Featuredస్టేట్ న్యూస్

అక్రమ కట్టడాలు.. నకిలీ డాక్యుమెంట్లు

కాప్రా (ఆదాబ్‌ హైదరాబాద్‌) :

కాప్రా పరిధి ప్రథమపురి కాలనీ సర్వే నెం.562 అండ్‌ 588 పార్ట్‌లో గల 300 గజముల జాగ నకిలీ పరిమిషన్‌, నకిలీ డాక్యుమెంట్లతో మున్సిపల్‌ ఖజానకు గండికొట్టిన పట్టించుకొని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు. ఫ్లాట్‌ నెం.52-ఏ అను ఇంటికి గతంలో బ్యాంకు ఎంప్లాయి అయినువంటి నర్సింగ్‌ రావు అనే ఉద్యోగి బ్యాంకు ఎంప్లాయి అయినప్పటికి నకిలీ మున్సిపల్‌ పరిమిషన్‌ డాక్యుమెంట్లు సృష్టించారు ఆ పరిమిషన్‌ కాఫీ సంవత్సరము మున్సిపాలిటిలో 1200 నుండి 1600 వరకు నెంబర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది వీరు మాత్రం తయారు చేసిన నకిలీ డాక్యుమెంటు నెం. 2000 పై నంబరు చూపించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 300 గజములలోంచి 150 గజములలో 850 యస్‌.యఫ్‌.టి.లో ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. ఆ తరువాత వచ్చి బి.ఆర్‌. స్కిమ్‌లో దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది పరిమిషన్‌ నెంబర్‌ రికార్డులో లేనందున బి.ఆర్‌.యస్‌. దరఖాస్తును తిరస్కరించడం జరిగింది. ఆ తరువాత మున్సిపాల్‌ ఉద్యోగులు పట్టించుకోవడం జరుగలేదు ఆ నకిలీ డాక్యుమెంట్ల చందానగర్‌ ఆంధ్రబ్యాంకులో పెట్టి 5 నుండి 6 లక్షల వరకు లోన్‌ తీసుకున్నారు. ఆదే లోన్‌ రెండు మూడు సంవత్సరముల తరువాత ఆదే బ్యాంకులో16 లక్షలకు మార్చడం జరిగింది. నర్సింగ్‌ రావు లక్ష్మి అనే మహిళకు అమ్మడం జరిగింది. ఆ తరువాత లక్ష్మి డిఫేన్స్‌ కాలనీలోగల ఆంధ్రబ్యాంకులో 35 లక్షల రూపాయాలు లోన్‌ తీసుకొనే సమయంలో బ్యాంకు ఉద్యోగులు మున్సిపల్‌ పరిమిషన్‌ కాఫీలు నకిలీ డాక్యుమెంట్ల, ఓరిజినల్‌ డాక్యుమెంట్ల అని వెరిఫికేషన్‌ చేయడం జరుగలేదు. ఆ భవనమును గతంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సింగిల్‌ బెడ్‌ రూమ్‌తో ఉండేది ఇప్పుడు ఆదే భవనం గ్రౌండ్‌, ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌ ఒకొక్క ఫ్లోర్‌ 2100 యస్‌.యఫ్‌.టి.తో కట్టడం జరిగింది. ఆ తరువాత లక్ష్మి రత్నకుమారికి అమ్మడం జరిగింది ప్రస్తుతము రత్నకుమారి యాజమనిగ చెలమని అవుతున్న మున్సిపల్‌ ఖజానకు గండి కొట్టి మున్సిపల్‌ ఉద్యోగులకు భారీగ ముడుపులు ముట్టడం జరిగింది దానిని చూసి చూడనట్లు వదిలేశారు. ఇలాంటి భవనములు తెలిసిన ఒక భవనము ఇలా ఉంటే కాప్రా సర్కిల్‌ మొత్తంలో ఎన్ని భవనములు ఉంటాయి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇంకెన్ని భవనములు ఉంటాయో చెప్పడం ఎవరికి సాధ్యం కాదు మున్సిపల్‌ ఉద్యోగులు భవనముల డాక్యుమెంట్లు వెరిఫికేషన్‌ చేసినట్లయితే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు భారీగ నిధులు చేకురుతాయి. ఏ.సి.పి వివరణ: కాప్రా సర్కిల్‌ ఏ.సి.సి. వివరణ కొరగ తిరస్కరించడం జరిగింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close