Featuredజాతీయ వార్తలు

మోడీ అను నేను..

రెండోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం

  • రెండోమారు కొలువుదీరిన బిజెపి ప్రభుత్వం
  • ప్రమాణం చేయించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
  • తొలుత మోడీ తరవాత రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రమాణం
  • పాత మంత్రులకు మళ్లీ దక్కిన పదవులు
  • మహిళా మంత్రులుగా నిర్మలా సీతారామన్‌, హరిస్మిత్‌ కౌర్‌, స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ :

నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంరెండోదఫా కొలువుదీరింది. రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నరేంద్ర మోడీ భారత దేశ ప్రధాన మంత్రిగా రెండోసారి గురువారం సాయంత్రం ప్రమాణం చేశారు. వేలాది మంది ప్రత్యక్షంగానూ, కోట్లాదిమంది టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారానూ వీక్షిస్తూ ఉండగా, వివిధ దేశాల అధినేతల సమక్షంలో మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మోడీచేత ప్రమాణం చేయించారు. దేవుడి సాక్షింగా ప్రధాని మోడీ హిందీలో ప్రమాణం చేయడం వివేషం. తొలుత ప్రధాని మోడీ,తరవాత రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆ తరవాత అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, సదానందగౌడ, నిర్మలా సీతారామన్‌, రాంవిలాస్‌ పాశ్వాన్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌,రవిశంకర్‌ ప్రసాద్‌ తదితరులు ప్రమాణం చేశారు.

అంతా హిందీలో ప్రమాణం చేయగా సదానంద గౌడ,నిర్మలాసీతారమన్‌,హరిస్మిత్‌ కౌర్‌లు మాత్రం ఆంగ్లంలో ప్రమాణం చేయడం విశేషం. మహిళా మంత్రులగా గత ప్రభుత్వంలో పనిచేసిన నిర్మలా సీతారమన్‌,హరిస్మిత్‌ కౌర్‌,స్మృతి ఇరానీలకు చోటు దక్కింది. బిజెపి సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌కు మాత్రం కేబినేట్‌లో చోటు దక్కలేదు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం సాయంత్రం 7 గంటలకు నరేంద్ర మోడీ చేత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు నరేంద్ర మోడీ కారులో నుంచి దిగిన వెంటనే ఆహూతులందరికీ నమస్కరిస్తూ వేదికపైకి వెళ్ళారు. కాబోయే మంత్రులంతా లేచి నిల్చుని, కరతాళ ధ్వనులతో మోడీకి స్వాగతం పలికారు. ఆయన 2014లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు సుమారు 5,000 మంది అతిథులు హాజరయ్యారు. 2019లో ఎన్డీయే ఘన విజయం సాధించిన నేపథ్యంలో గురువారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు 8,000 మంది అతిథులు హాజరయ్యారు. పారిశ్రామిక దిగ్గజాలు అనిల్‌ అంబానీ దంపతులు, రతన్‌ టాటా, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ దంపతులు, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, నేపాల్‌, భూటాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, మారిషస్‌ దేశాల అధినేతలు పాల్గొన్నారు. వీరికితోడు కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, బీజేపీ అగ్ర నేత ఎల్‌ కే అద్వానీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, మాజీ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే దేశ విదేశీ ప్రముఖులతో పాటు పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులంతా అక్కడికి చేరుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ, యూపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు కుమారస్వామి, దేవేంద్ర

ఫడణవీస్‌, అరవింద్‌ కేజీవ్రాల్‌, యోగి ఆదిత్యనాథ్‌, పళనిస్వామి, పాటు పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్‌ అంబానీ దంపతులు, రతన్‌టాటా హాజరయ్యారు. సామాజిక మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంటూ, అవసరమైనవారికి సహాయపడుతూ మంచి పేరు తెచ్చుకున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఈసారి మోడీ మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్‌ జైట్లీ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వవద్దని కోరిన సంగతి తెలిసిందే. ఇకపోతే మంత్రివర్గంలో తమకు అలంకార ప్రాయమైన శాఖను ఇవ్వజూపినట్లు ఆరోపిస్తూ జనతా దళ్‌ యునైటెడ్‌ పార్టీ అలకబూనింది. రాష్ట్రపతి భవన్‌ ముందున్న బహిరంగ ప్రదేశంలో మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close