Featuredప్రాంతీయ వార్తలు

గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు ….ఎస్పీ

హుజూర్‌నగర్ (ఆదాబ్ హైదరాబాద్ ):గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని హుజూర్‌నగర్  శాంతి సంఘాలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో  నియోజకవర్గ స్థాయి శాంతి సమావేశంలో జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడాలన్నారు.డీజేల  ఏర్పాటుకు, బాణసంచా పేల్చడానికి అనుమతి లేదన్నారు మట్టి గణపతిని ఏర్పాటు చేసి పర్యావరణ రక్షణకు పాటుపడాలి.అనుమతితో తక్కువ శబ్దం వచ్చే బాక్స్ లాంటి మైక్ లు ఉపయోగించాలి. ఉదయం 6 గం. నుండి రాత్రి 10 గంటలవరకు సంప్రదాయ గీతాలు ప్రసారం చేయాలి. అన్ని మతాలవారు ఉత్సవాలలో పాల్గొనడం మన మతసమరస్యాన్ని నిదర్శనమన్నారు . మండపాల వద్ద ఉత్సవ కమిటీలు బాధ్యత గా వ్యవహరించాలి.మండపాల ఏర్పాటుకు పోలీసు వారి అనుమతి  తీసుకోవాలన్నారు . అందరూ కలిసి మెలిసి ఉత్సవాలు ఆనందంగా నిర్వహించాలని ఇతరులను ఇబ్బంది కలిగించే విధంగా   వ్యవహరించరాదన్నారు.ప్రత్యేక బందోబస్తు , మండపాలను జియో ట్యాగింగ్ చేస్తున్నాము, SB, ఇంటలిజెన్స్ సిబ్బంది, మఫ్టీ టీమ్స్ తో నిఘా , బిట్స్, బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ ఎల్లప్పుడూ గస్తీ నిర్వహిస్తారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు సహకరించాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఉత్సవకమిటీలు బాధ్యతగా వ్యవహరించాలి. నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో డిఎస్పీ  సుదర్శన్ రెడ్డి,సిఐ  రాఘవరావు, హుజుర్నగర్, మఠంపల్లి , నెరేడుచర్ల, మెల్లచేరువు, పాలకవీడు, చింతలపాలెం ఎస్సైలు , శాంతి సంఘం వారు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.Attachments area

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close