జగన్‌ అను నేను… ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా..

0
  • ప్రమాణం చేయించిన గవర్నర్‌ నర్సింహన్‌
  • తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌
  • పెన్షన్‌ పెంపు ఫైలుపై తొలి సంతకం
  • దశలవారీగా నాలుగేళ్లలో రూ.3వేల పెన్షన్‌
  • స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి

విజయవాడ

: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:23నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ నరసింహన్‌.. వైఎస్‌ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘జగన్‌ అనే నేను’ అంటూ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారాయన. జగన్‌ ప్రసంగం ప్రారంభించగానే వైసీపీ అభిమానులు, కార్యకర్తలు కరతాళ ధ్వనులు చేశారు. కార్యకర్తల కరతాళధ్వనుల మధ్య జగన్‌ తన ప్రమాణ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి కృష్ణారావు, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కెవీపీ రామచంద్రరావు, తెలంగాణ ¬ం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులు విజయమ్మ, భారతి, షర్మిల హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవ్వటంతో స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది. ప్రమాణ స్వీకారం చేసేముందు వైఎస్‌ జగన్‌ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తొలుత ఫాదర్లు జగన్‌ను ఆశీర్వదించగా,తరువాత ముస్లీంలు, తరువాత హిందు పురోహితులు జగన్‌ను ఆశీర్వదించారు.

ఉదయం 11.54 నిమిషాలకు తాడేపల్లిలోని తన స్వగృహంనుంచి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల, అనిల్‌ సభా ప్రాంగణానికి వచ్చారు. 12.14 నిమిషాలకు పూలతో సుందరంగా అలంకరించిన ఓ ప్రత్యేక వాహనంలో వైఎస్‌ జగన్‌ అక్కడి జనాలకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగారు. అనంతరం ఆయన స్టేజివిూదకు చేరుకుని మరోసారి ప్రజలకు అభివాదం చేశారు. ప్రమాణం స్వీకారానికి కొద్దిక్షణాల ముందు జాతీయ గీతాలాపన జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గవర్నర్‌ నరసింహన్‌.. వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

