Featuredసినిమా వార్తలు

డైనమిక్‌ సిటీగా హైదరాబాద్‌

  • ప్రపంచ క్రియాశీకల జాబితాల్లో టాప్‌
  • ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ రూపొందించిన సర్వే

అన్ని రంగాల్లో దూసుకుపోతూ ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో సిగలో మరో కలికితురాయి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ సామాజిక-ఆర్థిక, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాల ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల నగరం (డైనమిక్‌ సిటీ)గా అవతరించింది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ రూపొందించిన ‘2020 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల నగరాల జాబితా’లో భాగ్యనగరం మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 130 నగరాల్లోని వాణిజ్య సముదాయాల కార్యకలాపాలను జేఎల్‌ఎల్‌ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత హైదరాబాద్‌కు ప్రథమస్థానాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ రూపొందించిన ‘సిటీ మూమెంటమ్‌ ఇండెక్స్‌-2020’ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌, జేఎల్‌ఎల్‌ సీఈవో రమేశ్‌ నాయర్‌, జీహెచ్‌ఎంసీ బొంతు రామ్మోహన్‌ తదితరులతో కలిసి శనివారం రాత్రి విడుదల చేశారు.అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ నగరాల జాబితాలో హైదరాబాద్‌ మూడేండ్లలో రెండుసార్లు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్‌ అన్నారు. ఈ ఏడాది టాప్‌-10లో హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు, ¬చిమిన్‌ సిటీ, నైరోబీ, చెన్నై, ఢిల్లీ, హనోయి, మనిలా, సిలికాన్‌వ్యాలీ, షెన్‌జెన్‌ నగరాలు చోటుదక్కించుకోగా.. పుణె 12వ, కోల్‌కతా 16వ, ముంబై 20వ స్థానంలో నిలిచాయి.

2014లో జేఎల్‌ఎల్‌ విడుదలచేసిన సిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్‌కు టాప్‌-20లో చోటు లభించలేదు. ఆ మరుసటి ఏడాదే టాప్‌-20లో చేరిన హైదరాబాద్‌.. అప్పటినుంచి తన స్థానాన్ని మెరుగుపరుచుకొని 2016లో ఐదో స్థానానికి 2017లో మూడో స్థానానికి, 2018లో అగ్రస్థానానికి ఎగబాకింది. గతేడాది ఈ సూచీలో హైదరాబాద్‌ రెండో స్థానానికి పడిపోయినా ఈ ఏడాది మళ్లీ మొదటిస్థానం దక్కించుకున్నది.గతేడాది ఈ ఇండెక్స్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకొన్న బెంగళూరును ఈసారి హైదరాబాద్‌ రెండోస్థానానికి నెట్టేసింది. సూచిక ప్రారంభించినప్పటి నుంచి తమ అధ్యయనంలో చైనా పనితీరు తగ్గుతోందని నివేదిక తెలిపింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close