం ‘తమ్ముడు’ గగ్గోలు

-కసీఆర్‌ ఫెడరల్‌ పై ‘దేశం’ ఫైర్‌

అనంచిన్ని వెంకటేశ్వరరావు

ఆదాబ్‌ హైదరాబాద్‌

రాజకీయ నాయకుల మనస్సులో ఉండేది వేరు.. బయటకు వెల్లడించేది వేరు.. అన్న విషయాన్ని ఆదివారం కాంగ్రెస్‌ నాయకులు బట్టబయలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నేతలు చేసిన గత తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బాగానే కష్టపడుతున్నారు. అందుకు అందమైన ముసుగులు వేసి ప్రత్యర్ధులను టార్గెట్‌ చేసి సచ్చీలురుగా... నిసిగ్గుగా ఫోజులు ఇస్తున్నారు. కాంగ్రేస్‌ పార్టీ ఏకంగా ఓ దళితనేతను టార్గెట్‌ చేయగా... ఏపీలో తమ్ముడు పవన్‌ అన్న చిరు బలహీనతలను కప్పెట్టే ప్రయత్నం చేశారు.

టీపీసీసీపై సర్వే సంచలన వ్యాఖ్యలు:

తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు రచ్చకెక్కాయి. ఆదివారం గాంధీభవన్లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ సవిూక్ష సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ఈ సందర్బంగా మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్ల మధ్య వివాదం నెలకొంది. దీనిపై సర్వే సత్యనారాయణ విూడి యాతో మాట్లాడుతూ.. టీపీసీసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ కుంతియాలే కారణమని ఆరోపించారు. ఓటమి కారకులే మళ్లీ ఓటమిపై సవిూక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్‌, కుంతియాల వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని అన్నారు. వాళ్ల అసమర్ధతను ప్రశ్నిస్తే దాడులు చేయించడానికి గాంధీభవన్లో రౌడీలను పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమె త్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు చెబుతుంటే మహేశ్‌ గౌడ్‌, బొల్లి కిషన్లతో ఉత్తమ్‌ తనపై దాడి చేయించినట్టు ఆరోపిం చారు. పార్టీలో కొందరు రౌడీ మూకలు ఉన్నారని.. ఒకరిద్దరు దద్దమ్మలు తనపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ గెలుపుకు సలహాలు ఇస్తుంటే.. ఇది నచ్చనివారు తనపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీకాంగ్రెస్లో ఏం జరుగుతుందో రేపు మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. అర్హత లేని ఉత్తమ్కు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారని.. ఆయనను పదవి నుంచి వెంటనే తొలగించాలని అధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు.

సర్వే సస్పెన్షన్‌ వేటు:

మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణపై కాంగ్రెస్‌ పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. సర్వే సత్యనారాయణ మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సవిూక్ష సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌.సి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ పై సర్వే దాడికి పాల్పడ్డారు. సమావేశంలో సంబంధంలేని అంశాలు మాట్లాడుతూ నేతలను నిందిస్తూ..ఘర్షణకు దిగారు. సర్వే సత్యనారాయణ దురుసు ప్రవర్తన నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. సర్వే సత్యనారాయణకు అనేక సార్లు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి, పదవులు ఇచ్చినా..సమావేశంలో ఆయన పార్టీ నాయకత్వం పట్ల వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్‌ నేతలు విస్మయం వ్యక్తం చేశారు.

గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌ లో చేరిన సర్వే సత్యనారాయణ 2004లో సిద్దిపేట నుంచి ఎంపీగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. 2009 లో మల్కాజిగిరి పార్లమెంట్‌ జనరల్‌ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. కేంద్రంలో జాతీయ రహదారుల శాఖ మంత్రిగా పనిచేసిన సర్వే..2014 జనరల్‌ స్థానం మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అదేవిధంగా 2015 వరంగల్‌ ఎస్సీ స్థానం నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కంటోన్మెంట్‌ పాలక వర్గం ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ కొడుకు, కూతురు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సర్వే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

‘ఓటరు మారాడు.. పార్టీ కూడా మారాలి’- దామన్న

కాంగ్రెస్‌ పార్టీ లైన్‌ ఆఫ్‌ థింకింగ్‌ మార్చుకోవాలని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అభిప్రాయపడ్డారు. ఓటర్ల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని, దానికి అనుగుణంగా పార్టీ తీరు కూడా మారాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభావంపై గాంధీభవన్లో సవిూక్షా సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సమావేశంలో దామోదర మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి ప్రధానంగా మూడు, నాలుగు కారణాలున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అధికార దుర్వినియోగంతో పాటు ఎన్నికల సంఘం తీరుపై అనేక అనుమానాలున్నాయని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉందని, ఈసీ నిర్ణయాలు కూడా టీఆర్‌ఎస్కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకుపోవడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని, ప్రజాసమస్యలపై పోరాటం చేయ్యలేకపోయ్యామని దామోదర తెలియజేశారు. అభివృద్ధికి ఓట్లకు సంబంధంలేదని, చివరి ఇరవై రోజులు ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు.

