వికారాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న మానవ మృగాలు

0

ఐదేళ్ల అంగన్వాడీ విద్యార్థినిపై లైంగిక దాడిపరిస్థితి విషమం… తాండూర్ ఆసుపత్రికి తరలింపుదర్యాప్తు చేస్తున్న పెద్దెముల్ పోలీసులువికారాబాద్ ఆదాబ్ హైదరాబాద్. వరంగల్ జిల్లాచిన్నారి పై లైంగిక దాడిని  సమాజం ఇంకా మరువలేదు… వికారాబాద్ జిల్లా పెద్ద ఉమెన్o తల చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం ప్రజల కళ్ళముందు ఇంకా కదలాడుతుంది… ఈ సంఘటనలు మరువకముందే జిల్లాలోని పెద్దేముల్ మండల్ రేగొం డి గ్రామంలో మరో సంఘటన జరిగింది . అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై మేనమామ  లైంగిక దాడికి పాల్పడ్డాడు. సోమవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక రే గొండి అంగన్వాడీ కేంద్రంలో అయిదేళ్ల చిన్నారి చదువుకుంటుంది. శుక్రవారం శ్రావణ మాసం కావడంతో అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  దీంతో ఐదేళ్ల బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా వరసకు మేనమామ అయిన నాగేష్(20) పట్టపగలు ఇంట్లోకి తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు . ఐదేళ్ల బాలిక తల్లిదండ్రులు రోజూ కూలికి వెళ్లి రాత్రికి ఆలస్యంగా ఇంటికి రావడంతో లైంగి దాడి విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తన కూతురికి తీవ్ర జ్వరం తో పాటు అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి తల్లి యాదమ్మ చిన్నారికి స్నానం చేయించడానికి బట్టలు విప్పడం తో లైంగిక దాడి విషయం వెలుగులోకి వచ్చింది ఐదేళ్ల బాలిక బట్టల్లో తీవ్ర రక్తస్రావం అయినప్పటికీ సకాలంలో పని ఒత్తిడి కారణంగా తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు ఈ విషయం తెలియగానే ఇరుగుపొరుగు మహిళలతో జరిగిన విషయమై చర్చించి చిన్నారి ద్వారా సమాచారాన్ని సేకరించారు వరుసకు మేనమామ నగేష్ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలియడంతో గ్రామస్తులు మహిళలు నాగేష్ కి దేహశుద్ధి చేశారు ఈ విషయమై చిన్నారి తల్లిదండ్రులు పెద్దేముల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు ఈ విషయం తెలియగానే తాండూరు డి.ఎస్.పి రామచంద్రుడు సీఐ రవికుమార్ హుటాహుటిన రేగొం డి గ్రామానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు తీవ్ర రక్తస్రావంతో అస్వస్థకు గురైన చిన్నారిని మెరుగైన చికిత్స కోసం తాండూర్ ఆస్పత్రికి తరలించారు చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని తాండూర్ ఆసుపత్రి డాక్టర్లు తెలియజేశారు కాగా నిందితుడు నాగేష్ పెద్దేముల్ పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు కాగా వాయు వరుస పెద్ద చిన్న తేడా లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here