Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో స.హ. చట్టం ఉల్లంఘన

స.హ. చట్టం 2005 పట్టించుకోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ 

* తప్పుడు సమాచారాన్ని అందజేస్తున్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్

యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్న అధికారులు.

ఆదాబ్ హైదరాబాద్ :దేశంలోని ప్రభుత్వ ఆధీనంలో కొనసాగే ప్రైవేట్ సంస్థలు, అధికారుల పూర్తి వివరాలను తెలుసుకునేందుకు  సమాచార హక్కు చట్టం 2005 లో హక్కులను కల్పించింది.  ఈ చట్టం ద్వారా సామాన్య ప్రజలు కూడా తమ కు అవసరం ఉన్న పూర్తి సమాచారంను సంబంధిత శాఖల నుంచి పొందవచ్చును. సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సుమారుగా 30 రోజుల్లో పూర్తి వివరాలు ఇవ్వాలి. అలా ఇవ్వని అనంతరం అప్పీలేట్ అధికారులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చును. సమాచారం కోరిన అభ్యర్థికి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో సమాచారం ఇవ్వని సంబంధిత అధికారి అర్జిదారునికి ఇచ్చేంత వరకు ప్రభుత్వం నిర్దేశించిన ఒక రోజుకూ రూ.250ల వరకు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. తప్పుడు సమాచారం ఇచ్చిన సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలకు సమాచార హక్కు కమీషన్ అండర్ సెక్షన్ 18 ( 1) ప్రకారము సిఫారసు చేయవచ్చు.
సమాచార హక్కు చట్టంలోని 31 సెక్షన్‌ల్లో దాదాపుగా 26 హక్కులు కల్పించడం జరిగింది. సమాచార హక్కు చట్టం- 2005లో సెక్షన్ 2 నుంచి 20వరకు పౌరులకు 26 హక్కులను కల్పించారు. వీటి ద్వారా పౌరులు తమకు కావాల్సిన సమాచారం పొందడంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా, పై హక్కుల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించి, పౌర సేవాల మెరుగుదల కోసం ప్రభుత్వం గొప్పఉద్దేశంతో ఈ చట్టంను తీసుకువస్తే,
హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమాచార హక్కు చట్టాన్ని  తుంగలో తొక్కి సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం పొందుటకు దరఖాస్తు పెట్టుకున్నా సంబంధిత అధికారులు నిర్దేశించిన సమయంలో సమాచారం ఇవ్వకుండా,  అసంపూర్తి సమాచారం ఇవ్వడం , తప్పుడు సమాచారం ఇవ్వడం, పిటిషనర్లకు భయభ్రాంతులకు గురిచేయడం చేస్తున్నారు అని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.  

విద్యాశాఖ కార్యాలయంలో జీవో ఎంఎస్ నెంబర్ 1 నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఈ విషయాలపై సమాచార  హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని కోరిన అర్జీదారునికి  సమాచారాన్ని ఇవ్వకుండా తప్పు సమాచారం, అసంపూర్తి సమాచారం ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఇవ్వడం జరుగుతుంది . సరైన సమాచారం ఇవ్వడంతో హైదరాబాద్ జిల్లాలో గుర్తింపు లేకుండా, నియమ నిబంధనలకు విరుద్ధంగా లోపాయకారీ ఒప్పందంతో కొనసాగుతున్న  పాఠశాలల  వెలుగులోకి వచ్చి వారికి ఇబ్బందిగా  మారుతుందని తప్పుడు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ పరిధిలో గుర్తింపు లేకుండా ఎన్నో పాఠశాలలో కొనసాగుతుంది ఈ పాఠశాలల యాజమాన్యాల తో విద్యాశాఖ అధికారులు   లంచాలకు ఆశపడి గుర్తింపు లేని పాఠశాలల పై  ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

