Featuredస్టేట్ న్యూస్

ఐ క్యూ అంతర్జాతీయ పాఠశాలలో

బోగస్‌ బదిలీ సర్టిఫికెట్‌లు

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న పాఠశాల

పిల్లలందరికీ విద్యనందించడం సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం అభివద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. తల్లిదండ్రుల కోరికలను అవకాశంగా మార్చుకొని విద్యార్థి తల్లిదండ్రులకు మోసం చేస్తున్న ప్రైవేట్‌ పాఠశాల యజమాన్యాలు.జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యాలతో మిలాఖత్‌ అయి, నియమ నిబంధనలకు విరుద్ధంగా, సేవా దక్పథంతో నడపవలసిన పాఠశాలను వ్యాపార దక్పథంతో కొనసాగిస్తూ, ప్రజల నుండి డబ్బులు లూటీ చేస్తున్న, బోగస్‌ బదిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నా విద్యాశాఖ అధికారులు కాసులకు కక్కుర్తిపడి విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా లక్షల రూపాయలు డొనేషన్‌ రూపంలో వసూలు చేస్తున్న, ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలు, లక్షల రూపాయల డొనేషన్‌ లు, ఫీజులు వసూలు చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు.

  • పట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారులు
  • విద్యాహక్కు చట్టానికి తూట్లు
  • నవంబర్‌లోనే అడ్మిషన్స్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): మిరసబ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఐ క్యూ ఇంటర్నేషనల్‌ పాఠశాల 8,9 తరగతుల కొనసాగించడానికి ఎలాంటి అనుమతులు లేకుండా అదనంగా పై తరగతులను కొనసాగిస్తూ బోగస్‌ బదిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. సికింద్రాబాద్లోని వారసిగూడ లోని ఐ క్యూ అంతర్జాతీయ పాఠశాలకు హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ (ఙఱసవ = జ.చీశీ.15928/ూజు/ూుూ/2015 స్‌ 30-10-2015డ 1094/ూజు/జుు= 2015) కార్యాలయం నుండి 1 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు జీవో ఎంఎస్‌ నెంబర్‌ 1 ప్రకారము అనుమతులు తీసుకుని పాఠశాలను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు కేవలం 1 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ కొంతకాలం నుండి పాఠశాల యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా ఎనిమిదవ ,తొమ్మిదవ తరగతులను నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయం స్థానిక మండల విద్యాశాఖ అధికారికి, జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఉన్నా పాఠశాల యాజమాన్యంతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని అనుమతుల్లేని తరగతులను కొనసాగిస్తున్న విద్యాశాఖ అధికారులు ప్రేక్షక పాత్రలో ఉండడం శోచనీయం. ముస్తఫా ఆఫన్‌ కొడుకు ఐ క్యూ అంతర్జాతీయ పాఠశాలలో 2018 – 19 విద్యా సంవత్సరంలో ఎనిమిదవ తరగతి పూర్తి చేయడం జరిగింది.

పాఠశాలలో విద్యా ప్రమాణాలు తగ్గడంతో మరో పాఠశాలకు నాణ్యమైన విద్యను కొడుకు అందించాలన్న ఉద్దేశంతో 2019 – 20 సంవత్సరానికి కాకతీయ పాఠశాలలులో తొమ్మిదో తరగతిలో ప్రవేశం కొరకు సంప్రదించగా వారు గత విద్యా సంవత్సరం ఎనిమిదవ తరగతి పూర్తిచేసిన ఐ క్యూ అంతర్జాతీయ పాఠశాల నుండి బదిలీ సర్టిఫికెట్‌ సమర్పించ వలసిందిగా ముస్తఫా ఆఫాన్‌ ను కోరడం జరిగింది. ముస్తఫా ఆఫన్‌ ఐ క్యూ అంతర్జాతీయ పాఠశాలకు తేదీ 7 .5 .2019 రోజుల బదిలీ సర్టిఫికెట్‌ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది .13 రోజుల అనంతరం పాఠశాల కరస్పాండెంట్‌ బదిలీ సర్టిఫికెట్‌ ను ఇవ్వడం జరిగింది.బదిలీ సర్టిఫికెట్‌ ను ముస్తఫా ఆఫన్‌ తొమ్మిదవ తరగతిలో కొడుకు అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తి చేయడానికి కాకతీయ పాఠశాలలో ఐ క్యూ ఇంటర్నేషనల్‌ పాఠశాల జారీచేసిన బదిలీ సర్టిఫికెట్‌ దాఖలు చేయగా, కాకతీయ పాఠశాల వారు ఐ క్యూ అంతర్జాతీయ పాఠశాల కు జిల్లా విద్యాశాఖ నుండి కేవలం ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకే అనుమతులు ఉన్నాయి. మీరు మాకు దాఖలు చేసిన బదిలీ సర్టిఫికెట్‌ బోగస్‌, మీ అబ్బాయికి అడ్మిషన్‌ ఇవ్వలేమని ముస్తఫా కు తెలపడంతో, ఆశ్చర్యపోయిన ముస్తఫా వెంటనే మండల ఉప విద్యాశాఖ , జిల్లా విద్యాశాఖ అధికారులకు, సంబంధిత పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుపై స్పందించకపోవడంతో సికింద్రాబాద్‌ లోని పదవ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ ఐ ఆర్‌ నెంబర్‌ 660, ఐపీసీ 415, 418, 420 తీ/ష 34 సెక్షన్‌ల ప్రకారం పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయడం జరిగింది. ఐక్యూ ఇంటర్నేషనల్‌ పాఠశాల కొంతకాలంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల కొనసాగిస్తూ విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలిగిస్తూ, చట్ట వ్యతిరేకంగా బోగస్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న విషయం పై న్యాయవాది డి. ఎల్‌ . నరసింహారావు తేదీ 16 . 12. 2019 వ తేదీన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట నరసమ్మ కు వారసిగూడ లోని ఐ క్యూ ఇంటర్నేషనల్‌ పాఠశాల పై నమోదైన కేసు, వారు చేస్తున్న నిర్వాకం, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై సమాచారం ఇచ్చినా జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాల పై చర్యలు చేపట్టకుండా, పాఠశాల యాజమాన్యం తో స్వార్థ ప్రయోజనాల కోసం కుమ్మక్కయ్యారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లా విద్యాశాఖ అధికారి పై, సంబంధిత పాఠశాల పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు.ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రతినిధి విద్యాశాఖ అధికారులకు ఐ క్యు పాఠశాల విషయంపై వివరణ కోరగా స్పందించని అధికారులు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close