భారత్‌ పాక్‌ యుద్దం వస్తే.. గెలుపు మనదే

0
  • ఊహించని ఆయుధ సంపద
  • సైనికబలం
  • మిస్సైల్స్‌ లో ముందంజ
  • అన్ని ఏర్పాట్లు పూర్తి

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

సరిహద్దుల్లో భారత్‌ పాక్‌ దళాలు మొహరించాయి. అక్కడ నిశ్శబ్ద యుద్దం రాజ్యమేలుతోంది. కార్గిల్‌ గుణపాఠంతో పాక్‌ తీరు మారలేదు కదా ముష్కరులకు కావల్సినంత ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తోంది. యుద్దం అంటూ వస్తే… భారత్‌ ముందు ఎదురొడ్డి నిలబడే పరిస్థితి కాదు గదా కనీసం కనుచూపు మేరలో కూడా పాకిస్థాన్‌ లేదు. ప్రతి భారతీయుడు గుండె విూద చేయి వేసుకొని త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ముద్దాడవచ్చు. ఆయుధ సంపత్తి విషయంలో అంతర్జాతీయ వేదికలపై నక్కజిత్తుల పాకిస్థాన్‌ చెపుతున్నవన్నీ ఆబద్దలేనని తేలిపోయింది. ఇరు దేశాల సైనిక, ఆయుధ సామర్థ్యం ఎంత? అనే ఆసక్తి నెలకొంది. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

స్టాక్‌ ¬ం ఇంటర్నెషనల్‌ పీస్‌ రీసెర్చి ఇన్స్టిట్యూట్‌, గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌ (జీఎఫ్పీ) ప్రకారం ప్రకారం ఇరు దేశాల బలాలను పోల్చి లెక్కల ప్రకారం భారతదేశం బలంగా ఉంది. జమ్ముకశ్మీర్‌ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

యుద్దం వస్తే..:

భారత్‌ పాక్‌ యుద్దం వస్తే భారతదేశం 126 రోజులపాటు ఏక బిగువున పోరాడే సత్తా ఉంది. అదే పాకిస్థాన్‌ కు మాత్రం చచ్చీ చెడీ 14 రోజులకే పాక్‌ భవిష్యత్తు చరిత్ర గర్భంలో కలసిపోతుంది. అదీ చైనా అంతర్గతంగా తోడ్పాటు అందిస్తేనే అన్నది గమనార్హం.

ఇదీ మన సత్తా..:

క్షిపణులు, అణ్వాయుధాలు, అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణి వ్యవస్థల సామర్థ్యం ఇరు దేశాలకు ఉంది. 5,000 కిలోవిూటర్లలోపు లక్ష్యాలను ఛేదించే అగ్ని-3తో కలిపి ఇటువంటి 9 రకాల క్షిపణి వ్యవస్థలు భారత్కు ఉన్నాయి.చైనా సాయంతో పాకిస్థాన్‌ క్షిపణులను తయారు చేసుకుంటోంది. భారత్లోని లక్ష్యాలను ఛేదించగలిగే మొబైల్‌ షార్ట్‌, విూడియం రేంజ్‌ ఆయుధాలు పాక్‌ వద్ద ఉన్నాయి. 2,750 కి.విూ లక్ష్యాన్ని ఛేదించగలిగే షహీన్‌ 3తో కలిపి మొత్తం 10 రకాల క్షిపణులు ఉన్నాయి.

స్టాక్‌ ¬ం ఇంటర్నెషనల్‌ పీస్‌ రీసెర్చి ఇన్స్టిట్యూట్‌ లెక్కల ప్రకారం పాక్‌ వద్ద సుమారు 140-150 న్యూక్లియర్‌ వార్హెడ్స్‌ ఉండగా, భారత్‌ వద్ద సుమారు 130-140 ఉన్నాయి. గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌ (జీఎఫ్పీ) ప్రకారం ప్రకారం ఇరు దేశాల బలాలను పోల్చి చూస్తే..

I మొత్తం 136 దేశాలను పోలుస్తూ జీఎఫ్పీ కేటాయించిన ర్యాంకుల్లో భారత్‌ 4వ స్థానంలో ఉండగా.. పాక్‌ 17వ స్థానంలో ఉంది.