తేదీ 07 – 02 – 2017 రోజున సమాచార హక్కు చట్టం కార్యకర్త మహమ్మద్ ఫరీదుద్దీన్ సెక్షన్ 6 (1) ప్రకారం 1. హైదరాబాద్ జిల్లాలో ఫ్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలల గుర్తింపు వివరాలు మండలాల వారీగా 2. హైదరాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలల పూర్తి వివరాలు, పాఠశాల కరస్పాండెంట్, ఎడ్యుకేషన్ సొసైటీ రిజిస్ట్రేషన్ వివరాలు 3. ఒకే ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న పాఠశాలల గుర్తింపు ప్రోసిడింగ్ పత్రాలు ఇవ్వగలరని దరఖాస్తు పెట్టుకున్న సమాచారం ఇవ్వకుండా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కాలయాపన చేశారు. ఫస్ట్ ఆఫ్లైట్ అధికారికి  ఆపిల్ చేసినా కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తేదీ 15 – 05 – 2018 (ఆపిల్ నోటీస్ నెంబర్ 12531/SIC-BM/2017) రాష్ట్ర సమాచార కమిషనర్ కు రెండవ ఆపిల్ చేయడం జరిగింది. స్వీకరించిన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కి 31.7.2019 రోజున రాష్ట్ర సమాచార కమిషనర్ ముందు హాజరుకావాల్సిందిగా నోటీసు ఇవ్వడం జరిగింది. సుమారుగా రెండు సంవత్సరాల అనంతరం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ జగన్నాథ్ రాష్ట్ర సమాచార కమిషనర్ ఎదురుగా హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న  పాఠశాల గుర్తింపు వివరాలు, ఎలాంటి సమాచారం లేదని తప్పుడు సమాచారం సమాచార హక్కు కమిషనర్ ముందు ఇవ్వడం జరిగింది.  తప్పుడు సమాచారం ఇవ్వడానికి కూడా పబ్లిక్  ఇన్ఫర్మేషన్ అధికారి ఉద్దేశపూర్వకంగా రెండు సంవత్సరాల కాలయాపన చేసిన అనంతరం  సమాచారం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో  సమాచారం ఇవ్వకపోవడానికి  ముఖ్య ఉద్దేశ్యము  సరైన సమాచారం ఇవ్వడంతో వారి చేస్తున్న అవినీతి బట్టబయలు అవుతుందన్న దురుద్దేశంతో అర్జీదారునికి తప్పుడు సమాచారం ఇవ్వడం జరుగుతుంది.  వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించి, పౌర సేవాల మెరుగుదల కోసం ప్రభుత్వం గొప్పఉద్దేశంతో ఈ చట్టంను తీసుకువస్తే, విద్యా హక్కు చట్టాన్ని, విద్యాశాఖ ప్రభుత్వ ఆదేశాలను  ఉల్లంఘిస్తూ, సమాచార హక్కు చట్టం  2005  నిర్వీర్యం చేస్తూ విద్య శాఖలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సమాచార హక్కు చట్టం 2005 ఉల్లంఘనల పై సంబంధిత సమాచార కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా  సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. సమాచార హక్కు చట్టం , అండర్ సెక్షన్ 4 (1) (b) ప్రకారము సమాచారాన్ని ప్రతి కార్యాలయము  వారి వారి కార్యాలయాల వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో పెట్టాలి కానీ ఏ ఒక్క రాష్ట్ర కార్యాలయం లో పూర్తిస్థాయిలో వెబ్సైట్లో సమాచారాన్ని పెట్టడం లేదు ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకోవలసిన సమాచార హక్కు కమిషన్ పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం అని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 

సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలి……. మహమ్మద్ ఫరీద్ ఉద్దీన్ ఆక్టివిస్ట్

సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పూర్తి సమాచారం పొందుటకు ప్రతి పౌరునికి హక్కు కల్పించినా కూడా  హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రభుత్వం పౌరులకు కల్పించిన హక్కులను కాలరాస్తూ అసంపూర్తి సమాచారం, తప్పుడు సమాచారం ఇవ్వడం.సమాచార హక్కు చట్టం 2005 అండర్ సెక్షన్ 4 (1) (ఎ)(బి) ప్రకారము అన్ని శాఖల లో, సంస్థలలో సమాచారాన్ని వెబ్ సైట్ లో పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారిపై చర్యలు చేపట్టి, అర్జిదారునికి పూర్తి సమాచారం పొందే విధంగా సమాచార హక్కు చీఫ్ కమిషనర్ దృష్టిని కేంద్రీకరించాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close