సెట్లర్లకు అండగా ఉంటా

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర ప్రాంతాల ప్రజల బాధ్యత తాను స్వయంగా తీసుకుంటానని మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. ఈరోజు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేర్లింగంపల్లి నియోజక వర్గాల ప్రజలతో నిజాంపేటలో జరిగిన ‘మన హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన ప్రజలంతా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతోనే ఉన్నారని, వారి సహకారంతోనే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నరు. 2014 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్ర సమితి పైన అనేక అనుమానాలు ఉండేవని, అవన్నీ పటాపంచలు అయ్యే విధంగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ పాలన సాగిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ముఖ్యంగా నగరంలోని శాంతిభద్రతల సమస్య గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేకుండా కొనసాగిందని, ఈ విషయాన్ని హైదరాబాదులో స్థిరపడిన ఇతర ప్రాంతాల ప్రజలు గుర్తించి తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారన్నారు. రాజకీ యంగా ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు ని విమర్శిస్తున్న మని, కానీ ప్రజలను ఉద్దేశించి ఏమాత్రం కాదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర కి తెరలేపిన చంద్రబాబుని కచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటామన్నారు. స్థానికంగా జీవచ్ఛవంలా పడి ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి తన డబ్బులతో ఆక్సిజన్‌ అందించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాన్నారు. రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ దే విజయం అన్న విషయం కాంగ్రెస్‌ తెలుగుదేశం పార్టీలకు తెలుసని కేవలం ఒకటి రెండు సీట్లు ఎక్కువ సాధించుకునే లక్ష్యంతో అవి పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే తమ ప్రభుత్వం కుల మత ప్రాంతాలకు అతీతంగా పరిపాలన సాగించే ఆదర్శ ప్రభుత్వం గా మన్ననలు అందుకున్న దని, ఎలాంటి అనుమానాలున్నా వాటిని దూరం చేసుకోవాలని ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మంత్రి కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కుమారుడిగా, తెలంగాణ ప్రభుత్వ మంత్రిగా తాను అండగా ఉంటానని, బాధ్యత తీసుకుంటానని హావిూ ఇచ్చారు. ప్రజల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని రాజకీయంగా పార్టీల మధ్యనే విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here