Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

తెలంగాణలో భారీ విద్యుత్‌ కుంభకోణం

విద్యుత్‌ సంస్థలను నిర్వీర్యం చేసిన కేసీఆర్‌

ఒక్క మెగావాట్‌ కూడా ఉత్పత్తి లేదు

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలన్న లక్ష్మణ్‌

హైదరాబాద్‌

తెలంగాణలో విద్యు సంస్థలను భ్రష్టు పట్టించిన సిఎం కెసిఆర్‌, మొత్తంగా విద్యుత్‌ వ్యవస్థను సర్వనాశనం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. 24గంటల విద్యుత్‌ సరఫరాలో ఎన్నో లోపాలతో పాటు భారీ కుంభకోణం దాగుందన్నారు. తెలంగాణ విద్యుత్‌ రంగంలో భారీ కుంభకోణం జరిగిందని.. సిట్టింగ్‌ జడ్డితో విచారణ జరిపిస్తే పూర్తి వివరాలు బహిర్గతం అవుతాయని ఆయన అన్నారు. దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యల వల్లే దేశంలోని 28 రాష్టాల్ల్రో మిగులు విద్యుత్‌ సాధ్యమైందని లక్ష్మణ్‌ అన్నారు. విద్యుత్‌ రంగంలో టీఆర్‌ఎస్‌ కొత్త నాటకానికి తెరలేపిందని చెప్పారు. అనాలోచిత నిర్ణయం వల్ల డిస్కంలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. విద్యుత్‌ కొనుగోళ్లలో ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువ అవినీతి జరిగిందని తెలిపారు. విద్యుత్‌పై కేంద్రం స్పష్టమైన పాలసీ అమలు చేస్తోందని వెల్లడించారు.తెలంగాణలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా సోలార్‌ విద్యుదుత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన మండిపడ్డారు. భాజపా కార్యాలయంలో లక్ష్మణ్‌ విూడియాతో మాట్లాడారు. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ.. దక్షిణ, ఉత్తర విద్యుత్‌ గ్రిడ్లను అనుసంధానం చేయడం వల్లే ఈరోజు రాష్ట్రంలో తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు అవకాశం లభించిందని చెప్పారు. అయితే ఇదంతా తన ఘనతగా కేసీఆర్‌ చెప్పుకోవడం సరికాదని లక్ష్మణ్‌ దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 70 ఏళ్లలో ఏ పార్టీ చేయలేని విధంగా మారుమూల గ్రామాలకు సైతం విద్యుత్‌ వెలుగులు అందించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఐదేళ్ల పాలనలో విద్యుత్‌ రంగానికి సంబంధించి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదని.. ఒక్క మెగావాట్‌ అదనంగా ఉత్పత్తి చేయలేదని లక్ష్మణ్‌ విమర్శించారు. ఈరోజు తెలంగాణలో 24 గంటలు నిర్విరామంగా విద్యుత్‌ అందించగలుగుతున్నామంటే అది కేవలం ప్రధాని మోదీ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే సాధ్యమైందని చెప్పారు. జాతీయ సోలార్‌ విధానంలో భాగంగా చౌకగా రూ. 4.30పైసలకు సోలార్‌ ఇస్తానంటే రాత్రికి రాత్రే రూ.5.50పైసలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని లక్ష్మణ్‌ ఆరోపించారు. పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తన తప్పులను ఇతరులపైకి నెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అవినీతి పెరిగిందని కలెక్టర్ల సదస్సులో సీఎం ఒప్పుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు కావడంలేదన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close