Featuredరాజకీయ వార్తలు

టిఆర్‌ఎస్‌ వస్తే కాళేశ్వరం లేకుంటే శనేశ్వరం

వరంగల్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుక్షణం పరితపించే వ్యక్తి ఆరూరి రమేష్‌ అని వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షా 116 ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్నాం. కేసీఆర్‌ కిట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. వద్ధన్నపేటలో 38,440 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. కాళేశ్వరం పనులు 90శాతం పూర్తయ్యాయి. వానాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు వస్తాయి. కాళేశ్వరం కట్టొద్దంటున్న చంద్రబాబుతో కాంగ్రెసోళ్లు పొత్తు పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే కాళేశ్వరం నీళ్లు వస్తాయని.. కూటమి వస్తే శనేశ్వరం వస్తదని హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. కూటమిని తిప్పికొట్టాలని అన్నారు. అలాగే కెసిఆర్‌ను సిఎం చేసేందుకు టిఆర్‌ఎస్‌కు ఓటేయాలన్నారు. మహాకూటమికి ఓట్లు వేస్తే.. శనీశ్వరునికి వేసినట్లేనని మంత్రి తన్నీరు హరీష్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండల కేంద్రంలో తెరాస అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. డోర్నకల్‌కు చేరుకున్న హరీష్‌రావుకు తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యానాయక్‌తో పాటు తెరాస కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ మహాకూటమికి ఓట్లు వేస్తే శనీశ్వరునికి వేసినట్లే అన్నారు. శనీశ్వరుడు కావాలా లేక కాళేశ్వరం ప్రాజెక్టు కావాలా అని ప్రజలను అడిగారు. కాంగ్రెస్‌ పార్టీ వారు గెలిస్తే ఏసీ గదుల్లో ఉంటారని అదే తెరాస గెలిస్తే ప్రజల, రైతుల మధ్య ఉండి సేవ చేస్తారన్నారు. లోకల్‌ వ్యక్తికే ఓట్లు వేయాలని, నాన్‌లోకల్‌కు వేస్తే ప్రయోజనం ఉండదన్నారు. వృద్ధులకు రూ. 2016 పింఛన్‌ అందించనున్నట్లు చెప్పారు. డోర్నకల్‌ నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు తీసుకురాకపోతే మరోసారి ఓట్లు అడగమన్నారు. ఈ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యానాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, సత్యవతిరాథోడ్‌, కవితతో పాటు తెరాస నేతలు పాల్గొన్నారు. హరీష్‌రావు రాకకు ముందు సభా ప్రాంగణంలో కూర్చున్న ప్రజల మధ్యకు పాము రావడం కలకలం సృష్టించింది. కార్యక్రమానికి వచ్చిన వారంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు .ప్రస్తుతం అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌లో కేసీఆర్‌ గాలి వీస్తోందన్నారు. గ్రామ గ్రామనా టీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. ఈ బలాన్ని కాపాడుకోవాలి.

కారుకు ఓటేసి గెలిపించుకోవాలి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాలని కడియం పిలుపునిచ్చారు. హరీష్‌ రావుతో పాటు సభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్‌ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేకనే కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబుతో కలిసి వస్తోందన్నారు. ఆంధ్రా, తెలంగాణ మధ్య రేపు సాగునీటి పంచాయితీ వస్తే చంద్రబాబు ఎటువైపు ఉంటారో విూరే ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబు ఎప్పటికైనా ఆంధ్రా ప్రాంత హక్కులనే కాపాడుతారు. తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోరు. అలాంటి చంద్రబాబును భుజాల విూద మళ్లీ తెలంగాణకు తీసుకొస్తున్న కాంగ్రెస్‌ నేతలకు సిగ్గుందా? అని ధ్వజమెత్తారు. తెలంగాణ హక్కులు, ప్రయోజనాలు కాపాడేది టీ ఆర్‌ ఎస్‌ పార్టీనే అని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close