Featuredస్టేట్ న్యూస్

సరిదిద్దుకోకుంటే… రాజకీయ సమాధి

కేటీఆర్‌ కు ‘ఆదాబ్‌’ సూచన

? అందమైన గులాబీ ముళ్ళు

? ఏనాడైనా నిట్ట నిలువు చీలిక

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో దాష్టికాలు జరిగాయి. వాటి గురించి ప్రతిపక్షం నోరు మెదపదు. ‘మీడియా’ వ్యాపార యాజమాన్యాలకు అది కనపడదు. వినపడదు. న్యాయస్థానానికి వెళ్ళే ధైర్యం లేదు. పోలీసులు ఏం చేయలేరు. (సగం సమస్యలకు.. ‘రంగా’..వాళ్ళే కారణం.?) ప్రభుత్వ లోపాల గురించి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే అధికారం పౌరులు కోల్పోయారా..? మనది రాజకీయ ముసుగు వేసుకున్న ప్రజాస్వామ్యమేనా…? అవును ప్రజాస్వామ్యమే… ‘విమర్శిచంటం అంటే వ్యతిరేకించటం కాదు’. నిజాలను నిగ్గదీసి అడగటమే కాదు.ఎవ్వరికీ లొంగేది లేదు. బెదిరింపులకు భయపడేది లేదు. ఆ నిజాలను నిర్భయంగా భయటపెడుతున్నాం. జరిగిన తప్పులను సరిదిద్దుకోండి. ‘కల్వకుంట్ల’ కుటుంబం పేరుతోనూ.. వారి బంధువులమంటూ కొందరు… మిత్రులంటు మరికొందరు… మంత్రుల పి.ఎస్‌ పిఏల పేర్లతో ఇంకొందరూ…ఇలా ఎవరికి అందినంత వారు…చక్కగా… చక్కలిగింతల నడుమ వందల కోట్లు తరలిపోయాయి. అది ప్రజాధనం. ప్రజలు కట్టిన పన్నులు. అధికారం కట్టబెట్టింది ఈ దోపిడీ, దారుణాలకు కాదు. అదే కొనసాగితే మనుషులు భయపడతారేమో..! ప్రకృతి ప్రకోపం భయంకరంగా ఉంటుంది. అందుకే నాయకగణం మంచి భవిష్యత్తు కోసం ఓ మందలింపుగా.., ఓ విధంగా హెచ్చరికలా… ఈ పరిశోధన కథనాల ద్వారా ప్రశ్నిస్తున్నాం. లోపాలన్నీ సరిదిద్దుకోవాలి.

అధికారులు గాడి తప్పితే..: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, అధికారులు గాడి సరి చేయడానికే పత్రికలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తాజా సిఎం. జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ సిఎం. కేసీఆర్‌ (అన్నీ అనుకూలిస్తే నేటి యువరాజు, రేపటి ముఖ్యమంత్రి కేటీఆర్‌), సంబంధించిన అనేక పరిపాలన విషయాల గురించి అవలోకనం ఉంటుంది. జగన్‌ ఆస్థాన పత్రిక ‘సాక్షి’, తెలంగాణ గాంధీ ఆస్థాన పత్రిక ‘నమస్తే తెలంగాణ’ పత్రికలు సైతం ప్రస్తావించని అనేక పాజిటివ్‌ విషయాలను నిర్భయంగా ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ మాత్రమే గతంలో ముందుగా ప్రస్థావించింది. ఇకముందు ప్రస్థావిస్తుంది. లోపాలను సైతం అదే తీవ్రస్వరంతో ప్రశ్నించాం. అయితే జగన్‌ తాజా సిఎం. అందుకే ఆయన పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు అవుతుంది. ఇప్పుడు బంగారు తెలంగాణ గురించి మాత్రమే ఆలోచిద్దాం. ఆ కోణంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ తప్పు, ఒప్పులు జరిగాయి.? ఎలా జరిగాయి..? ఎవరు ఎందుకు చేశారు..? అందుకు కారణాలు ఏమిటి..? అనే విషయాలను సృషిస్తూ..అమరవీరుల త్యాగాల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం గతంలో చేసిన పొరపాట్లు ఏమిటి..? వాటిని సరిదిద్దుకుని మరో నాలుగేళ్లు ముందుకు సాగాలి.. అన్నీ అనుకూలిస్తే… ఉజ్వల భవిష్యత్తు ఉన్న కేటీఆర్‌… ఆయన తండ్రి కేసీఆర్‌. ముఖ్యమంత్రిగా ఈ పొరపాట్లు మరోసారి జరగనీయవద్దు. ‘నేటి నల్గొండ ఎస్పీ స్వయంగా అంగీకరించిన దాష్టీకాల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి’ వరకు అన్ని విషయాలను ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ విశ్లేషించి అందిస్తుంది. ”బంగారు తెలంగాణా..” లేదా బజారెక్కిన తెలంగాణ” అన్నది తేల్చుకోవల్సింది మన యువరాజు కల్వకుంట్ల తారక రామారావు మాత్రమే. మంచిని మంచిగా… చెడును చెడుగా.. ‘దాగుడుమూతలు’ లేకుండా రేపటి నుంచి వరుస అవలోకన కథనాలు మీ కోసం… ప్రత్యేకం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close