హైదరాబాద్‌ నా మానస పుత్రిక..

0

గుంటూరు (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. నిన్న మొన్న రోజూ తిడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తిట్టినా తాను పట్టించుకోవడం ఆయన్ను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్‌ ఎక్కడి వాడని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్‌ కు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీయేనని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేసీఆర్‌ తెలుగుదేశం పార్టీలో తన అనుచరుడుగా ఉండేవాడని తనతోనే ఉండేవాడని అలాంటి వ్యక్తి తనను తిడుతుంటే బాధ ఉండదా అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివ ద్ధికి తాను ఎంతో పోరాటం చేశానని అందుకు తిడతున్నారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో మైక్రో సాఫ్ట్‌ కంపెనీ కోసం ఎన్ని పాట్లు పడ్డానో ప్రజలకు తెలుసునన్నారు. హైదరాబాద్‌ లాంటి మహానగరాన్ని ప్రపంచ చిత్ర పటంలో ప్రత్యేక స్థానం వచ్చింది అంటే అది తనవల్లేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నో సవాళ్లు చూసిందని అయినా వాటిని ధైర్యంగా ఎదుర్కొందన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా టీడీపీ బలపడుతుందే తప్ప బలహీన పడుతుందని అనుకుంటే అది వారి అవివేకం అన్నారు. హైదరాబాద్‌ నగరం తన మానసిక పుత్రిక అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగుప్రజలకు ఉపాధి కలగాలన్న ఉద్దేశంతోనే తాను హైదరబాద్‌ ను ప్రపంచ పటంలో నిలబెట్టానన్నారు. హైదరాబాద్‌ మహానగరం ఇంకా అభివ ద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఆ అభివ ద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ ఓడిపోవాలని ప్రజాకూటమి అధికారంలోకి రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ లో తాను ప్రతీ వీధి వీధి తిరిగానని నగరం అభివ ద్ధి కోసం ఉదయమే తనిఖీలు చేపట్టినట్లు గుర్తు చేశారు. ఇప్పటికీ హైదరాబాద్‌ మహానగరం అభివ ద్ధి చెందాలని మరింత మందికి ఉపాధి కల్పించాలని చెప్పుకొచ్చారు. సైబరాబాద్‌ లాంటి నిర్మాణాలు జరగాలంటే అది కాంగ్రెస్‌ తోనే సాధ్యమన్నారు. ఇకపోతే టీఆర్‌ఎస్‌ పార్టీ ఏపీపై కక్ష సాధింపుకు పాల్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మద్దతు పలికిని టీఆర్‌ఎస్‌ ఇప్పుడు మాట మార్చిందన్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని తాను కోరుకుంటుంటే కేసీఆర్‌ మాత్రం ససేమిరా అంటున్నాడని తనను తిడుతున్నాడని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీతో కుమ్మక్కు అయ్యారని ధ్వజమెత్తారు. అందువల్లే తమకు ప్రత్యేక హోదాపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని నిలదీశారు. అటు ఏపీలోని వైసీపీ, జనసేనలు సైతం మోదీ కనుసన్నుల్లోనే నడుస్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల రాజధానులు అభివద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. అటు హైదరాబాద్‌ మహానగరం, ఇటు అమరావతి రెండు రాజధానులు అభివ ద్ధి చెందుతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా ఆలోచించి ప్రజాకూట మిని గెలిపించాలని చంద్రబాబు కోరారు. అలాంటి హైదరాబాద్‌ ను తాను నిర్మిస్తే కేసీఆర్‌ తనపై ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ మహానగరాన్ని నిర్మిస్తే అమరావతిని ఎందుకు నిర్మించలేక పోయారని ప్రశ్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. 40వేల కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణ పనులు చేపట్టామని పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఐదు మహానగరాల్లో అమరావతి ఒకటిగా చూపిస్తామని కేసీఆర్‌ ను ఉద్దేశించి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here