Featured

మన్యంలో… ‘తుపాకీ తూటాల’ సంబరాలు

పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం

‘మహా’లో ఇద్దరి ఎన్‌ కౌంటర్‌

మా భవిష్యత్‌ ఏమిటి: గిరిపుత్రుల నిలదీత

‘నల్లమల’లో కెమెరాలు ఎవరికోసం..?

అది నిషేధిత మావోయిస్టు పార్టీ. వారి ఆధ్వర్యంలోని ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్‌జీఏ) 18వ వారోత్సవాలు ఆదివారం అర్థరాత్రి ఘనంగా ప్రారంభం అయ్యా యి. మావోయిస్టులు వారోత్సవాలకు ‘మవో’ ప్రభావిత అటవీ పాంతాల్లో గత 48 గంటల ముందు నుంచే ఆ,యా సంఘ సభ్యులు ఏడు అంచెల భద్రత మధ్య ఏర్పాట్లు చేసుకున్నారు. మరో పది గంటలపాటు ఇవి జరగనున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ఏఓబీలో పోలీసు బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మన్యం ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్న వారిని మైదాన ప్రాంతానికి వెళ్లిపోవాలని పోలీసులు ఇప్పటికే సూచించడంతో ప్రజాప్రతినిధులు ‘సేఫ్‌’. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో గస్తీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘మావో’ ప్రభావిత అటవీప్రాంతంలో.. ఇద్దరూ తామే ‘కరెక్ట్‌’ అనుకుంటూ… ‘పోలీసు, మవో’ల ప్రాణాలకు తెగించి… మాటలు లేకుండా.. తూటాలు పేల్చుకునే ‘రక్తపు వనం’

నుంచి అత్యంత సహసోపేతంగా… దేశ భవిష్యత్తును, పౌరుల శ్రేయస్సును ద ష్టిలో ఉంచుకొని ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ బ ందం ‘ఫోర్త్‌ ఎస్టేట్‌’ తరఫున బరిలోకి దిగి అందిస్తున్న ‘సంచలన పరిశోధన కథనం’ మీకోసం ప్రత్యేకం.

‘గిరి’కి కాఫీ ఎర: క్యాడర్‌ ను పెంచుకోవలనే సరికొత్త ఎత్తుగడలతో పాటు, స్థానిక రాష్ట్ర సమస్యలను, అటవిలోని కాఫీ తోటలను పంచాలనే నినాదాన్ని గిరిజనుల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న వ్యూహంతో మావోయిస్టులు పీఎల్‌జీఏ 18వ వారోత్సవాలను చేపట్టింది. వీటిని జయప్రదం చేయాలని కోరుతూ పలుచోట్ల కరపత్రాలు, బ్యానర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒరిస్సా, చత్తీస్‌ ఘడ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమగోదావరి, విశాఖ మన్యం, తెలంగాణలోని భద్రాచలం, తెలుగు రాష్ట్రాలలోని నల్లమల అటవీ ప్రాంతాలలో ఈ ఉత్సవాలను పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు.

మా భవిత ఏమిటి ఆంటూ పోస్టర్లు: తూర్పుగోదావరి జిల్లా, ఎటపాక మండలంలోని లక్ష్మీపురం, మాధవరావు పేట గ్రామాల శివారులో అర్థరాత్రి మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘గిరిజన యువశక్తి’ ఆధ్వర్యంలో వెలిసిన ఈ పోస్టర్లపై ”మావోయిస్టుల వల్ల మా జీవితాల్లో ఆనందం కరవైందని, పండగలు చేసుకోలేకపోతున్నాం” అని పేర్కొన్నారు. బలవంతంగా తమ పిల్లలను దళంలో చేర్చుకోవడంతో వారి భవిష్యత్తు అంధకారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టులారా మా భవిష్యత్తు ఏమిటి? ‘జైలా, పేదరికమా..’ అంటూ ఆ పోస్టర్లలో ప్రశ్నించారు.

‘నిఘా’ అంచనా తప్పింది: ఇటీవల కొండజర్త, పేములగొంది అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల ఘటనకు నిరసనగా మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశాయి. అయితే మవోల వ్యూహాత్మకంగా ఇంటిలిజెన్స్‌ వ్యవస్థను తప్పు పెట్టించినట్లు తెలిసింది.

‘మావో’ అంచనా తప్పింది: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ఇద్దరు మావోయిస్టులు మ తి చెందారు. అబూజ్‌ మడ్‌ అటవీ ప్రాంతం భామ్రాగఢ్‌ లోని ఛత్తీస్‌ గఢ్‌ మహారాష్ట్ర సరిహద్దుల్లో శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టు వారోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీస్‌ కమాండోలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు.

కొసమెరుపు: అందుకే..శుక్రవారం ఐటెం లేదు. – కేంద్రానికి ఇంటిలిజెన్స్‌ సమాచారం

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close