Featuredక్రైమ్ న్యూస్

అయేషా హత్యకేసులో… సిబి’ఐ’

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఎట్టకేలకు దర్యాప్తు సరైన మార్గం పట్టింది. పరిశోధన కోణంలో సిబిఐ తన సత్తా చూపుతోంది. స్థానిక పోలీసులు ‘సత్యం’ హంతుకుడని నిరూపించాల్సిన దంతా నిరూపించారు. కోర్టు శిక్ష విధించింది. హైకోర్టులో సత్యం నిరపరాథి అంటూ చెప్పింది. అసలు నిందితులను పట్టుకోవడం కోసం సిట్‌ ఏర్పాటు చేసింది. ఇంతలో అయేషా కేసులో కీలకంగా మారిన సాక్ష్యాలు గల్లంతు.. కావడం.. సిట్‌ చేతులెత్తేయడం జరిగిపోయింది. కేసు సిబిఐకి చేరింది. అనంతరం తొలి ఎఫ్‌ఐఆర్‌ తో ఈ కేసు పునాదులు కదలడం మొదలైంది. నాలుగు వైపుల నుంచి ఊహించని విధంగా కేసు దర్యాప్తు సాగుతోంది.

అసలేం జరిగింది..: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా విూరా హత్యకేసుకు సంబంధించి కుట్రకోణాలను సీబీఐ త్వరలోనే బట్ట బయలు చేయనున్నది. 2007 డిసెంబర్‌ 26 న అయేషా విూరాను ఎవరో గుర్తు తెలియని దుండగు డు రేప్‌ చేసి కిరాతకరంగా చంపేశాడు. ఎప్పటినుంచో చిక్కు వీడని ఈ కేసులో ఎన్నో అనుమానాలు. మంత్రి మనవడే రేప్‌ చేశాడని చంపాడని.. అన్యాయంగా అమయాకుడైన సత్యం బాబును కొన్ని సంవత్సరాలు జైలు పాలు చేశారని.. స్వయంగా అయేషా విూరా తల్లిదండ్రులే ఆరోపించారు. చిల్లర దొంగ సత్యంబాబును సాక్షాలు లేకున్నా పోలీసులు ఈ కేసులో ఇరికించారని 2017లో హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది.

సిబిఐ సవాళ్లు: పదేళ్ల క్రితం కనుమరుగైన సాక్ష్యాలను ఈ సిబిఐ ఎలా వెలుగులోకి తీస్తుంది.? అసలు దర్యాప్తులో క్లూలేని ఈ కేసులో..

సిట్‌ చేతులెత్తేసిన కేసులో సిబిఐ ఎలా ముందుకు వెళ్తారనే ప్రశ్న అందరిలోనూ వచ్చింది. ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేసినా సాక్ష్యాలు దొరకవని.. ఆ నాటి ప్రభుత్వ పెద్దలు మంత్రి మనవడిని కాపాడడానికి ఎక్కడా సాక్ష్యాలు లేకుండా జాగ్రత్త పడ్డారనే విమర్శలున్నాయి. ఆయేషా తల్లి షంషాద్‌ బేగం సంచలనాత్మక విషయాలు చెప్పారు.

నోరు విప్పకుంటే… విప్పిస్తారు..: హాస్టల్‌ వార్డెన్‌ కోనేరు పద్మ నోరు తెరిస్తే నిమిషాల్లో నిజాలు బయటకు వస్తాయని అయేషా తల్లి సిబిఐ అధికారులకు తేల్చి చెప్పారు. కోనేరు పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్‌ విద్యార్థినీ, విద్యార్థులు సౌమ్య, ప్రీతి, కవిత, కోనేరు సురేశ్‌, కోనేరు సతీష్‌, అబ్బూరి గణేశ్‌, చింతా పవన్‌ కుమార్‌ లను విచారిస్తే అంతా బయటకు వస్తుందని ఆమె చెప్పారు.

