రూ. 7 కోట్ల పార్కు స్థలం కబ్జా

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రభుత్వ భూమి అయినా ప్రైవేటు భూమి అయినా.. తహసిల్దారైనా, కలెక్టరైనా భూ కబ్జాకు అడ్డు రారెవరూ… ఏదైతేనేం భూమి ఉంటే చాలూ ఏ అధికారి ఏమి చేయయలేడంతే.. భూ కబ్జా దారుల భూ బాగోతాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. స్మశాన వాటికలు, దేవుడి మాన్యాలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కబ్జా చేయని స్థలాలంటూ ఉండడవేమో. అయితే వీరికితోడు అధికారులు ఉండడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అయితే సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలోని నరంద్రనగర్‌ కాలనీలో ఏకంగా రూ. 7 కోట్ల విలువైన పార్కు స్థలాన్నే కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ విషయాన్ని కాలనీ వాసులంతా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ కమిషనర్‌, తహసిల్దార్‌లకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికి ఎలాంటి స్పంధన లేకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కాగా నరేంద్ర నగర్‌ కాలనీలో లేఅవుట్‌ పార్క్‌ స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించి ఆక్రమించు కోవడం చాలా సంవత్సరాలుగా జరుగుతున్నదని కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. అట్టి భూ సమస్య అదికారులు మద్య చక్కర్లు కొడుతున్న సంగతి అందరికి తెలిసినదేనని అధికారులు మాత్రం కబ్జాదారుల కొమ్ము కాస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇట్టి స్థలంలో అక్రమ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. పార్కు స్థలాలను అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్నా, ప్రత్యక్షంగా స్థలాల ఆక్రమణలు చేస్తున్నా అథికారులు చూస్తూ ఊరుకుంటున్నారు. అయితే పార్కు స్థలాలను రక్షించుకోవటానికి అన్ని ప్రభుత్వ శాఖలకు అధికారాలు ఉన్నా అధికారులు మాత్రం వదిలేసి ఆ నేరం భూమి రిజిస్ట్రేషన్‌ శాఖ పై నెట్టేసి మౌనం వహిస్తున్నారు. పార్కు స్థలాన్ని కాపాడాలంటూ 2017 డిసెంబర్‌ 11న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే 2018 ఆగస్టులో తహసిల్దార్‌కు ఫిర్యాదు చేయగా ఆయన 2019 జనవరిలో సర్వేనంబర్‌ 1125, 64,85,93లు రికార్డు పరంగా లేవని తహసిల్దార్‌ నిర్దారించారు. కాగా భూ కాబ్జా చేసి యదేశ్చగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదు. ఇందులో బాగంగానే నరేంద్రనగర్‌ కాలనీలో గత నాలుగు రోజులుగా 1128 సర్వే నంబరులో భూ ఆక్రమన చేసి ముగ్గు పోయడం, జె.సి.బితో నేల చదును చేయించటం, గోడ కట్టించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆక్రమనలయితే తప్పక చర్య తీసి కుంటామని చెప్పే అథికారులు ,ఇప్పటికైనా స్పందించరా.. కాలనీ వాసులు మొత్తుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు భూములు రక్షించటానికి సమానం బాథ్యత ఉన్నప్పటికి కలెక్టర్‌ కూడా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు తక్షణమే అక్రమ నిర్మాణాలను నిలిపివేయించి భూబకాసురుల ఆగడాలకు కళ్ళెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాగా ఫోటోలో కనిపిస్తున్న భూమి 1128 సర్వే నంబరులోదని, నరేంద్ర నగర్‌ కాలనీ లేఅవుట్‌లో పార్కు స్థలమని, దీనిని 1996లో గ్రామ పంచాయతీ ఆమోదించిందని, ఇందులోనే పడమటి ప్రక్కన గుండు వాని చెరువు కూడా ఉన్నదని కాలనీ వాసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here