I భారత జనాభా 128 కోట్లు కాగా పాక్ది 20 కోట్లు. వీరిలో దళాలకు అసవరమైన ఫిట్నెస్తో ఉన్న వారి సంఖ్య భారత్లో 48 కోట్లు ఉండగా పాక్లో 7.5 కోట్లు మాత్రమే ఉంది.

I భారత్‌ సైన్యం 13 లక్షలు కాగా పాక్‌ సైన్యం 6.3లక్షలు. ఇక రిజర్వు దళాలను చూస్తే భారత్కు 28 లక్షల మంది ఉండగా పాక్కు కేవలం 2 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే భారత్‌ వద్ద మొత్తం దళాల సంఖ్య 42లక్షలకు పైమాటే. ఇక పాక్వద్ద మొత్తం కలిపితే 9.19లక్షలు మాత్రమే.

I భారత రక్షణ బడ్జెట్‌ దాదాపు 4,700 కోట్ల డాలర్లు కాగా.. పాక్‌ రక్షణ బడ్జెట్‌ 700 కోట్ల డాలర్లు.

వైమానిక దళం..

మొత్తం విమానాల సంఖ్య:

భారత్‌: 2,185, పాక్‌: 1,281

ఫైటర్‌ జెట్లు(ఇంటర్‌ సెప్టర్లు):

భారత్‌: 590, పాక్‌: 320

దాడి చేసే విమానాలు:

భారత్‌ : 804, పాక్‌: 410

రవాణా విమానాలు:

భారత్‌ : 708, పాక్‌: 296

శిక్షణ విమానాలు:

భారత్‌ : 251, పాక్‌: 486

హెలికాప్టర్లు:

భారత్‌ : 720, పాక్‌: 328

దాడి చేసే హెలికాప్టర్లు:

భారత్‌ : 15, పాక్‌: 49

అందుబాటులో ఉన్న ఎయిర్పోర్టులు:

భారత్‌ : 346, పాక్‌: 151

ట్యాంకు బలగం:

భారత్‌ : 4,426, పాక్‌: 2,182

సాయుధ పోరాట వాహనాలు:

భారత్‌ : 3,147, పాక్‌: 2,604

సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ ఆర్టలరీ:

భారత్‌ : 190, పాక్‌: 307

శతఘ్నులు:

భారత్‌: 4,158, పాక్‌: 1,240

రాకెట్‌ ప్రొజెక్టర్లు:

భారత్‌: 266, పాక్‌: 144

నావికాదళం బలం: మొత్తంగా

భారత్‌: 295, పాక్‌: 197

విమాన వాహక నౌకలు

భారత్‌: 1, పాక్‌: 0

జలాంతర్గాములు:

భారత్‌: 16, పాక్‌: 5

ఫ్రిగేట్లు:

భారత్‌: 14, పాక్‌: 10

డెస్ట్రాయర్లు:

భారత్‌: 11, పాక్‌: 0

కొర్వెట్టిలు:

భారత్‌: 22, పాక్‌: 0

పోర్టల్‌ క్రాఫ్ట్‌:

భారత్‌: 139, పాక్‌: 11

ప్రధాన యుద్ధనౌకలు:

భారత్‌: 4, పాక్‌: 3

వాణిజ్యనౌకాబలగం:

భారత్‌: 1,674, పాక్‌: 52

ప్రధాన నౌకాశ్రయాలు:

భారత్‌: 7, పాక్‌: 2

చివరిగా..:

భారతదేశం ఆయుధ సంపత్తిలోనే కాదు యుద్దం అంటూ వస్తే వందశాతం సైనికులు మృత్యుదేవతను ముద్దాడడానికి సిద్దంగా ఉండగా.. పాకిస్థాన్‌ సైనికులలో కేవలం 13శాతం మంది మాత్రమే ఉన్నారు. మేరా భారత్‌ మహాన్‌. జైహింద్‌.

అంకితం: పుల్వామా ఉగ్రదాడిలో ఆసువులు బాసిన అమర వీరులకు ఈ కథనం అంకితం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here