Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

రక్షణ భద్రతలో దేశంలోనే హైదరాబాద్ నెంబర్ వన్

రాంగోపాల్ పేట్(ఆదాబ్ హైదరాబాద్):రక్షణ,భద్రత విషయంలో దేశంలోని హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ఉత్తర మండల పోలీసులు సికింద్రాబాదులోని ఎస్ వి ఐ టి   కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు.నల్గొండ, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులతో సీపి అంజనీ కుమార్ ముచ్చటించారు.ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ నార్త్ జోన్ డిసిపి కలమేశ్వర్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా చేపట్టినట్లు తెలిపారు. పోలీసుశాఖ తరపున ప్రజా రక్షణ తో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని గత నాలుగేళ్ల నుండి నిర్వహిస్తున్నట్లు సిపి ఆంజని కుమార్ చెప్పారు.ఈరోజు 1800 మంది విద్యార్థులు జాబ్ కోసం రిజిస్ట్రేషన్ జరిగినట్లు 1800 మంది విద్యార్థులకు ఉపాధి కల్పన జరిగినట్లు వెల్లడించారు.దాదాపు 70 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నట్లు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీలకు సీపి అంజనీ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.కేవలం హైదరాబాద్ వాసులకే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుండి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు పొందినట్లు ఆయన వెల్లడించారు.నిరుద్యోగ యువతకు ఖాళీగా ఉండకుండా పోలీసు శాఖ వారు చేపడుతున్న మేళా కు హాజరై వారి జీవితాలను మంచి మార్గంలో ఉంచుకోవాలని  అన్నారు..ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ అయిన అమెజాన్ కూడా తన ఔట్ లెట్ ను హైదరాబాద్లోనే ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఉత్తర మండల డిసిపి,ఏసీపీలు,సి ఐ లు,ఎస్ ఐ లు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close