గాడ్జెట్లు

హువావే వాచ్ 2 2018 స్మార్ట్‌వాచ్ విడుదల

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌వాచ్ ‘వాచ్ 2 2018’ ను తాజాగా విడుదల చేసింది. కేవలం బ్లాక్ కలర్ వేరియెంట్‌లో మాత్రమే ఈ వాచ్ విడుదల కాగా ఇందులో ఇ-సిమ్ వెర్షన్‌ను రూ.20,915లకు అందిస్తున్నారు. అలాగే 4జీ నానో సిమ్ వెర్షన్ ధర రూ.19,860 గా ఉంది. ఇక సాధారణ బ్లూటూత్ వేరియెంట్ ధర రూ.17,750 గా నిర్ణయించారు. ఈ వాచ్ ఇప్పటికే చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉండగా త్వరలో భారత్‌లోనూ లభ్యం కానుంది.

హువావే వాచ్ 2 2018 స్మార్ట్‌వాచ్‌లో 1.2 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, 390 x 390 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.1 గిగాహెడ్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ వియర్ 2100 ప్రాసెసర్, 768 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ వియర్ 2.0 ఓఎస్, బారో మీటర్, హార్ట్ రేట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ ఎల్‌టీఈ (ఇ-సిమ్), వైఫై, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 420 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ ఆండ్రాయిడ్ 4.3 ఆపైన, ఐఓఎస్ 8.2 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అందుకు ప్రత్యేకంగా యాప్‌ను కూడా ఆయా యాప్ స్టోర్స్‌లో అందిస్తున్నారు

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close