Featuredరాజకీయ వార్తలు

కోరితే టీఆర్‌ఎస్‌కు మద్దతు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

తెలంగాణలో భాజపా బలమేమిటో ప్రత్యర్థి పార్టీలకు తెలిసొచ్చిందని, ఫలితాల అనంతరం తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసేతర, మజ్లిసేతర పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే అందులో చేరే విషయమై ఆలోచిస్తామని, పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. భాజపాకు ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య పెరుగుతుందని, ఓట్ల శాతంలో గణనీయమైన వ ద్ధి ఉంటుందన్నారు. ‘దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో 118 స్థానాలకు భాజపా ఒంటరిగా పోటీ చేసింది. పార్టీ బలోపేతానికి చేసిన ఉద్యమాలు, యాత్రలు కలిసివచ్చాయి. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా జాతీయస్థాయి ముఖ్యనేతలు విస్త తంగా ప్రచారం చేశారు. ఇవన్నీ అనుకూలించాయి’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. 60 స్థానాల్లో విజయం లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీతో కలుస్తారా? అని ప్రశ్నించగా.. ‘ఫలితాలు వచ్చాక పార్టీల బలాబలాలు చూస్తాం. కాంగ్రెస్‌, మజ్లిస్‌ భాగస్వామ్యం లేని పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే కలిసే విషయమై ఆలోచిస్తాం’ అన్నారు. తెరాసకు మజ్లిస్‌ మద్దతును ప్రస్తావించగా.. భాజపాకు ఎంఐఎం బద్ధశత్రువని, ప్రభుత్వ ఏర్పాటులో మజ్లిస్‌తో కలిసే పార్టీతో భాజపా చేరబోదని స్పష్టంచేశారు. ముషీరాబాద్‌లో తన గెలుపు ఖాయమని, మెజారిటీ ఎంతన్నదే తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల గురించి అమిత్‌షా ఆరా తీశారు. లక్ష్మణ్‌తో శుక్రవారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? భాజపాకు ఎన్ని సీట్లు వస్తాయని అడిగినట్లు తెలిసింది. బట్‌..కండిషన్స్‌ అప్లై అంటున్న పురందరేశ్వరి… తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో బీజేపీ జత కట్టబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికి తాజాగా బీజేపీ పురందరేశ్వరి చేసిన వ్యాఖ్యలు కూడా మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రథయాత్ర ముగింపు కార్యక్రమం అనంతపురంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పురందేశ్వరి మాట్లాడుతూ.. తెలంగాణలో తమ మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉంటుందని పురందరేశ్వరి ప్రకటించారు. అయితే, మజ్లిస్‌ పార్టీకి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దూరంగా ఉండాలని ఆమె సూచించారు. అలాగే కాంగ్రెస్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు జట్టుకట్టడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఏపీకి కాంగ్రెస్‌ అన్యాయం చేసిందని ఆరోపించిన చంద్రబాబు, ఇప్పుడు అదే పార్టీతో తెలంగాణ ఎన్నికల్లో కలసి పోటీచేయడం సిగ్గుచేటన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) రద్దుకు బీజేపీ అనుకూలంగా ఉందనీ, ఉద్యోగుల డిమాండ్లను అమలు చేస్తామని పురందరేశ్వరి హామీ ఇచ్చారు. కేంద్రం సహకారంతోనే ఏపీలో అభివ ద్ధి జరుగుతోందని, కేంద్ర నిధులతోనే పోలవరం పనులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ నేతలను తిరగనివ్వబోమని పురంధేశ్వరి స్పష్టం చేశారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్‌ న్యాయమైనదేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వకుండానే పనులు జరుగుతున్నాయా? అని పురంధరేశ్వరి ప్రశ్నించారు. మూడువేల కోట్లు రావాలని, కేంద్రం ఇవ్వలేదని మంత్రులు ఆరోపించడం సరికాదన్నారు. కొంత జాప్యం జరగవచ్చు కానీ.. నిధులు ఇస్తున్నారు కదా అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు టీడీపీ భయపడుతోందని ఆరోపించారు. ఏపీలోని 175 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉంటారని స్పష్టం చేశారు. 2019లో ఏపీలో టీడీపీకి గడ్డుకాలమేనని, ప్రధానిపై అసత్య ప్రచారం చేస్తోందని కన్నా విమర్శించారు. ప్రజలు తెలివైనవారని, అన్నీ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, తల్లి, పిల్ల కాంగ్రేస్‌కు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని కన్నా వ్యాఖ్యానించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close