Featuredస్టేట్ న్యూస్

మానవ మృగాలు.. నలిగిపోతున్న యువతులు..

  • మహిళలపై ఆగని అకృత్యాలు
  • మరో ఇద్దరు మహిళల హత్య
  • హన్మకొండలో యువతిపై అత్యాచారం..హత్య
  • షాద్‌నగర్‌ వద్ద మహిళ దహనం

పుట్టినరోజే ఆ యువతి జీవితంలో చివరి రోజుగా మిగిలిపోయింది. గుడికి వెళ్లి వస్తానని చెప్పిన యువతి.. విగతజీవిగా కనిపించింది. శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు లేనప్పటికీ.. మర్మాంగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు. దీన్నిబట్టి యువతిపై గ్యాంగ్‌ రేప్‌ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో ఈ దారుణం జరిగింది. మరో వైపు ఉద్యోగ నిమిత్తం వెళ్లిన యువతి ఉదయం సజీవ దహనమై ఉండటం సంచలనం రేపింది. మృతురాలిని ప్రియాంక రెడ్డిగా గుర్తించారు. ట్రీట్‌ మెంట్‌ కోసం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ హాస్పిటల్‌కు వెళ్లిన ప్రియాంక… తిరిగి వచ్చే సమయంలో తన స్కూటీ పాడైపోయిందని చెల్లెలికి ఫోన్‌ చేసినట్టు తెలుస్తోంది. తన స్కూటీ పాడైందని… చుట్టుపక్కల లారీ డ్రైవర్లు ఉన్నారని.. తనకు భయమేస్తోందని ఆమె తన చెల్లికి ఫోన్‌లో చెప్పినట్టు సమాచారం. రాత్రంతా ప్రియాంక ఇంటికి రాకపోవడంతో… ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్‌ నగర్‌ సమీపంలో ఓ యువతి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉందని గుర్తించిన పోలీసులు… మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు… ఆ డెడ్‌ బాడీ ప్రియాంక రెడ్డిదే అని గుర్తించారు పోలీసులు.. అమ్మాయిలను రేప్‌ చేయడం ఆ తరవాత హత్యచేయడం వటంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే బాలికలను కూడా కిడ్నాప్‌ చేసి హతమారుస్తున్నారు. మసీదు బండలో ఓ బాలికను హతమార్చిన ఘటన మరువకముందే మళ్లీ అలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

హైదరాబాద్‌

వరంగల్‌ జిల్లా కేంద్రంలో 19 ఏళ్ల యువతి దారుణంగా హత్యకు గురైంది. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్స్‌ వద్ద ఆ యువతి మృతదేహం లభించింది. అనుమానాస్పద రీతిలో ఆమె చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలిని మానసగా గుర్తించారు. ఆమె నగరంలోని దీన్‌దయాల్‌ నగర్‌లో నివాసం ఉంటున్నది. నవంబర్‌ 27వ తేదీన ఆ యువతి పుట్టిన రోజు, అయితే బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఫ్రెండ్స్‌ ఇంటికి వెళ్లిన ఆ అమ్మాయి, బుధవారం రాత్రి శవమై కనిపించింది. యువతిని హత్య చేయడానికి ముందు అత్యాచారం చేసి ఉంటారని భావిస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సుబేదారి పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి అనుమానాస్పద మృతి కేసుపై సుబేదారి సీఐ అజయ్‌ స్పందించారు. కేసు విచారణ వేగంగా కొనసాగుతోందన్నారు. 24గంటల్లో కేసును ఛేదిస్తామన్నారు. యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక యువతిపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందా? లేదా? అనేది తేలుతుందన్నారు. సీసీ కెమెరా దృశ్యాలు, ఘటనస్థలంలో దొరికిన ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేశామని అజయ్‌ స్పష్టం చేశారు. ఇకపోతే ఓ మహిళను హతమార్చి ఆపై గుర్తించకుండా తగులబెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ సమీపంలో ఈ దారుణ హత్య వెలుగు చూసింది. ఫరూక్‌నగర్‌ మండలం చటాన్‌ పల్లి గ్రామం వద్ద గల బైపాస్‌ రోడ్డులోని అండర్‌ బ్రిడ్జి కింద పూర్తిగా తగులబడిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. కొందరు మహిళను దారుణంగా హతమార్చి.. తగలబెట్టారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్కడో హత్య చేసి.. ఇక్కడకు తీసుకువచ్చి తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణంపై ఇప్పటికిప్పుడు ఎలాంటి వివరాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close