నాకేమైనా జరిగితే ప్రజలు నిలదీస్తారు

0

మహారాష్ట్ర : ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి మోడీపై నిప్పులు చెరిగారు. లోక్‌ పాల్‌, లోకాయుక్తల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన 81 ఏళ్ల హజారే మరోసారి దీక్ష చేపట్టారు. జనవరి 30వ తేదీన మహారాష్ట్రలోనలి రాలేగావ్‌ సిద్ధిలో దీక్షను స్టార్ట్‌ చేశారు. ఫిబ్రవరి 03వ తేదీన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ”దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారేగానీ.. అగ్నికి ఆజ్యం పోసిన నేతగా కాదు. నాకేమైనా జరిగితే ప్రజలు ప్రధాని మోదీని నిలదీస్తారు” అని అన్నాహజారే అభిప్రాయపడ్డారు. లోక్‌పాల్‌, లోకా యుక్తను నియమిస్తే ప్రధాని, ముఖ్యమంత్రిని సైతం విచారించొచ్చని తెలిపారు. అందువల్లే పార్టీలు ఈ వ్యవస్థను అమలులోకి తీసుకురావడానికి వెనకాడుతున్నాయన్నారు. అన్నాహజారే దీక్ష పట్ల ప్రధాని మోదీ సరిగా స్పందించడం లేదని.. స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం కేవలం ధన్య వాదాలు, శుభాకాంక్షలు మాత్రమే తెలియజేశారంటూ రాలేగావ్‌ సిద్ధి గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి అన్నా హజారే చేసిన కామెంట్స్‌పై ఎలాంటి రియాక్షన్స్‌ వస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here