‘ఓట్లు చీల్చేందుకే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌’

?ఏపీ డిప్యూటీ సీఎం కేఈ విమర్శ

రాష్ట్రంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు తెలిపేందుకే 10 శ్వేత పత్రాలను విడుదల చేశామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ప్రజలు నిలదీస్తారన్న భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రాకుండా భాజపా నాయకులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు కేంద్రంలో మార్పును కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో భాజపా ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరు దెబ్బతీసినా ఇక్కడి ప్రజలు ఎదురు తిరుగుతారన్నారు. పార్లమెంట్లో హక్కుల సాధన కోసం పాటుపడుతున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలను సస్పెండ్‌ చేయడం సరికాదని కేఈ అన్నారు. విభజన చట్టం హావిూలనే అమలు చేయమని అడుగుతున్నామని.. ఎన్టీఆర్‌ కూడా దిల్లీ పెత్తనం విూదే ఎదురుతిరిగారని గుర్తు చేశారు. న్యాయమైన హక్కులను అడిగితే అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓట్లు చీల్చి భాజపాయేతర కూటమిని దెబ్బతీసేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసుల నుంచి ఉపశమనం కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్‌.. భాజపాతో దోస్తీ కట్టారని దుయ్యబట్టారు. మోదీ దేశ ప్రధానిలా కాకుండా గుజరాత్కి మాత్రమే ప్రధాని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు.

ఃనీలీ

అన్నయ్య అలా బల’హీనం’- పవన్‌

రాజకీయాల్లో రాత్రికి రాత్రి ఎవరూ ఎదగలేరని, పాతికేళ్లు ఓపిక పట్టాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాలని ప్రేరణ కలిగించిన వారిలో, ఆ పార్టీ ఆవిర్భావానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో తానూ ఒకడినని చెప్పారు. శనివారం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్‌ ఈవ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే సామాజిక న్యాయం జరిగేదని, ఓపిక లేని నాయకులు పీఆర్పీలో చేరడం వల్ల ఆ అవకాశం చేజారిపోయిందన్నారు. ఆ రోజు ప్రజారాజ్యంలోకి వచ్చినవారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారని, అందువల్లే తాను జనసేన పార్టీ నిర్మాణంలో ఆచితూచి ముందుకెళ్తున్నట్టు చెప్పారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో జనసేన పార్టీని స్థాపించానని వివరించారు.

యువతే జనసేనకు వెన్నెముక:

సినిమాల్లోకి రాక ముందు నుంచే తాను సమాజాన్ని క్షుణ్నంగా అర్థం చేసుకోవడం ప్రారంభించానని పవన్‌ తెలిపారు. యూనివర్సిటీల నుంచి పట్టాలు తీసుకోకపోయినా, రాజకీయ శాస్త్రం, ప్రభుత్వ విధానాలు, దేశంలో కులాలు- వాటి ప్రభావం, అంబేడ్కరిజం వంటి వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకున్నానని వివరించారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు పెద్ద నాయకులు ఎవరూ లేరని, యువతను నమ్మి పార్టీ పెట్టాన్నారు. వారే జనసేనకు వెన్నెముకగా పవన్‌ అభివర్ణించారు. దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు సంపూర్ణంగా వ్యాపారం అయిపోయాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు, రేషన్‌ కార్డులు తదితర ప్రజా సమస్యలను పరిష్కరించే ఓపిక కూడా నేతల్లో కనిపించటం లేదన్నారు.

60శాతం కొత్త వారికి అవకాశం..:

ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.2 వేల కోట్లు అవసరమని చాలామంది తనతో అంటున్నారని, ఇప్పుడున్న రాజకీయ పక్షాలు అందుకు సన్నద్ధంగా ఉన్నాయని చెబుతున్నారని పవన్‌ నేతలతో అన్నారు. అలాంటి పార్టీలతో విూరెలా పోటీ పడగలరని తనను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. అందుకే, రాజకీయాలు నడపడానికి డబ్బు అవసరం లేదని రుజువు చేసిన కాన్షీరాంను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తానన్నారు. తనకు సినిమాల్లో నటన ఎప్పుడూ సంపూర్ణంగా సంతృప్తి ఇవ్వలేదన్న పవన్‌.. ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడే సంపూర్ణ ఆనందం కలిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 60 శాతం మంది కొత్త వ్యక్తుల్ని బరిలో నిలుపుతానని, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో దీన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తానని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here