Featuredస్టేట్ న్యూస్

మూసి రివర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌లో అధికారుల బొజ్జలు పెంచుతున్న ప్రభుత్వం

  • 2017వ సంవత్సరంలో మూసి రివర్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు
  • 1665.30 కోట్ల రూపాయలను మూసి సుందరీకరణ కోసం కేటాయించిన ప్రభుత్వం
  • నిధులు కేటాయించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా చిల్లిగవ్వ నైనా చెల్లించని వైనం
  • పనీపాటాలేకుండా బొజ్జలు పెంచుతున్న అధికారులు, ప్రైవేటు పనులు చేస్తూ కోట్లకేదుగుతున్నట్లు ఆరోపణలు

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): చారిత్రాత్మక నగ రాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ కోసం 2017 వ సంవత్సరంలో 1665.30కోట్ల రూపాయల పరిపా లన అను మతులను మంజూరు చేసినా, నేటి వరకు చిల్లి గవ్వను కూడా కేటాయించక పోవ డంతో కబ్జాల సుడిగుండంలో మూసి పరివాహ ప్రాంతం విల విల్లాడుతుంది. అనంతగిరి కొండల నుండి ప్రారం భమయ్యే మూసి కాలువ నగరం గుండా ప్రయా ణిస్తూ ఉస్మాన్‌ సాగర్‌ నుండి గౌరవెల్లి వరకు 57.7 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. హైదరాబాద్‌ నగ రంలో తరచు సంభవించే వరదలను కంట్రోల్‌ చేయ డానికి 1912వ సంవత్సరంలో ఏడవ నిజాం నవాబు మూసీ నది నిర్మాణానికి శ్రీకారం చుట్టి ,1920 సంవత్సరంలో ఉస్మాన్‌ సాగర్‌, 1927వ సంవత్సరంలో హిమాయత్‌ సాగర్‌ ను నిర్మించి జంట నగరాల ప్రజల త్రాగునీరు అవసరాలను తీర్చడానికి ప్రయత్నించారు. దశాబ్దాల పాటు నగర ప్రజల అవసరాలు తీర్చిన మూసీ నది నేడు కబ్జాలకు కేంద్రంగా, కాలుష్యానికి చిరునా మాగా మారింది. మూసీనది లో అక్రమ నిర్మాణాలు వందలాదిగా వెలుస్తున్నా ,వాటికి అనుమతులను మంజూరు చేసి పౌర సదుపాయాలు కల్పిస్తూన్న లంచగొండి అధికారులపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో కబ్జాల మహమ్మారి డెంగ్యూ వ్యాధి కంటే ప్రమాదకరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రగల్బాలు పోయి మూసి సుందరీకరణ లో భాగంగా నదికి ఇరువైపులా సైక్లింగ్‌ ట్రాక్‌, నడకదారి ని అందమైన ఉద్యానవనాలు,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నగర ప్రజలకు అందజే స్తానని ప్రకటించి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు ఒకటంటే ఒక్క కబ్జా నైనా కదిలిం చలేకపోవడం విడ్డూరం. 1665 కోట్లతో మూసి సుందరీకరణ చేపట్టి నగర రూపురేఖలు మారు స్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రకటించి ఆచరణలోకి తేవడంలో భాగంగా ప్రత్యేకంగా మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్మెంట్‌ కార్పొ రేషన్‌ను ఏర్పాటు చేసి ఉన్నత స్థాయి అధికారిని ఎండీగా నియమించింది. మూసి పరివాహక ప్రాంతాల లోనూ కబ్జాలను తొలగించి నగరానికి నగిషీలు చెక్కేందుకు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని సైతం నియమించి వారికి సకల సౌకర్యాలు కల్పిం చడం అభినందించదగ్గ విషయం.

కానీ వారికి ఇంత వరకు చిల్లిగవ్వ చెల్లించకుండా పనులను కేటాయిం చకుండా ఊరికే కూర్చోబెట్టి ప్రజల సొమ్మును వేతనాలు చెల్లించడం ఎంతవరకు సభబన్నప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా అవతరించింది అని పలు సందర్భాల్లో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2017 సంవత్సరంలో మూసి అభివద్ధి కోసం మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో ప్రత్యేక విభాగాన్ని కేటాయించి సిబ్బందిని నియమించి వేతనాలు చెల్లిస్తూ వారికి నయాపైసా పని అప్పగిం చకుండా వారి బొజ్జలు పెంచడం సబబేనా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది . కాగా గత రెండున్నర సంవత్సరాలుగా  ప్రైవేట్‌ సర్వే పనులను చేస్తూ మూసి రివర్‌ ఫ్రంట్‌ అధికారులు కోట్లకు ఎదుగు తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగర జీవనంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మూసీనది  కబ్జాదారులు, కాలుష్యం కోరల్లో బందీగా  మారిందని ఇకనైనా ప్రభుత్వం మూసీ పట్ల నిర్లక్ష్యం వీడి వెంటనే నిధులు కేటాయించి నగర జీవనానికి సజీవ సాక్ష్యంగా తీర్చిదిద్దాలని నగర ప్రజలు కోరుతున్నారు.
Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close