Featuredజాతీయ వార్తలు

న్యాయదేవత చూపులో… అన్యాయమూర్తి

  • సుప్రీం ఆదేశం
  • ఐబి దర్యాప్తు
  • అకౌంట్ల లింకులు బట్టబయలు
  • వెలుగులోకి విగ్రహాల అక్రమరవాణ కేసు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

దేశ న్యాయ చరిత్రలో ఓ చీకటి రోజు. న్యాయకోవిదులగ్భ్భ్రాంతి. దేశంలో న్యాయం అమ్ముడు పోతుందా..? న్యాయదేవతను నడిబజారులో అమ్మేస్తున్నారా..? న్యాయాన్ని తెగనమ్మారు. ఎంతకు తెగబట్టారంటే… ప్రాచీన విగ్రహాల అక్రమ రవాణా దారులతో కుమ్మక్కు అయ్యారు. కోట్ల రూపాయలు యథేచ్ఛగా చేతులు మారాయి.

ఇది పైకి కనిపించే చిన్నా, చితక వ్యవహారం కాదు. ఇదంతా చేసింది… ఇటీవల పదవీ విరమణ చేసిన మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. న్యాయదేవత కళ్ళు తెరిచింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ మహాతల్లి ఏకంగా సుప్రీంకోర్టు పీఠంపై కూర్చునేది. అదే జరిగితే ఇంకా ఎన్ని దారుణాలు గుట్టుగా.. గుంభనంగా జరిగేవి. న్యాయం బజారెక్కేది. ఆక్రోశం, ఆవేశం ఉన్నా… అసమర్థుల్లా ఉండాల్సి వచ్చేది. ఇంతకీ ఆమె ఎవరు..? పాలకు వచ్చి ముంత దాచటం ఎందుకు..? ఆ మహారాణి పేరు ది గ్రేట్‌, మాజీ ప్రధాన న్యాయమూర్తి తహిల్‌ రమణి. బెయిళ్ళు ఇచ్చిన ఆ చేతులు బెయిల్‌ కోసం అర్థించే రోజులు ఇంకా ఎంతో దూరంలో లేదు. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ప్రత్యేక సంచలన కథనం.

అపార్ట్‌ మెంట్ల కొనుగోలు బాగోతం వెనుక:

చెన్నై సెంమ్మంజేరీ, తిరువిడందైలలో మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో తహిల్‌ రమణి జూన్‌, జూలైలలో రెండు అపార్టుమెంట్లను కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు వెనుక అవినీతి ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆరోపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగాయ్కు ఐదు పేజీల నివేదికను సమర్పించింది. ఐబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఐబీ అధికారులు విచారణ ప్రారంభించారు.

ఇదిగో మూడు అవినీతి జాయింట్‌ అకౌంట్ల లింకులు:

మాజీ చీఫ్‌ జస్టిస్‌ కొనుగోలు చేసిన రెండు ఇళ్లను ‘లోరియన్‌ టవర్‌’ అనే సంస్థ నిర్మించిన అపార్టుమెంట్లలోనివే. వీటి విలువ రూ.3.18 కోట్లు. ఇందులో రూ.1.62 కోట్లను హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రుణం పొంది చెల్లించారు. మిగిలిన రూ.1.56 లక్షలను సొంతంగా చెల్లించారు. ఈ నగదు చెల్లింపులు తన బంధువులకు చెందిన ఆరు బ్యాంకు ఖాతాల నుంచి బదలాయింపు జరిగింది. వీటిల్లో మూడు ఖాతాలు తన భర్తతో జాయింట్‌ అకౌంట్గా ఉంది. మరొకటి తన కుమారుడి జాయింట్‌ అకౌంట్‌. మరొకటి తల్లితో జాయింట్‌ అకౌంట్‌. ఇంకోటి తన జీతానికి సంబంధించిన అకౌంట్‌. ఇదిలా ఉండగా, రూ.18 లక్షలు తహిల్రమణి, ఆమె తల్లి జాయింట్‌ అకౌంట్లోకి చేరాయి. కేవలం ఒక నెలలో మరో ఖాతాకు బదలాయింపు జరిగింది. ఇలా బ్యాంకు ఖాతాలకు నగదు బదలాయింపులపై ఐబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. తమిళనాడుకు చెందిన ఒక కేసు విచారణను కొట్టివేసిన నేపథ్యంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, నగదు లావాదేవీలు జరిగి ఉండొచ్చని ఆరోపిస్తోంది.

విగ్రహాల అక్రమ రవాణా వెనుక బాగోతం ఇదే..:

తమిళనాడులో విగ్రహాల అక్రమరవాణా కేసులకు సంబంధించి 2018లో ప్రత్యేక విచారణ బెంచ్‌ ఏర్పడగా న్యాయమూర్తి మహాదేవన్‌ అనేక కఠిన మైన చర్యలు తీసుకున్నారు. ఈ ప్రత్యేక బెంచ్ను అప్పటి ప్రధాన న్యాయమూర్తి తహిల్‌ రమణి రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ రద్దు వెనుక అక్రమాలు చోటుచేసుకుని ఉండే అవకాశాలు ఉన్నాయని ఐబీ సందేహిస్తోంది.

ఇదిగో ముసుగు:

మాజీ చీఫ్‌ జస్టిస్‌ గా పనిచేసిన కాలంలో తహిల్‌ రమణి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) చేసిన అభియోగంపై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న తహిల్‌ రమణిని సుప్రీంకోర్టు కొలీజియం మేఘాలయ హైకోర్టుకు ఇటీవల బదిలీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిని ఆశిస్తున్న దశలో దేశంలోనే అత్యంత చిన్నదైన మేఘాలయ హైకోర్టు బదిలీచేయడం అవమానంగా భావించినట్లు సమాచారం. ఈ క్రమంలో కొలీజియం నిర్ణయాన్ని నిరసిస్తూ తన పదవికి ఆమె రాజీనామా చేసింది. రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్‌ ఆమోదించారు. ఇదిలా ఉండగా, తహిల్రమణిపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అవినీతి ఆరోపణలు చేసింది. ఈ రాజీనామా చేయడంతో తమిళనాడులో అక్కడక్కడా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ఇప్పుడేం జరగనుంది:

దేశ చరిత్రలో జరిగిన ఓ అవాంఛనీయ సంఘటన. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఐబి అధికారులు లోతుగా తవ్వుతున్నారు. ఆధారాలన్నీ పక్కాగా ఉన్నాయి. తాజాగా రాష్ట్రపతి కూడా ఈ మహిళామణి రాజీనామా ఆమోదిచడం జరిగింది. ఇప్పుడు ఆమె అవినీతికి పాల్పడిన ఓ సాధారణ వ్యక్తి. ఆమె, ఆమె బంధువులపై చట్టపరమైన చర్యలు సహజంగానే జరుగుతాయి.

కొసమెరుపు:

వేలాదిమందికి బెయిళ్ళు ఇచ్చిన చేతులు త్వరలో మరో జిల్లా స్థాయి న్యాయమూర్తి ఎదుట నిలబడి కొంగుచాపి రెండు చేతులతో బెయిల్‌ కోసం అర్థించే రోజు రావడం అవాంఛనీయ విషాద సంఘటన.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close