నాకు సీఎం కావాలని లేదు: కేటీఆర్‌

    0

    హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభద్రతా భావంతో ఉన్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమ ర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వందసీట్ల తో అధికారంలోకి వస్తామని ఆయన పునరుద్ఘాటిం చారు. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం కావాలనే ఆలోచన లేదన్నారు. మంత్రి హరీశ్‌తోనూ, పార్టీలోని ఇతర నేతలతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తామంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాలు, అధికారం కంటే కుటుంబసభ్యుల మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పదని, దాన్ని ఎప్పుడూ వీడబోమని కేటీఆర్‌ అన్నారు. మహాకూటమి పుంజుకునే పరిస్థితే లేదని, తెలంగాణలో సెటిలర్స్‌ తమ వైపే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ రూపంలో తెలంగాణలో ప్రవేశించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మరో పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని స్పష్టం చేశారు. 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమని.. తెరాసలో అసమ్మతి పూర్తిగా చల్లారిందని ఆయన వివరించారు. భాజపా ఐదు సిట్టింగ్‌ స్థానాల్లోనూ ఈసారి తెరాసయే విజయం సాధిస్తున్న కేటీఆర్‌ జోస్యం చెప్పారు. తెరాస సొంతంగా అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన వివరించారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here