మే మొదటి వారంలోనే

0
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
  • మూడు దశల్లో పోలింగ్‌
  • 6,10,14 తేదీల్లో ఎన్నికలు..
  • 23 తరవాత ఫలితాల ప్రకటన

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మరో ఎన్నికల పోరు నగారా మోగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల పక్రియ ఈ నెల నాలుగో వారంలో ప్రారంభం కానుంది. వచ్చే నెల 14వ తేదీ లోపు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాతే ఈ ఓట్ల లెక్కింపు చేపడతారు. రాష్ట్రంలో వరుస ఎన్నికల హవా నడుస్తోంది. కొద్ది నెలల క్రితమే శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రెండు రోజుల క్రితమే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ పూర్తయింది. ఆ ఓట్ల లెక్కింపు చేపట్టకముందే మరో ఎన్నికలు వచ్చాయి. త్వరలో పదవీకాలం ముగియనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధమన్న రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖపై చర్చించి ఎన్నికల నిర్వహణకు నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ఓట్ల లెక్కింపు చేపట్టాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాతిపదికగానే జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 5857 ఎంపీటీసీ స్థానాలు, 535 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలతో పాటు మండల, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పదవులకు కూడా ఇప్పటికే రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు మొదటి దశ పోలింగ్‌ మే ఆరున, రెండో దశ పోలింగ్‌ 10న, మూడో దశపోలింగ్‌ 14న నిర్వహంచనున్నారు. 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ లోగా ఎన్నికలు ముగించి ఆ తరవాత ఫలితాల విడుదలకు షెడ్యూల్‌ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here