Featuredక్రైమ్ న్యూస్

ఆయేషా కేసులో..సిబిఐ దర్యాప్తు ప్రారంభం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన అయేషా విూరా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రెండు కేసులు నమోదైనట్లు తెలిసింది. అయేషావిూరా హత్య కేసులో అసలు నిందితుల గురించి ఓ కేసు. న్యాయస్థానం రికార్డులను ధ్వంసం చేయడం, సత్యంబాబు ఎవరు..? ఏవిధంగా ఇరించి నిర్థోషిని దోషిగా మార్చటం వెనుక ఉన్న అధికారులపై మరో కేసు నమోదైనట్లు తెలిసింది. అయేషా కేసుకు సంబందించిన రికార్డులన్నీ ధ్వంసమ య్యాయి. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే రికార్డులు ధ్వంసం కావడంతో సబంధిత న్యాయస్థానం ఉద్యోగులకు సిబిఐ నోటీసులు ఇచ్చింది.

అసలేం జరిగింది.:

విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు వసతిగృహంలో 2007 డిసెంబర్లో ఆయేషావిూరా హత్యకు గురైంది. ఈ కేసులో నిందితుడైన సత్యంబా బును నిర్దోషిగా ప్రకటిస్తూ 2017 మార్చి 31న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు దోషులను గుర్తించి శిక్షించాలంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. తమ కుమార్తె హత్య కేసుపై దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని కోరుతూ ఆయేషా తల్లిదండ్రులు శంషాద్బేగం, సయ్యద్‌ ఇక్బాల్‌ బాషా మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం ఆయేషావిూరా హత్య కేసుపై తాజాగా దర్యాప్తు జరపాలని సిట్ను ఆదేశించింది. వారు దర్యాప్తులో చేతులు ఎత్తేయడంతో హైకోర్టు సిబిఐకి కేసు అప్పగించింది.

సాక్ష్యాలు నాశనం చేసిందెవరు?: దర్యాప్తునకు సంబంధించి పురోగతి వివరాల్ని సిట్‌ హైకోర్టుకు సమర్పించింది. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా.. దిగువ కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ సత్యంబాబు దాఖలు చేసిన అప్పీల్‌ 2017 మార్చి వరకు హైకోర్టులో పెండింగ్లో ఉందని, విజయవాడలోని దిగువ కోర్టులో 2014 అక్టోబర్‌ 7నే వస్తు సంబంధ సాక్ష్యాలు నాశనం చేశారని ధర్మాసనం గుర్తించింది. దీనివెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని ఆదేశించింది.

హైకోర్టు విస్మయం: దిగువ కోర్టులో వస్తు సంబంధ సాక్ష్యాధారాలను (మెటీరియల్‌ ఆబ్జెక్ట్స్‌) నాశనం చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ కేసు అప్పీల్‌ విచారణ హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు నాశనం చేయడమేమిటని ప్రశ్నించింది. సాక్ష్యాల నాశనం వెనుక న్యాయశాఖ, కార్యనిర్వహణశాఖ, హైకోర్టు అధికారులు ఎవరున్నారో తేల్చాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్జీ)ని ఆదేశించింది.

న్యాయవ్యవస్థపై విశ్వాసం పోతుందని వాఖ్య: ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పోతుందని వ్యాఖ్యానించింది. ఆ విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకే విచారణకు ఆదేశిస్తున్నామని పేర్కొంది. ఆయేషావిూరా హత్య కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నుంచి తొలగించి సీబీఐకి ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్తో కూడిన ధర్మాసనం అప్పగించింది.

ఖమ్మం కోర్టు రికార్డులూ…: అయేషా హత్యకేసులో ప్రత్యేక విచారణ అధికారి, ప్రస్తుతం నల్గొండ ఎస్పీగా పనిచేస్తున్న ఏ.వి. రంగనాథ్‌ ఖమ్మంలో పనిచేశారు. ఆ సమయంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కోర్టు రికార్డులు ట్యాపరింగ్‌, పిర్యాదు కన్నా ముందే ఎఫ్‌ఐఆర్‌ లాంటి సంఘటనలు వెలుగుచూశాయి. న్యాయ నివేదిక ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ వద్ద ఉంది.

ఈ నివేదిక గల్లంతు.?: అనేక ఆరోపణల నేపథ్యంలో రంగనాథ్‌ పై శాఖాపరమైన దర్యాప్తు జరిగింది. ఐజి నవీన్‌ చంద్‌ ఆధారాలతో కూడిన 94 పేజీల నివేదిక ప్రభుత్వానికి పంపారు. ఇప్పుడు ఆ నివేదిక కన పడటం లేదని అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.

మరో కేసులో స్వేచ్ఛ: ఎస్పీ రంగనాథ్‌ తనను అక్రమంగా నిర్భందించారని, అంతే కాకుండా పలు కేసులలో ఆయన చేసిన విషయాలను ఆధారాలతో సహా ఓ బాధితుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో పిటీషనరు వ్యక్తిగతంగా కేసు వేసుకునే స్వేచ్ఛ హైకోర్టు ఇచ్చింది. త్వరలో ఈ కేసు తీర్పు ఆధారంగా సిబిఐ దర్యాప్తు కోరనున్నట్లు బాధితులు తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close