నేను కేటీఆర్‌.. నా వత్తి వ్యవసాయం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా మంత్రి కేటీఆర్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన స్థిర, చరాస్తుల వివరాలను వెల్లడించారు. అఫిడవిట్‌లో తనకు రూ.1.30కోట్ల స్థిరాస్తులు, రూ.3.63 కోట్ల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం రూ.33.28 లక్షలు అప్పు ఉందని, తన వ త్తి వ్యవసాయమని పేర్కొన్నారు. తనపై మొత్తం 16 కేసులు ఉన్నాయని తెలిపారు. తన భార్య పేరు మీద రూ.8.98 కోట్ల స్థిరాస్తి ఉందని, రూ.27.70 కోట్ల చరాస్తులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆమె పేరు మీద రూ.27.39 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. తన చేతిలో ఉన్న మొత్తాన్ని రూ.1,42,594గా పేర్కొనగా.. తన సతీమణి చేతిలో రూ.1,08,231 నగదు ఉన్నట్లు తెలిపారు. తనకు ఇన్నోవా కారు ఉందని అఫిడవిట్‌లో మంత్రి పేర్కొన్నారు. కేకే గొడవ స్థానిక మున్సిపల్‌ ఛైర్మన్‌ పావనితో కలిసి వచ్చిన కేటీఆర్‌ రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌కు నామపత్రాలను అందజేశారు. అదే సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి నామపత్రాలను దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి తమను పంపడంలో వివక్ష చూపుతున్నారంటూ కాంగ్రెస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. కేటీఆర్‌తో 60 మందిని లోపలికి పంపుతున్నారని, తమను మాత్రం కేవలం పది మందిని మాత్రమే అనుమతించారంటూ నిరసన తెలిపారు. పోలీసులకు, కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here