Featuredస్టేట్ న్యూస్

ముగిసిన హెచ్‌ఆర్‌సీ పర్యటన

వివరాలతో ఢిల్లీకి వెళ్లిన సభ్యులు

హైదరాబాద్‌

వెటరినరీ డాక్టర్‌ దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ విషయమై విచారించేందుకు వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుల రాష్ట్ర పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్ళింది. తమ నివేదికను కమిషన్‌కు సభ్యులు అందించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే… కమిటీ రూపొందించిన నివేదికను కోర్టుకు సమర్పిస్తారు. షాద్‌నగర్‌ ఎన్‌కౌంటర్‌ నిజ నిర్దారణకు వచ్చిన సభ్యులు నాలుగు రోజుల పాటు పలు అంశాలపై వివరాలు సేకరించారు. సంఘటనా స్థలంతో పాటు మృతదేహాలను కమిటీ పరిశీలించింది. ఇక దిశ తల్లిదండ్రులు, సోదరితో మాట్లాడి ఘటన వివరాలను సేకరించారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితుల కుటుంబ సభ్యులను కూడా కలిశారు. ఎన్‌కౌంటర్‌పై వారి ఆరోపణలు, అభ్యంతరాలను సైతం పరిగణలోకి తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను కలిసి అసలు ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించిన తహసీల్దార్లనూ ప్రశ్నించారు. నలుగురు మృతులకు సంబంధించిన డీఎన్‌ఏ, ఫోరెన్సిక్‌ నివేదిక ఇంకా రాకపోవడంతో వాటిని ఢిల్లీకి పంపించాలని సైబరాబాద్‌ పోలీసులకు కమిటీ సూచించింది. న్‌కౌంటర్‌పై నిజనిర్థారణకు వచ్చిన ఏడుగురు సభ్యుల కమిటీకి సీనియర్‌ ఎస్పీ మంజిల్‌ నేతృత్వం వహిస్తున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close