కుట్ర కోణం: కుట్రపూరితంగానే అయేషా విూరా హత్య కేసుకు సంబంధించి కీలక ఆధారాలను నాశనం చేసినట్లు గుర్తిం చింది. హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీబీఐ కేసు విచారణలో వేగం పెంచింది. తొలిరోజే ముగ్గురు కోర్టు సిబ్బం దిపై కేసు నమోదు చేసింది. అయితే కేసు విచారణలో భాగం గా సాక్ష్యాలు ధ్వంసంపై సిబిఐ ప్రత్యేక దృష్టిసారించింది. విచారణలో సేకరించిన వివరాలతో సీబీఐ అధికారలు నివ్వెర పోయారు. ఆయేషా అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి కీలక ఆధారాలను కుట్రపూరితంగానే నాశనం చేసినట్లు సీబీఐ గుర్తించింది. హైకోర్టులో అయేషా విూరా కేసు పెండింగ్‌ లో ఉందన్న విషయాన్ని దాచి ఉంచిన ఉద్యోగులు జడ్జి ముందు ఆ ప్రస్థావన తీసుకు రానట్లు గ్రహించింది. ఏదైనా కేసుకు సంబంధించి సాక్ష్యాలు ధ్వంసం చేసేముందు కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. నాన్‌ వాల్యూబుల్స్‌ ధ్వంసం చేసే ముందు అప్పీలు సంగతి జడ్జికి వివరించాల్సిన అవసరం కోర్టు సిబ్బందికి ఉంటుంది. ఈ వ్యవహారాలన్నింటిని చక్కదిద్దాల్సిందే న్యాయస్థానం క్లర్క్‌. ఈ నేపథ్యంలో కోర్టు క్లర్క్‌ టి.కుమారిని ప్రధాన నిందితురాలిగా చేరుస్తున్నట్లు సీబీఐఅధికారులు కోర్టుకు తెలిపారు. 2014లో ఈ కేసులో సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు మెజిస్ట్రేట్‌ ముందుకు అప్పటి క్లర్క్‌ పి. వెంకట కుమార్‌ ఫైల్‌ పెట్టారు. కోర్టులో తనిఖీలు ఉన్న నేపథ్యంలో అనుమతి కోరితే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అయేషా విూరా హత్య కేసు పెండింగ్‌ లో ఉందన్న విషయం ప్రాపర్టీ క్లర్క్‌ ఎక్కడా ప్రస్తావించలేదని సీబీఐ విచారణలో తేలింది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు కోర్టు ఉద్యోగులపై కేసు నమోదు చేసింది సీబీఐ.

కాల్‌ లిస్ట్‌లో దిగ్భ్రాంతి: సిబిఐ విచారణ కోణంలో నాడు విచారణ చేసిన అధికారుల వివరాలు, వారి పూర్వస్థితి, గతంలో రికార్డులు గల్లంతు చేసిన సంఘటనలు, వారిపై వచ్చిన ఫిర్యాదులు, కేసుల వివరాలు సిబిఐ రికార్డుల పరంగా తవ్వి తీస్తోంది. ఇందులో ఎవరిని కాపాడటానికి ఎవరికి ఏ కోణంలో ఎంత ముట్టింది. ఎలా కేసును తప్పు దారి పట్టిం చారనే విషయాలను సమగ్రమైన దర్యాప్తు సిబిఐ అధికారులు చేస్తున్నారు. సాక్ష్యాలు నాశనం చేయడం, తప్పుడు కేసులు పెట్టడం ఎవరి హయంలో ఎలా జరిగాయనే కోణంలో మరికొ న్ని దిగ్భ్రాంతి కరమైన విషయాలు వెల్లడయ్యే అవకాశాలు న్నాయి. ఓ పోలీసు అధికారి పాత్ర గురించి ఇద్దరు కీలక వ్యక్తుల (వారి ప్రాణ రక్షణ దృష్టిలో ఉంచుకొని పేర్లు ‘ఆదాబ్‌’ వెల్లడించడం లేదు.) నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ అధికారి ఏవిధంగా..? ఎవరిని..? ఎలా..? మేనేజ్‌ చేస్తారు..? సంఘటన జరిగినప్పుడు ఎలా హడావుడి చేస్తారు..? ఎలా నిందితులను తప్పిస్తాడు..? తీరా ఆయన దగ్గరకు వచ్చే సరికి ఎలా కిందస్థాయి ఉద్యోగులను బలి పశువులుగా మారుస్తారనే విషయాలను వారు రికార్డుల రూపంలో అందించారు. ఓ కేసు లో ఢిల్లీలో ఎలా మేనేజ్‌ చేశాడు. ఖమ్మంలో, గోదావర, నల్గొం డ జిల్లాలో జరిగిన సంఘటనలు ఉదాహరణగా చూపారు.

యాదృచ్చికం: 2018లో సిబిఐలో మొత్తం 738 కేసులు నమో దయ్యాయి. ఇందులో తొలికేసు ముంబైలో 2003లో ఓ హత్య ను ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులు మూసి వేశారు. హైకో ర్టు ఉత్తర్వులతో ఆ కేసు( ఎఫ్‌ఐఆర్‌ నెం: బి.ఎస్‌.1 /2018/ఎస్‌/0001, ఆర్‌.సి1. సిఎస్‌) కదలిక వచ్చింది. అసలు దొంగలు దొరికారు. అలాగే 2018లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలతో సిబిఐలో నమోదైన కేసు అయేషా హత్య కేసు ళి ఎఫ్‌ఐఆర్‌ నెం: ఆర్‌.సి. 13(ఎ) 2018రిలో ఇప్పుడు కదలిక వచ్చింది. సిబిఐలో నమోదైన తొలి, తుది కేసులు అనేక మలుపులు తిరిగి సిబి’ఐ’ కి వచ్చి చేరాయి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close