జాతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

ఏ పార్టీలోనూ చేరను – గద్దర్‌

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): డిసెంబర్‌ 7న తెలంగాణ ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రముఖులు పార్టీల్లో చేరి కలు, ఆ పార్టీలనేతలు, ఈ పార్టీల్లోకి మా ర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు ప్రజాకవిగా ఉన్న గద్దర్‌ త్వరలో జరగ బోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారంలో పాల్గోనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో శుక్రవారం భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ నేత మధుయాష్కీతో కలిసి గద్దర్‌ కుటుంబ సభ్యులు రాహుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని గద్దర్‌ను రాహుల్‌ కోరినట్లు తెలుస్తోంది. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రాహుల్‌ సూచించారు. మహాకూటమికి అనుకూలంగా ప్రచారం చేస్తానని రాహుల్‌తో గద్దర్‌ పేర్కొన్నారు. గద్దర్‌కు ఉత్తర తెలంగాణ, సింగరేణి ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న తన కుమారుడు సూర్యకిరణ్‌కు పార్టీ తరపున బెల్లంపల్లి సీటుతో పాటు మరో ఇద్దరు అనుచరులకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గద్దర్‌ సీట్లు కోరినట్లు సమాచారం. బెల్లంపల్లి టికెట్‌ ఆశిస్తున్న సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ను పోటీ నుంచి తప్పించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కోరతారని భావిస్తున్నారు.

తెలంగాణలో రాజ్యాంగబద్దమైన పాలన జరగడం లేదు – గద్దర్‌

తాను ఏ పార్టీలోనూ చేరనని, సెక్యులర్‌ పార్టీల మధ్య వారధిగా ఉంటానని ప్రజాగాయకుడు గద్దర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో గద్దర్‌, ఆయన కుమారుడు సూర్యకిరణ్‌ భేటీ అయ్యారు. అనంతరం గద్దర్‌ విూడియాతో మాట్లాడుతూ తనపై గతంలో జరిగిన దాడిపై విచారణ జరిపిస్తామని రాహుల్‌ చెప్పారన్నారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారని తెలిపారు. తెలంగాణలో రాజ్యాంగ బద్దమైన పాలన జరగడం లేదని, కేసీఆర్‌ ఇచ్చిన హావిూల్లో ఒక్కటీ అమలుకాలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో కొత్త ఫ్యూడల్‌ వ్యవస్థ నడుస్తోందన్నారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం బందీఖానాగా మార్చిందని గద్దర్‌ విమర్శించారు. మహాకూటమికి అనుకూలంగా ప్రచారం చేస్తానని రాహుల్‌ కు తో చర్చించానని గద్దరు తెలిపారు. రాజ్యంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విన్నవించానన్నారు. కేసీఆర్‌ పై పోటీచేయాలని ప్రజలు కోరుతున్నారని గద్దర్‌ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజ్యంగాన్ని పరిరక్షించాలని రాహుల్‌ ని కోరినట్లు గద్దర్‌ తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close