పెన్షన్‌ పెంపు ఫైలుపై తొలి సంతకం

పాదయాత్రలోఇచ్చిన హావిూమేరకు తొలుత పెన్షన్ల పెంపు ఫైలుపై సిఎం వైఎస్‌ జగన్‌ సంతకం చేశారు. తండ్రి తరహాలో ఆయన తొలిహావిూని నిలబెట్టుకున్నారు. వైఎస్‌ కూడా తొలి సిఎంగా ఉచిత విద్యుత్‌ సరఫరా ఫైలుపై ఉమ్మడి రాష్ట్రంలో సిఎంగా సంతకం చేశారు. ఇప్పుడు అదే కోవలో జగన్‌ కూడా అవ్వాతాతలకు కానుకగా పెన్షన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణం అనంతరం జరిగిన కార్యక్రమంలో జగన్‌ ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తామని, తద్వారా రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తయారు చేయడమే తన లక్ష్యమని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జగన్‌ మాట్లాడుతూ..ఆకాశమంత విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ సీఎం పదవిని స్వీకరిస్తున్నాను అని జగన్‌ చెప్పారు. 3648 కి.విూ. ఈ నేలపై నడిచినందుకు విూలో ఒకడిగా నిలిచినందుకు ఆకాశమంతా విజయాన్నందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్‌ భావోద్వేగంతో మాట్లాడారు. నా పాదయాత్రలో పేదల కష్టాలు చూశానని, ప్రజల కష్టాలు విన్నానని, నేనున్నానని విూ అందరికి చెబుతున్నానా.. అందరి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రజల కష్టాలను తీర్చేందుకు రెండే రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చామని జగన్‌ అన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా పేజీల కొద్ది మేనిఫెస్టో తీసుకోలేదని, మా మేనిఫెస్టోలో కులానికో పేజీ తీసుకురాలేదని, మేనిఫెస్టోను పవిత్రంగా భావిస్తానని, మేనిఫెస్టో ఆధారంగా పరిపాలిస్తానని మాట ఇస్తున్నానని జగన్‌ హావిూ ఇచ్చారు. జగన్‌ మాట్లాడుతున్నంత సేపు అభిమానులు, కార్యకర్తలు ఈలలు కేకలు, నినాదాలతో ¬రెత్తించారు. నవరత్నాలు ప్రతిఒక్కరికి అందాలే చూస్తానని జగన్‌ అన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలని.. రాజకీయాలు.. పార్టీలంటూ తేడా చూడకూడదన్నారు. ఆగస్టు 15నాటికి గ్రామ వాలంటీర్లుగా 4లక్షల ఉద్యోగాలు ఇచ్చి.. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తామని సీఎం జగన్‌ తేల్చిచెప్పారు. వీరి ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను డోర్‌డెలివరీ చేస్తామని జగన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికీ అందకపోయినా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు ప్రజలకు ముఖ్యమంత్రి కార్యాలయానికే నేరుగా ఫిర్యాదు చేసేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి కాల్‌ సెంటర్‌ను అనుసంధానం చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. పైరవీలు, లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందిస్తామని జగన్‌ పేర్కొన్నారు. నవరత్నాలు ప్రతి ఒక్కరికీ అందిస్తామని సిఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందిస్తానని వేదికపై నుంచి ప్రజలకు హావిూ ఇచ్చారు. గత ప్రభుత్వంలోని జన్మభూమి కమిటీలపై విమర్శలు చేసిన ఆయన.. ప్రభుత్వ పథకాలు, సేవలు ఏ ఒక్కరికీ అందకపోయినా నేరుగా ప్రభుత్వానికే పిర్యాదు చేసేవిధంగా ఆగస్టు 15 నాటికి కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం చేస్తామన్నారు. అవినీతి నిర్మూలన కోసం పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వ్యవస్థలను ప్రక్షాలన చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో అవినీతికి పాల్పడిన సంస్థలకు సంబంధించిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. కాంట్రాక్ట్‌ పనులలో రివర్స్‌ టెండరింగ్‌ ప్రాసెసింగ్‌ను తీసుకొచ్చి.. మిగులు నిధుల గురించి ప్రజలకు తెలిసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటుకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలుస్తానని జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. కమిషన్‌ ఏర్పాటుకు ఓ జడ్జిని కేటాయించమని కోరుతానన్నారు. జ్యుడిషియల్‌ కమిషన్‌ ఆధీనంలో కాంట్రాక్టుల మానిటరింగ్‌ జరుగుతుందన్నారు. జ్యుడిషియల్‌ కమిషన్‌ ద్వారానే టెండర్లను పిలుస్తామని జగన్‌ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఏ విూడియా అయినా వక్రీకరించి వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. 6నెలల నుంచి ఏడాది సమయం ఇవ్వండి.. ప్రక్షాళన చేస్తానని జగన్‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో అమలవుతున్న విద్యుత్‌ రేట్లను తగ్గిస్తామని ముఖ్యమంత్రి హావిూ ఇచ్చారు. సంక్షేమ పథకాలను డోర్‌ డెలివరి చేస్తామన్నారు. లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తామని, గ్రామాల్లో చదువుకున్న.. సేవ చేయాలనుకునేవాళ్లే వాలంటీర్లుగా ఉంటారని అన్నారు. వాలంటీర్లకు రూ.5 వేలు జీతం ఇస్తామని, ప్రజలకు చెందాల్సిన ఏ పథకంలోనూ కక్కుర్తి ఉండకూడదన్నారు. ప్రభుత్వ పథకాలు.. సేవలు ఏ ఒక్కరికీ అందకపోయినా లంచాలపై ఫిర్యాదులకు ఆగస్టు 15నాటికి కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసిన 72గంటల్లోగా నవరత్నాలు అందేలా చేస్తామని తెలిపారు.

జూన్‌ నుంచి రూ. 2,250 పెన్సన్‌ అందిస్తాం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్‌ జగన్‌.. పెన్షన్‌లపై తొలి సంతకం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వృద్ధులకు రూ.2250 నెలకు పెన్షన్‌ కింద ఇవ్వనున్నట్లు తెలిపారు. వెంటనే పెన్షన్‌పై మొదటి సంతకం పెట్టారు. అంతే కాకుండా 

ప్రతిఏడాది ఈ పెన్షన్‌ మొత్తాన్ని పెంచనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం దీనిని 2500 రూపాయలు చేయనున్నట్లు, ఆ తదుపరి సంవత్సరం 2750 రూపాయలు, అనంతరం 3000 రూపాయలకు పెంచ నున్నట్లు జగన్‌ తెలిపారు. తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ ముసలి అవ్వ చెప్పిన సంగతులను గుర్తు చేసుకున్నారు. అవ్వతాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నామని, రెండు చేతులు జోడించి పేరుపేరునా ఆశీస్సులు కోరుతున్నానని జగన్‌ అన్నారు. అనంతరం ఆయన తల్లి విజయమ్మను ఆలింగనంచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here